తెదేపా జాతీయ కార్యాలయ కార్యదర్శి, పి. అశోక్‌బాబు, ఈ రోజు స్వరూపానంద స్వామి సెక్యూరిటీ పై, ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. "అవినీతిపరులకు, నేరస్తులకు ఆశ్రయం ఇస్తున్న విశాఖ శారదాపీఠం స్వామి దొంగ స్వామి కాదా? విజయవాడ దుర్గమ్మ దేవాలయంలో అక్రమాలకు పాల్పడ్డ దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను, అధికారులను కాపాడడానికి శారదాపీఠం నేత రంగంలోకి దిగడం వాస్తవం కాదా? వైసీపీ నేతల అవినీతి సొమ్మును శారదాపీఠంలో డంప్‌ చేసినందుకే శారదాపీఠం నేతకు జెడ్‌+ సెక్యూరిటీ కల్పించలేదా? ఏ స్వామికీ లేని జెడ్‌+ సెక్యూరిటీ శారదాపీఠం నేతకు కల్పించాల్సిన అవసరం ఏమిటి? స్వామీజీల గురించి మాట్లాడే అర్హత వైకాపా మంత్రులకు లేదు. రాష్ట్రంలో 168 దేవాలయాలపై దాడులకు పాల్పడినప్పుడు ఒక్క మంత్రయినా స్పందించారా? దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? మీ యొక్క వైఫల్యాలు, నేర రాజకీయాలు కప్పిపుచ్చుకునేందుకు అబద్ధపు ప్రచారాలకు పాల్పడుతున్నారు.

"దేవాలయాల్లో భద్రతా చర్యలపై ఒక్కరోజైనా ముఖ్యమంత్రిగానీ, దేవాదాయ శాఖామంత్రి గానీ సమీక్ష చేశారా? దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చడంపై ఉన్న శ్రద్ధ రక్షణపై లేకపోవడం సిగ్గుచేటు. తిరుమల పవిత్రతను కాపాడింది, ఏడుకొండలకు తెలుగుగంగ నీటిని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడేనన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తిరుమలలో బూట్లు వేసుకుని ప్రవేశించి తిరుమలను అపవిత్రం చేసింది ఏడుకొండలను రెండు కొండలుగా మార్చే ప్రయత్నం చేసింది జగన్‌రెడ్డి & కో కాదా? ఎస్వీబీసీ, టీటీడీ ప్రచురణల్లో అన్యమత ప్రచారం చేసింది జగన్‌ ప్రభుత్వం కాదా? పింక్‌ డైమండ్‌పై తిరుమల ప్రతిష్టకే భంగం వాటిల్లేలా దుష్ప్రచారం చేశారు."

 

నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల పై చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన స్వరూపానంద పై నిప్పులు చెరిగారు.. చంద్రబాబు మాటల్లోనే "డీజీపీ శారదా పీఠం దొంగస్వామి వద్దకు వెళ్తాడు. ఆర్టీసీ ఛైర్మన్ కూడా వెళతాడు. కానుకలన్నీ సమర్పించాలి కదా. నిన్న దుర్గ గుడి ఈవోను సస్పెండ్ చేశారు. ఆయన కూడా నేరుగా దొంగస్వామి వద్దకు వెళతాడు. ముఖ్యమంత్రికి సిగ్గుందా, బుద్ధుందా? ఊడిగం చేయడా నికి దొంగస్వామిని అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేయాలనుకుంటే.. సరికాదు. నిన్ను, ప్రజలందరినీ మోసం చేస్తూ.. ఎవరు తప్పు చేసినా అక్కడికి వెళ్లి కానుకలు సమర్పిస్తే, ఆయన భోగాల కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు? ఏసీబీలో రైడ్ అయిన వ్యక్తి ఆ స్వామి వద్దకు వెళ్తే.. ఆ స్వామి వద్దకు సీఎం వెళితే.. ఇంకేముంది ఈ రాష్ట్రంలో? నువ్వు పోయావు, నీ డీజీ పోతాడు, ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు. ఇదీ చీకటి రాజ్యం, చీకటి పాలన. ఆయన చేసేది క్షుద్రపూజలు. సీఎం కోసం ఆయన మమ్మల్నందరినీ చంపేస్తాడంటా... చంపు. సర్వత్యాగాలు చేసేవారు స్వాములు. భోగాలు అనుభవించే వారు స్వాములు కాదు. అందుకే చాలా మందికి చెడ్డపేరు వస్తోంది. ఎందుకు మీకు పవర్, వ్యామోహం, వేరే మతస్థులను కూడా వెనకేసుకు వస్తున్నారు. మీరు స్వాములా.. రామతీర్థంలో విగ్రహం ధ్వంసం జరిగితే.. ఈ స్వామి మాట్లాడడు. ఈయన హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తాడా? మీరు పైరవీల కోసం పోతున్నారు. ఇది తప్పు."

"ఈ ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ వార్తలు మాత్రమే చెబుతుంటాడు. మీ బాబాయిని ఎవరు చంపారో ఇంత వరకు సమాధానం చెప్పడు. మాబాబాయిని ఎవరో చంపేశారు సీబీఐ విచారణ కావాలన్నావు. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణే అవసరం లేదన్నావు. చివరికి నీ చెల్లెలు కోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ కోసం పోరాడింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ పోస్కోకు కట్టబెట్టడంపై జగన్ రెడ్డి అమాయకంగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి నాకేం తెలియదు అంటున్నాడు. వాళ్లు వచ్చారు. వేరే చోట పెడతామన్నారు. అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు ప్రైవేటీకరణ అవ్వకుండా ప్రయత్నం చేస్తున్నా అంటున్నాడు. పోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం జరిగిందని, విశాఖ స్టీల్ ప్రాంతంలోనే పెడతారని మీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో కేంద్ర మంత్రి చెప్పారు. దానికి మీరేం సమాధానం చెబుతారు.? అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు నాటకాలాడుతున్నాడు. భయపెట్టాలని ఎదురు దాడి చేస్తున్నాడు. పోలీసు వ్యవస్థ జగన్ రెడ్డికి సాగిలపడిపోయి తప్పుడు కేసులు పెడుతోంది. కడుపు రగిలిపోతోంది. 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 12 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. నా దగ్గరా నీ కుప్పి గంతులు.? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా.? ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే ఉంటుంది, సొంతిల్లు కూడా కట్టుకున్నానని జగన్ రెడ్డి ప్రజల్ని నమ్మించాడు. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటావా.? వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు, పీఆర్సీ, ఇంటి స్థలాలు, 45 సంత్సరాలకే పెన్షన్ వంటి ఎన్నో మాటలు చెప్పావ్. ఏమయ్యాయి ఆ మాటలు.? మద్యపాన నిషేధం అంటూ హడావుడి చేసి.. రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు తీసుకొస్తున్నాడు. ఇదేనా మద్యపాన నిషేధం.? ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనే ధీమాతో ఉన్నాడు. ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఏమైనా చెబుతానన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నాడు.
రాజారెడ్డి కత్తుల రాజ్యాంగం తెస్తున్నారు."

"దొంగకు అధికారం ఇవ్వడం ప్రజల తప్పా.? లేక దొంగైనా ముఖ్యమంత్రి కావొచ్చనే పరిస్థితి కల్పించిన రాజ్యాంగానిది తప్పా అని ఓ వ్యక్తి నన్ను ప్రశ్నిస్తే.. నా దగ్గర సమాధానం లేదు. దొంగకే తాళాలిచ్చినపుడు ఏం జరుగుతుందో.. రాష్ట్రంలో నేడు స్పష్టంగా కనిపిస్తోంది. విలువలు లేవు. పద్దతి లేదు. దౌర్జన్యాలకు పాల్పడుతూ పులివెందుల పంచాయతీలు తీసుకొచ్చారు. రాజారెడ్డి కత్తుల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి విలువను మంటగలిపారు. నేను అధికారం కోసం పోరాడడం లేదు. ప్రజల కోసం. రాష్ట్రం కోసం పోరాడుతున్నాను. ప్రజలు కూడా ముందుకు రావలి. భయపడితే వీళ్లు ఇంకా పెచ్చుమీరిపోతారని గుర్తెరగాలి. కుప్పంలో కొన్ని పంచాయతీల్లో వీల్లు గెలిస్తే మగాళ్లంట. అంటే నేను అధికారంలో ఉన్నపుడు పులివెందులలో, పుంగనూరులో పోలీసులను పెట్టి ఈ పని చేయలేకపోయానని మాట్లాడుతున్నారు. ఆ రోజు నేను కూడా మీలా చేసుంటే ఏం చేసేవారు.? మీకు దిక్కెవరు.? నేను ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం పని చేశాను. మీరు మాత్రం పనికిమాలిన రాజకీయాలు చేస్తూ.. నన్ను బెదిరించాలనుకుంటున్నారు. తీవ్రవాదులకు భయపడలేదు.. ప్రజలక శాంతినివ్వడానికి, ముఠా నాయకులకు, రౌడీలకు గూండాలకు భయపడలేదు. మత విద్వేషకులు లేకుండా మత సామరస్యాన్ని కాపాడేందుకు, ప్రజలకు ప్రశాంతత ఇవ్వడానికి. పోలీసులకు స్వేచ్ఛనిచ్చాను. అదే పోలీసులు నేడు మీచేతుల్లో కీలుబొమ్మలుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజల్ని మభ్యబెట్టి కాలం నెట్టుకురావలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడగాల్సింది పోయి.. దుర్మార్గమైన కార్యక్రమాలకు రాత్రింబవళ్లు ప్రజల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు కల్పించారు. దెబ్బలు తిని పోరాటాలు చేసి ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాం. "

ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో ఉన్న వింత వింత పరిస్థితిలు ఎక్కడా ఉండవు. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఏకంగా జడ్జిలను కూడా టార్గెట్ చేస్తారు. ఇదేమీ దాచాల్సిన విషయం కూడా కాదు. ఎందుకుంటే ఏకంగా జగన్ మోహన్ రెడ్డి, నేను పలానా జడ్జిల పై కంప్లైంట్ ఇచ్చానని, ఏకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే చెప్పించారు. తెలుగువారైన ఒక సుప్రీం కోర్టు జడ్జి, రేపు చీఫ్ జస్టిస్ అయితే, తన కేసులు విషయంలో ఏదో చేసేస్తారని, ఇప్పుడే భయపడి పోయి, ఆ సుప్రీం కోర్టు జడ్జిని టార్గెట్ చేయటానికి, అధికార పార్టీ చేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. ఒక పక్క ఇప్పటికీ ఆ సుప్రీం కోర్టు జడ్జి పై, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసారు. అయితే మరో రకంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాట్టు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మొన్నా మధ్య ఒక కేసు హైలైట్ అయ్యింది. సుప్రీం కోర్టు జడ్జికి సంబందించిన వివరాలు తీసుకుని, తన దగ్గరకు రావాలని, అతని సంగతి చూస్తాను అనే విధంగా, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య అలాగే వైసీపీ నేతలు వేధిస్తున్న జడ్జి రామకృష్ణ ఫోన్ సంభాషణలు బయటకు వచ్చాయి.

అయితే ఈ విషయం మళ్ళీ కోర్టుకు చేరుకుంది. జడ్జిల పై కుట్ర పన్నే విధంగా, జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహరించారు అంటూ, జడ్జి రామకృష్ణ హైకోర్టులో కేసు వేసారు. అయితే, దీని పై స్పందించిన హైకోర్టు, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దీని పై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని ఆదేశించింది. అయితే దీని పై జస్టిస్ ఈశ్వరయ్య, సుప్రీం కోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేయాలని కోరారు. ఈ కేసుని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. తన వాయిస్ ని మార్చారు అంటూ ఈశ్వరయ్య వాదించారు. అయినా తాను ఏమి కుట్రలు పన్నలేదని, బయట ప్రచారంలో ఉన్నవే చెప్పానని అన్నారు. అలాగే జడ్జి రామకృష్ణ తరుపు న్యాయవాది స్పందిస్తూ, మొత్తం ఆడియో మీ ముందు ఉంచాం అని, ఇందులో ఎడిట్ చేయటానికి ఏమి ఉంటుంది, అది తప్పుడు ఆరోపణ అంటూ తోసిపుచ్చారు. ఇరువరి వాదనలు విన్న కోర్టు, ఈ పిటీషన్ పై వాదనలు ముగిసాయని, అఫిడవిట్ లు పరిశీలించి, తుది తీర్పు చెప్తాం అని, కేసు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది.

జంగాల వెంకటరమణ (టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తి) చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం, అంగశెట్టిపల్లి గ్రామం. "ఓట్ల లెక్కింపులో నాకు గెలుపు ధృవీకరించారు. డిక్లరేషన్ అడిగేసరికి ఆర్వో, స్టేజ్-2 ఆఫీసర్ కొంతసేపు ఉండమని చెప్పారు. ఈ లోగా ఏ నాయకులు వచ్చారో తెలియదు, ఎమ్మెల్యే ఫోన్ చేసిన తర్వాత ఫలితం ఆపేసి, 3 గంటల నుంచి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన నాకు డిక్లరేషన్ ఇవ్వకుండా, తర్వాత అతడికి ఫోన్ చేసి నిలబెట్టేసి వాళ్లకిచ్చారు. 12 ఓట్ల మెజారిటీ వాళ్లకు ఇచ్చారు. నాకు 120 ఓట్ల మెజార్టీ ఉంది. రీకౌంటింగ్ పెట్టాలని రిక్వెస్ట్ చేసినా నాకు చేయలేదు. దౌర్జన్యం చేస్తూ.. ప్రస్తుత మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా వచ్చి.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, రీకౌంటింగ్ చేసేది లేదని చెప్పారు. మమ్ముల్ని తరిమేసి వారికి డిక్లరేషన్ ఫాం ఇచ్చారు. మాకు అన్యాయం జరిగింది. న్యాయం చేయాలని ఆఫీసర్లను అడిగాను. కోర్టు నుంచి కూడా మేం నోటీసు పంపిస్తున్నాం. ఇంత అన్యాయమైన పాలన ఎప్పుడూ చూడలేదు. 7 వార్డులు మేం గెలిచినప్పటికీ ఇంతవరకు డిక్లరేషన్ ఫాం కూడా ఇవ్వలేదు. నాకు డిక్లరేషన్ ఇచ్చేముందుగా అతనికి ఇచ్చేసి 12 ఓట్ల మెజార్టీ అని చెప్పారు. మాకు న్యాయం చేయండి."

పూర్ణచంద్రరావు, చీఫ్ ఏజెంట్ (గుంటూరు జిల్లా అమరావతి మండలం, ఉంగుటూరు గ్రామం). "నాలుగో దశ పోలింగ్ లో మా సర్పంచ్ టీడీపీ తరపున 58 ఓట్ల తేడాతో గెలిచారు. తర్వాత మమ్ముల్ని పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు రానీకుండా 2 గంటల పాటు రాళ్లదాడి చేశారు. పోలీసులు మాకు రక్షణ కల్పించారు. మళ్లీ ఈ రోజు సర్పంచ్ పై దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేశారు. గతంలోనూ ఒకసారి ఇంటికొచ్చి కొట్టారు. పోలీసులు రావడం 5 ని. ఆలస్యమైతే సర్పంచ్ అభ్యర్థి గల్లంతయ్వేవాడు. మాకు రక్షణ కల్పించాలి." మేదరమెట్ల అనూరాధ, సర్పంచ్ అభ్యర్థి (గుంటూరు జిల్లా అమరావతి మండలం, ఉంగుటూరు గ్రామం). "నేను ఉంగుటూరు సర్పంచ్ గా గెలిచారు. గెలిచిన తర్వాత రాత్రి నుంచి మమ్ముల్ని బయటకు రానీకుండా, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. మా ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. మేదరమెట్ల సోమశేఖర్(మాజీ సర్పంచ్) చంపేస్తామంటూ 70 మంది ఊరిపైకి వచ్చారు. మీరు ఎట్లా తిరుగుతారో చూస్తామని బెదిరిస్తున్నారు. మాకు రక్షణ కల్పించి దాడికి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి".. స్వతంత్ర బాబు (సర్పంచ్ అభ్యర్థి) చిత్తూరు జిల్లా పలమనేరు మండలం, టీఒడ్డూరు గ్రామం. "మా గ్రామంలో వడ్డెర కులం ఎక్కువగా ఉంటుంది. 2107 ఓట్లకు గాను 1746 ఓట్లు పోలయ్యాయి. 9 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఒక వార్డు ఏకగ్రీవం అయింది. 7 వార్డుల్లో టీడీపీ మద్దతుదార్లు గెలిచారు. సర్పంచ్ కు వచ్చే సరికి గందరగోళం చేశారు. టీడీపీ మద్దతుదారునికి 720 ఓట్లు, వైసీపీ మద్దతుదారునికి 699 ఓట్లు, ఇండిపెండెంట్ కు 224 ఓట్లు, చెల్లనివి 77 ఓట్లు రాగా.. ఒక 25 ఓట్ల కట్ట మిస్సైంది... అది వైసీపీ మద్దతుదారుడిదే, కాబట్టి 4 ఓట్లతో డిక్లరేషన్ చేస్తున్నామని చెప్పారు. గ్రామస్థులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. రీకౌంటింగ్ చేయాలని చెప్పినా ఆర్వో తిరస్కరించారు. పైగా నాపై 353 కేసు పెట్టి వేధించారు. మా మద్దతుదారులపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. మా వార్డు మెంబర్లకు డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. ఫలితాలు అనౌన్స్ కూడా చేయలేదు. ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరపలేదు. మాకు న్యాయం చేయండి."

మోహనమ్మ (సర్పంచ్ అభ్యర్థి) (చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం, తీర్థం గ్రామం). "మా గ్రామంలో మొత్తం 220 ఓట్లకు గాను 1933 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 682, వైసీపీకి 682 ఓట్లు వచ్చాయి. కృష్ణవేణి అనే ఆమెకు 527 ఓట్లు వచ్చాయి. నోటాకు 14 వచ్చాయి. చెల్లనివి 28 ఓట్లు. దీంతో కౌంటింగ్ చేస్తే చెరిసమానంగా వచ్చాయి. ఆర్వో చీటీలు వేద్దామని చెప్పారు. సరే అన్నాం. రెండు గంటలు వెయిట్ చేసి.. ఎమ్మార్వో, ఎండీవోను పిలిపించారు. మళ్లీ రీకౌంటింగ్ చేసి చెరొక ఓటు చెల్లలేదని చెప్పి పెండింగ్ లో పెట్టారు. దీంతో ఎండీవో మా మాటలు ఏం పట్టించుకోకుండా దౌర్జన్యంగా చెల్లనివి, నోటావి ఉన్న 42 ఓట్లలో 3 ఓట్లు వైసీపీకి కలిపారు. ప్రశ్నిస్తే.. బయట ఉన్న ప్రజలను పోలీసులు తరిమికొట్టారు. మేం లోపలే ఉండిపోయాం. మాకు ఫోన్ లేదు. మాకు విషయం చెప్పకుండా.. మరుసటి రోజు వైసీపీ 3 ఓట్ల తేడాతో గెలిచారని చెప్పారు. మాకు న్యాయం చేయాలి". మేకల విఠల్ రావు (సర్పంచ్ అభ్యర్థి) గుంటూరు జిల్లా అమరావతి మండలం, వైకుంఠపురం గ్రామం. "మా గ్రామ పంచాయతీ రాత్రి 12 వార్డుల్లో 3 వార్డులు టీడీపీ గెలిచింది. వార్డుల వారీగా చూస్తే వైసీపీ 100 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. సర్పంచ్ కు వస్తే టీడీపీ 17 ఓట్ల మెజార్టీ వచ్చింది. మాకు ఎలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వకుండా, లోపలికి ఎవరినీ రానీకుండా చేశారు. వైసీపీ వారు లోపల సెల్ ఫోన్లు ఇచ్చారు. భారీ బలగాలను మోహరించి, కరెంట్ తీసి.. అందరినీ కొట్టారు. మేం భయపడకుండా అక్కడే ఉన్నాం. 2 గంటల తర్వాత మాకు ధృవీకరణ ఇచ్చారు. ఇప్పుడు మమ్ముల్ని బెదిరిస్తున్నారు. మాకు ఊరేగింపు కూడా లేకుండా వెళ్లాం. వైసీపీ వేధింపుల నుంచి మమ్ముల్ని కాపాడండి."

విద్యార్ధులు బస్ పాస్ పొందాలంటే, అదో ప్రహసనం. ఓ రోజంతా సమయం వృధా, సవాలక్ష ఆంక్షలు, నిబంధనలు, అన్నీ ముగించుకుని బస్తాండ్ కు వెల్తే గంటల కొద్ది క్యూ. ఆ రోజంతా స్కూల్/కాలేజీకి సెలవు. ఇలా లెక్కలేనన్ని ఇబ్దందులతో బస్ పాస్ పొందాల్సి ఉంటుంది.

విద్యారుల అవస్థలను అర్థం చేసుకున్న ఆర్టీసీ సరికొత్త ఆన్లైన్ బస్ పాస్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా బస్ పాస్ దరఖాస్తు చేసుకోవడం, దానిని పొందడం కూడా ఈజీనే.

www.apsrtcpass.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే, పదో తరగతి వరకూ విద్యార్ధులకి, పడవ తరగతి పై బడిన విద్యార్ధులకి వేరు వేరు ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సిన దాని మీద క్లిక్ చేసిన తరువాత, కొత్త పాస్ కోసం రిజిస్టర్ చెయ్యలా ? లేదా పాస్ రెన్యువల్ చేసుకుంటారా అని అడుగుతుంది.

విద్యార్థి పూర్తి పేరు, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, సెల్ ఫోన్ నెంబర్, ఈ-మెల్ అడ్రస్, విద్యార్థి ఫోటో, జిల్లా, మండలం, గ్రామం, ఇంటి నంబరు, ఊరిపేరు తదితర వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరచాలి.

పూర్తి వివరాలకు, ఈ వెబ్సైట్ కి వెళ్లి చూడండి www.apsrtcpass.in

More Articles ...

Advertisements

Latest Articles

Most Read