టీడీపీ జాతీయ కార్యాలయంలో ‘స్కిల్ పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడిచేయడమే’ పుస్తకావిష్కరణ కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీనేతలు కింజరపు అచ్చం నాయుడు, నిమ్మల రామానాయుడు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, ఎం.ఎస్.రాజు, పంతగాని నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడి ప్రసంగం.. “నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితాన్ని ప్రజలకోసమే అంకితం చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబునాయుడిని 28 రోజులుగా జైల్లోనే ఉంచారు. ఆయన్ని అరెస్ట్ చేసినప్పటినుంచీ నేటివరకు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, టీడీపీ అధినేత ఏ తప్పు చేయలేదనే నిజాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ దుష్ప్రచారం చేస్తూ, లేని అవినీతిని ఉన్నట్టు చూపే ప్రయత్నం చేస్తూనే ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేష న్లో అవినీతి జరిగిందని చెప్పారు. అలానే ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లో కూడా అవినీతి జరిగిందని విషప్రచారం చేస్తున్నారు. వాటన్నింటికీ సంబంధించి ఇప్పటికే టీడీపీ ప్రజలకు అనేక వాస్తవాలు తెలియచేసింది. తాజాగా నేడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వ్యవహారానికి సంబంధించిన అన్నివిషయాలు వెల్లడిస్తూ నేడు ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం. అలానే ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాలను కూడా ప్రజలకు తెలియచేసేందుకు వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో పుస్తకాలు విడుదల చేయబోతున్నాం.

తెలుగుదేశం పార్టీకి ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన నిధులకు.. జగన్ సర్కార్ చెబుతున్న అవినీతికి సంబంధమేంటి? చంద్రబాబునాయుడు ఏ తప్పూ చేయలేదని మేం తొలినుంచీ చెబుతున్నాం. కానీ పిచ్చి జగన్, పిచ్చి మంత్రులు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.3,300కోట్ల అవినీ తి జరిగిందని నోటికొచ్చినట్టు మాట్లాడారు. తర్వాత రూ.330కోట్ల అవినీతి అని కారు కూతలు కూశారు. నిన్నటికి నిన్న ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి రూ.27కోట్లు టీడీపీ ఖాతాకు వెళ్లాయంటున్నారు. పొన్నవోలు మతి చలించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు అని అతని మాటల్ని బట్టే అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ అకౌంట్ కు వచ్చిన నిధులకు.. ప్రభుత్వం చెబుతున్న అవినీతికి ఏం సంబంధం? జగన్ రెడ్డి చేసినట్టు అవినీతి చేసి, ఆయన సొంత ఖాతాకో.. ఆయన సంస్థల ఖాతాలకో.. ఆయన భార్య ఖాతాకో నిధులు రాబట్టుకుంటే, అదీ అసలైన అవినీతి. దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. వాటిలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలున్నాయి. అలానే తెలుగుదేశం, వైసీపీ వంటి అనేక ప్రాంతీయ పార్టీ లున్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి చట్టానికి లోబడి పార్టీ ఫండ్ వస్తూంటుంది. అలానే తెలుగుదేశానికి నిధులు వచ్చాయి. ఆ నిధులకు లెక్కలున్నాయి. అలా వచ్చిన నిధు ల్ని అవినీతి సొమ్ము అనే దుస్థితికి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి వచ్చారంటే వీరు ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోండి.

సభ్యత్వాల ద్వారా పార్టీకి వచ్చిన సొమ్ముని అవినీతి సొమ్ముగా చూపడం ఈ ముఖ్యమంత్రి, అతని మోచేతి నీళ్లుతాగే వ్యవస్థల మతిలేనితనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రైవేట్ వ్యక్తులు, ప్రజల నుంచి పార్టీ నిర్వహణ కోసం నిధులు సేకరించలేదు. పార్టీని స్థాపించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారైనా, చంద్రబాబునాయుడైనా కార్యకర్తల నుంచి సభ్యత్వ రుసుము రూపంలో వచ్చి న సొమ్ముతోనే పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. పార్టీ ఏ రకంగా నడుస్తోంది.. సభ్య త్వం ద్వారా వచ్చే సొమ్ము వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా తెలియచేస్తున్నాం. అలా వచ్చిన సొమ్ముని అవినీతి సొమ్ముగా చూపి చంద్రబాబు ద్వారా లబ్ధిపొందిన వారే పార్టీకి నిధులిచ్చారని చెప్పడం ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి, అతని మోచేతి నీళ్లు తాగే వ్యవస్థల మతిలేనితనానికి నిదర్శనం.” అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read