• ఉచిత వైద్య సహాయమును రూ. 2 లక్షల నుండి రూ. 2.5 లక్షలకు పెంపు
  • వినికిడి లోపము ఉన్న చిన్నపిల్లలకు రూ. 6 లక్షల వరకు చికిత్స
  • మూత్రపిండ మార్పిడి చికిత్స ఆపరేషన్ కు రూ. 3.5 లక్షలు
  • గుండె - ఊపిరి తిత్తులు మార్పిడి చికిత్సకు వైద్యం
  • ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు ఉచిత వైద్యం
  • రాష్ట్రంలోని 421 ఆసుపత్రుల్లో చికిత్స
  • 944 చికిత్సలతోపాటు అదనంగా వంద చికిత్సలు
  • మొత్తము 1044 చికిత్సలకు ఉచితంగా వైద్య చికిత్స

ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ‘అందరికీ ఆరోగ్యం’ పేరుతో రూపొందించిన ఈ పథకానికి పేద ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కాయకష్టం చేసుకుంటే కానీ పూటగడవని నిరుపేదలకు ఈ పథకం వరంలా మారింది. అనుకోకుండా జబ్బుల బారిన పడి.. వైద్య పరీక్షలకు, ఆపరేషన్లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేని పేదలంతా ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్నే ఆశ్రయిస్తున్నారు. చిన్న చిన్న జబ్బుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో వైద్యం అందుతుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక.. 2014 జూన్ 2 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ప్రారంభించారు. రాష్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కోటీ 30 లక్షలకు పైగా కుటుంబాలను ఈ పథకంలో చేర్చారు. 29 విభాగాలకు చెందిన 1044 వ్యాధులకు సంబంధించి రెండున్నర లక్షల రూపాయల విలువైన వైద్య పరీక్షలు, ఆపరేషన్లను ఈ పథకంలో నిర్వహిస్తారు. ఈ పథకం కింద కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా.. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లోనూ వైద్యం చేయించుకునే అవకాశం ఉండటం పేద ప్రజలకు సౌకర్యంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 73 ప్రభుత్వ హాస్పిటళ్లనే కాకుండా.. 338 ప్రైవేటు హాస్పిటళ్లను ఈ పథకంలో చేర్చి.. పేదలకు వైద్యం అందేలా చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగ్గా వైద్యం చేయరన్న భయంతో ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లి.. ఉన్నదంతా అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని బాధపడే పేదలు కూడా.. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వైపు చూస్తున్నారు. దీంతో క్రమేపీ ఈ పథకం కింద వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించి, నాణ్యమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయించారు. రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను కూడా ఆధునీకరించేలా చర్యలు తీసుకున్నారు. ఐసీయూలు, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు, వైద్య సేవల విస్తృతి, మందుల కోసం నిధుల పెంపు, హాస్పిటళ్లలో పారిశుధ్యం మెరుగుకు చర్యలతో.. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటళ్లు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ ను తలదన్నేలా తయారయ్యాయి.

పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. ముఖ్యంగా నిరుపేదలకు ఈ పథకం సంజీవినీగా మారుతోంది. ఎలాంటి ఖర్చు లేకుండా... అన్ని విధాలుగా ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ గుర్తింపు కార్డులతో వైద్యం అందిస్తోంది. జూన్ 2, 2014 నుంచి ఈ పథకం కింద చికిత్స అందిస్తున్నారు. ఇంతకు మునుపు ఉన్న 944 చికిత్సలకు అదనముగా 100 చికిత్సలను చేర్చి, మొత్తము 1044 చికిత్సలకు అనుమతి పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచితముగా వైద్య సేవలను అందిస్తున్నారు. అంతేకాకుండా సంవత్సరానికి ఒక కుటుంబానికి ప్రభుత్వం వారు ఇంతకు మునుపు ఇస్తున్న ఉచిత వైద్య సహాయాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. వినికిడి లోపము ఉన్న చిన్నపిల్లలకు చేయు కాక్లియార్ ఇంప్లాంటేషన్ కు రూ. 6 లక్షల వరకు మరియు మూత్ర పిండ మార్పిడి లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లకు రూ. 3.5 లక్షల వరకు ఈ పథకం కింద లబ్దిపొందవచ్చు. గుండె , ఊపిరి తిత్తులు మరియు గుండె - ఊపిరి తిత్తులు మార్పిడి చికిత్స కూడా ఈ పథకంలో చేర్చారు. దీని ద్వారా నిరుపేదలకు ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు అప్పులబారిన పడకుండా ప్రభుత్వం వారికి వైద్య సహకారాన్ని అందిస్తోంది.

ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద 02-06-2014 నుండి ఇప్పటివరకు అవుట్ పేషంట్ల సంఖ్య 13,06,773... అలాగే ఇప్పటివరకు ఇన్ పేషంట్ల సంఖ్య 14,28,813... ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద 02-06-2014 నుండి ముందుగా అనుమతి తీసుకొని వైద్యం చేయించుకున్నవారు 8,64,517. వారి చికిత్స కోసం అయిన మొత్తం రూ. 2528.079 కోట్లు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన మొత్తం ఆపరేషన్లు 12,78,583. ఆపరేషన్ల కోసం ఖర్చయిన మొత్తం రూ. 3728.997 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లింపుల కోసం వచ్చిన క్లెయిమ్ లు 11,87,309 గా ఉన్నాయి. క్లెయిమ్ ల కోసం చెల్లించిన మొత్తం రూ. 3138.245 కోట్లుగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి 133 వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులకే కేటాయించడమైనది. 133 వైద్య సేవలు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన 911 (1044-133=911) వైద్య సేవల సంఖ్య 3,05,357 గా ఉంది, ఈ వైద్య సేవలకు వెచ్చించిన ఖర్చు రూ. 801.524 కోట్లకు చేరుకొంది. ఇక 133 వైద్య సేవలకు సంబంధించి ముందుగా అనుమతి తీసుకున్నవారి సంఖ్య 48,560గా ఉన్నాయి, ఈ సేవల కోసం వెచ్చించిన మొత్తం రూ. 137.306 కోట్ల మేర చెల్లించారు. 133 వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య 103 గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నిరుపేదల తమ జీవన సౌధాన్ని పునర్నిర్మించుకుంటున్నారు. లక్షల రూపాయలు వైద్యం కింద చెల్లించడం తమ వల్లే అయ్యేది కాదని... రాష్ట్ర ప్రభుత్వం తమకు ఈ విధంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో తమ జీవితాలకు భరోసా వచ్చిందని వారు భావిస్తున్నారు. చికత్స తీసుకున్న ప్రతి పేషెంట్ వివరాలు, అయన ఖర్చు, సమయం, హాస్పిటల్ పేరు ఇలా అన్నీ కోర్ డ్యాష్ బోర్డులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి... ప్రతి పైసాకి పూర్తి జవాబుదారీతనం ఉంటుంది.. http://www.core.ap.gov.in/CMDashBoard/UserInterface/HealthFamilyWelfare/NTRVaidhyasevaMainReport.aspx

Advertisements

Advertisements

Latest Articles

Most Read