రాష్ట్రంలోని ప్రజల కష్టాలను చూడని గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా వినూత్న నిరసన చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆయన పిలుపు ఇచ్చారు. రేపు రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి బయటకు వచ్చి ఐదు నిమిషాలు సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించాలని లోకేష్ పిలుపునిచ్చారు. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ కొట్టాలని ఆయన తెలిపారు.

చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా, గత 27 రోజులుగా తెలుగుదేశం పార్టీ వివిధ రూపాల్లో నిరసన తెలుపుతుంది. గత వారం, మోత మొగిద్దాం అంటూ, రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమం చేసి, రాష్ట్రం మొత్తం మోత మోగించారు. ఈ వారం, లైట్లు ఆర్పి, సెల్ ఫోన్ వెలుగుల్లో నిరసన తెలపాలని లోకేష్ పిలుపు ఇచ్చారు. టీడీపీ శ్రేణులు ఈ నిరసనను విజయవంతం చేయాలని లోకేష్ కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read