మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టు తీరుపై, పోలీసుల మీద హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంపై పోలీసులపై ధర్మాసనం విమర్శలు గుప్పించింది. ఈ కేసును సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు తీసుకోవడంతో పాటు, దర్యాప్తు అధికారిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్స్ చేస్తామని హెచ్చరించింది. బండారు సత్యనారాయణ మూర్తి తరపు న్యాయవాది సతీష్ మాట్లాడుతూ, అర్నేష్‌కుమార్ కేసులో బండారుకు 41ఏ నోటీసులు ఇవ్వలేదని ముందుగా చెప్పారని, ఇప్పుడేమో 41ఏ నోటీసులు ఓరిజినల్ కాఫీ ఫైల్ చేశామంటున్నారని అన్నారు. దీనిపై హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. నోటీసులు అందలేదని ఎలా చెబుతారని నిలదీసింది.

ఇంత సీరియస్ మ్యాటర్‌లో కౌంటర్ వేస్తామని చెప్పి ఎందుకు వెయ్యలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 41ఏ నోటీసులు తీసుకోకపోతే వెంటనే ఎలా అరెస్ట్ చేస్తారని, ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో పోలీసులు విఫలమయ్యారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు తీసుకోవడంతో పాటు, దర్యాప్తు అధికారిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్స్ చేస్తామని హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 2నకు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read