నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల పై చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన స్వరూపానంద పై నిప్పులు చెరిగారు.. చంద్రబాబు మాటల్లోనే "డీజీపీ శారదా పీఠం దొంగస్వామి వద్దకు వెళ్తాడు. ఆర్టీసీ ఛైర్మన్ కూడా వెళతాడు. కానుకలన్నీ సమర్పించాలి కదా. నిన్న దుర్గ గుడి ఈవోను సస్పెండ్ చేశారు. ఆయన కూడా నేరుగా దొంగస్వామి వద్దకు వెళతాడు. ముఖ్యమంత్రికి సిగ్గుందా, బుద్ధుందా? ఊడిగం చేయడా నికి దొంగస్వామిని అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేయాలనుకుంటే.. సరికాదు. నిన్ను, ప్రజలందరినీ మోసం చేస్తూ.. ఎవరు తప్పు చేసినా అక్కడికి వెళ్లి కానుకలు సమర్పిస్తే, ఆయన భోగాల కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు? ఏసీబీలో రైడ్ అయిన వ్యక్తి ఆ స్వామి వద్దకు వెళ్తే.. ఆ స్వామి వద్దకు సీఎం వెళితే.. ఇంకేముంది ఈ రాష్ట్రంలో? నువ్వు పోయావు, నీ డీజీ పోతాడు, ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు. ఇదీ చీకటి రాజ్యం, చీకటి పాలన. ఆయన చేసేది క్షుద్రపూజలు. సీఎం కోసం ఆయన మమ్మల్నందరినీ చంపేస్తాడంటా... చంపు. సర్వత్యాగాలు చేసేవారు స్వాములు. భోగాలు అనుభవించే వారు స్వాములు కాదు. అందుకే చాలా మందికి చెడ్డపేరు వస్తోంది. ఎందుకు మీకు పవర్, వ్యామోహం, వేరే మతస్థులను కూడా వెనకేసుకు వస్తున్నారు. మీరు స్వాములా.. రామతీర్థంలో విగ్రహం ధ్వంసం జరిగితే.. ఈ స్వామి మాట్లాడడు. ఈయన హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తాడా? మీరు పైరవీల కోసం పోతున్నారు. ఇది తప్పు."

"ఈ ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ వార్తలు మాత్రమే చెబుతుంటాడు. మీ బాబాయిని ఎవరు చంపారో ఇంత వరకు సమాధానం చెప్పడు. మాబాబాయిని ఎవరో చంపేశారు సీబీఐ విచారణ కావాలన్నావు. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణే అవసరం లేదన్నావు. చివరికి నీ చెల్లెలు కోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ కోసం పోరాడింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ పోస్కోకు కట్టబెట్టడంపై జగన్ రెడ్డి అమాయకంగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి నాకేం తెలియదు అంటున్నాడు. వాళ్లు వచ్చారు. వేరే చోట పెడతామన్నారు. అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు ప్రైవేటీకరణ అవ్వకుండా ప్రయత్నం చేస్తున్నా అంటున్నాడు. పోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం జరిగిందని, విశాఖ స్టీల్ ప్రాంతంలోనే పెడతారని మీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో కేంద్ర మంత్రి చెప్పారు. దానికి మీరేం సమాధానం చెబుతారు.? అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు నాటకాలాడుతున్నాడు. భయపెట్టాలని ఎదురు దాడి చేస్తున్నాడు. పోలీసు వ్యవస్థ జగన్ రెడ్డికి సాగిలపడిపోయి తప్పుడు కేసులు పెడుతోంది. కడుపు రగిలిపోతోంది. 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 12 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. నా దగ్గరా నీ కుప్పి గంతులు.? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా.? ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే ఉంటుంది, సొంతిల్లు కూడా కట్టుకున్నానని జగన్ రెడ్డి ప్రజల్ని నమ్మించాడు. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటావా.? వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు, పీఆర్సీ, ఇంటి స్థలాలు, 45 సంత్సరాలకే పెన్షన్ వంటి ఎన్నో మాటలు చెప్పావ్. ఏమయ్యాయి ఆ మాటలు.? మద్యపాన నిషేధం అంటూ హడావుడి చేసి.. రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు తీసుకొస్తున్నాడు. ఇదేనా మద్యపాన నిషేధం.? ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనే ధీమాతో ఉన్నాడు. ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఏమైనా చెబుతానన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నాడు.
రాజారెడ్డి కత్తుల రాజ్యాంగం తెస్తున్నారు."

"దొంగకు అధికారం ఇవ్వడం ప్రజల తప్పా.? లేక దొంగైనా ముఖ్యమంత్రి కావొచ్చనే పరిస్థితి కల్పించిన రాజ్యాంగానిది తప్పా అని ఓ వ్యక్తి నన్ను ప్రశ్నిస్తే.. నా దగ్గర సమాధానం లేదు. దొంగకే తాళాలిచ్చినపుడు ఏం జరుగుతుందో.. రాష్ట్రంలో నేడు స్పష్టంగా కనిపిస్తోంది. విలువలు లేవు. పద్దతి లేదు. దౌర్జన్యాలకు పాల్పడుతూ పులివెందుల పంచాయతీలు తీసుకొచ్చారు. రాజారెడ్డి కత్తుల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి విలువను మంటగలిపారు. నేను అధికారం కోసం పోరాడడం లేదు. ప్రజల కోసం. రాష్ట్రం కోసం పోరాడుతున్నాను. ప్రజలు కూడా ముందుకు రావలి. భయపడితే వీళ్లు ఇంకా పెచ్చుమీరిపోతారని గుర్తెరగాలి. కుప్పంలో కొన్ని పంచాయతీల్లో వీల్లు గెలిస్తే మగాళ్లంట. అంటే నేను అధికారంలో ఉన్నపుడు పులివెందులలో, పుంగనూరులో పోలీసులను పెట్టి ఈ పని చేయలేకపోయానని మాట్లాడుతున్నారు. ఆ రోజు నేను కూడా మీలా చేసుంటే ఏం చేసేవారు.? మీకు దిక్కెవరు.? నేను ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం పని చేశాను. మీరు మాత్రం పనికిమాలిన రాజకీయాలు చేస్తూ.. నన్ను బెదిరించాలనుకుంటున్నారు. తీవ్రవాదులకు భయపడలేదు.. ప్రజలక శాంతినివ్వడానికి, ముఠా నాయకులకు, రౌడీలకు గూండాలకు భయపడలేదు. మత విద్వేషకులు లేకుండా మత సామరస్యాన్ని కాపాడేందుకు, ప్రజలకు ప్రశాంతత ఇవ్వడానికి. పోలీసులకు స్వేచ్ఛనిచ్చాను. అదే పోలీసులు నేడు మీచేతుల్లో కీలుబొమ్మలుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజల్ని మభ్యబెట్టి కాలం నెట్టుకురావలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడగాల్సింది పోయి.. దుర్మార్గమైన కార్యక్రమాలకు రాత్రింబవళ్లు ప్రజల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు కల్పించారు. దెబ్బలు తిని పోరాటాలు చేసి ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాం. "

Advertisements

Advertisements

Latest Articles

Most Read