సమాజంలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పధంలో నడిపిస్తూ, అందరికీ సరైన గౌరవం ఇస్తూ, అన్ని రకాల పధకాలతో, ఆర్ధికంగా, సామజీకంగా ఆడుకుంటున్న చంద్రబాబు, ముస్లిం సోదరులను కూడా అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు...

చంద్రన్న రంజాన్ తోఫా:
పేద ముస్లింలు కూడా రంజాన్ పండుగను సంతోషంగా చేసుకోవాలన్న ఆకాంక్షతో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రన్న రంజాన్ తోఫాను 11.3 లక్షల కుటుంబాలకు అందించింది. చంద్రన్న రంజాన్ తోఫా కోసం ప్రభుత్వం రూ. 65.36 కోట్ల విడుదల చేసింది. క్కో కార్డుదారునికి ఐదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమ్యా, 100 గ్రాముల నెయ్యితో కూడిన గిఫ్ట్‌ ప్యాక్‌ను రేషన్ షాపుల ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు.

ఇమామ్లకు, మౌజన్లకు పారితోషికం:
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి 2017-18 బడ్జెట్లో రూ. 840.25 కోట్ల కేటాయించింది. పేదరికంలో మగ్గుతున్న 5000 మసీదులలోని ఇమామ్లకు, మౌజన్లను పారితోషికం కింద గత ఏడాది రూ.24 కోట్ల కేటాయిస్తే, ఈ ఏడాది బడ్జెట్లో రూ.32 కోట్లు కేటాయించారు.

దుల్షన్ పథకం:
ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ముస్లిం, మైనార్టీ కుటుంబాల యువతులకు దుల్షన్‌ పథకం ద్వారా రూ.50వేలు అమ్మాయి పేరిట బ్యాంకు ఖాతాలో వేస్తారు. దుల్షన్ పథకం కింద గత ఏడాది రూ.49.11 కోట్ల కేటాయిస్తే, 9,822 మంది లబ్దిపొందితే, ఈ ఏడాది రూ. 60 కోట్ల కేటాయింరు, దీంతో 12,000 మంది ముస్లిం వధువులు లబ్దిపొందుతారు.

రోష్ని పథకం:
మైనార్టీ వితంతువులు, భర్త నుంచి విడాకులు పొందిన మహిళలు, అంగవైకల్య మహిళలకు మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 75 శాతం సబ్సిడీతో రూ.25 వేలు ఆర్థిక సాయం

ఆదరణ పథకం:
చిరు వ్యాపారులకు యూనిట్‌కు రూ.25వేలు సబ్సిడీ, ఆదరణ పథకం ద్వారా రూ.10వేలు నుంచి రూ.25 వేలు వరకూ ఆర్థిక సాయం.

నిరుద్యోగ యువతకు సబ్సిడి ద్వారా రుణ సాయం:

మైనారిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్:
అలాగే 2016-17లో ఫీజు రీయింబర్స్మెంట్ కింద 203.45 కోట్ల, మెయింటెనెన్స్ ఫీజు కింద రూ. 44.69 కోట్ల ఇస్తే, 1,08,322 మంది విద్యార్థులు లబ్ది పొందారు. 2017-18లో ఫీజు రీయింబర్స్మెంట్ కు రూ. రూ.225.00 కోట్ల, మెయింటెన్స్ ఫీజు కింద రూ. 60 కోట్ల కేటాయించారు.

దుకాన్‌-మకాన్‌ పథకం:
మైనార్టీల సంక్షేమానికి రూ.379 కోట్లు కేటాయుంచిన ప్రభుత్వం, ‘దుకాన్‌-మకాన్‌’ పథకం కింద యూనిట్‌ విలువలో 50 శాతం గరిష్ఠంగా రూ.లక్ష దాకా సబ్సిడీ ఇస్తుంది.

మసీదుల కోసం:
2016-17లో 57 మసీదులకు 6.99 కోట్ల ఆర్థిక సహాయం అందజేశారు.

మైనారిటీలకు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం:
ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని 300 మంది ముస్లిం విద్యార్థులకు వర్తింపజేస్తే, మైనారిటీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవటానికి ఒక్కొక్క విద్యార్ధికి రూ. 10 లక్షల సహాయం అందచేసారు.

హజ్ హౌస్:
కడప లో హజ్ హౌస్ నిర్మాణానికి 12 కోట్ల, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి రూ 11 కోట్ల కేటాయించారు.

ఉర్దూ భాషాభివృద్ధికి:
ఉర్దూ భాషాభివృద్ధికి రూ. 20 కోట్లు కేటాయింపు

మక్కా యాత్రకు:
ముస్లిం సోదరులకు పవిత్ర మక్కా యాత్రకు ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 2,810మంది హజ్‌ యాత్రకు.

ముస్లింలకు శాసనమండలి చైర్మన్‌ పదవి:
శాసనమండలి ఛైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫరూఖ్‌

మండలి చైర్మన్ గా:
ముస్లిం సమాజ అభివృద్ధి ముస్లింల పట్ల విశ్వాసాన్ని చూపుతూ, ఎం ఎల్ సి గా ఫరూక్ గారికి, ఉర్దూ అకాడమీ చైర్మెన్ నోమాన్ గారికి పదవులు ఇచ్చి, మండలి చైర్మన్ పదవి కూడా ముస్లింలకు ఇచ్చి, ముస్లిం సోదరుల నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ మరోమారు చంద్రబాబు తాను ముస్లిం పక్షపాతిని అని నిరూపించుకున్నారు.

ఇలా అన్ని రకాలుగా, రాష్ట్రంలోని ముస్లిం సోదరులను, చంద్రబాబు ప్రభుత్వం ఆదుకుని, అండగా ఉంటుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read