రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని సమాచారం ఉందని ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే ఉద్యోగులు జాగ్రతలు పాటించండి అంటూ ఓ జిల్లా కలెక్టర్ ఉద్యోగులకు సూచించారు. సదరు కలెక్టర్ ఆ మాటలు చెప్పటంతో ఆ సమావే శంలో ఉన్న ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సదరు కలెక్టర్ కు అధికార వైసీపీకి వీర విధేయుడు అని ఆ జిల్లాలో పేరుంది. అలాంటి వీర విధేయుడి నోట స్వయంగా ప్రభుత్వం మారబోతున్నట్టుగా జాగ్రత్తలు చెప్పటం సమావేశానికి హాజరైన ఉద్యోగులకు ఆనందం కలిగించింది. దీన్ని బట్టి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుందన్న విశ్వాసం ఉద్యోగుల్లో మరింత పెరిగింది. కలెక్టర్ గురించి తెలిస్తే వైసీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో అని ఆ జిల్లా ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read