ఢిల్లీ పెద్దల పాదాలు కనిపిస్తే చాలు, A1, A2 వాలిపోతున్నారు.. A1కు ఢిల్లీ పెద్దలను కలిసే ఛాన్స్ లేక కాని, లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో రామ్ నాథ్ కోవింద్ పై ఎలా పడ్డాడో చూసాం.. ఇక A2 గారి సంగతి అయితే చెప్పేది ఏముంది, ప్రత్యేక్షంగా ఒక 10 సందర్భాలు అయినా చూసి ఉంటాం... ఒక ఇద్దరు ఆర్ధక నేరగాళ్ళు, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో A1, A2, 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న వీళ్ళు, అవలీలగా వెళ్లి ఒక దేశ ప్రధానిని కలుస్తూ, ప్రాధాన మంత్రి ఆఫీస్ లోనే ఉంటూ, రాష్ట్రం పై ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో చూస్తూనే ఉన్నాం...

vijayasai 28032018 2

నిన్న రాజ్యసభలో, కాలు మీద కాలు వేసుకున్న ప్రధాని మోడీ కాళ్ళ పై పడి ఆశీర్వాదం తీసుకున్నారు A2... ఒక పక్క రాష్ట్రంలోని 5 కోట్ల మంది, మోడీ పైనే యుద్ధం చేస్తుంటే, అలాగే మోడీ మనకు అన్యాయం చేస్తుంటే, ఇటు విజయసాయి రెడ్డి మాత్రం, మోడీ కాళ్ళకు మొక్కి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల కాళ్ళ దగ్గర పెట్టారు... ఈ విషయం వార్తల్లో రావటంతో, బయటకు వచ్చి కచ్చి ఎలా తీర్చుకోవాలో తెలియక, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు... నా ఇష్టం వచ్చినన్ని సార్లు మోడీని కలుస్తా అంటూ, మీ చావు మీరు చావండి అన్నట్టు రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నాడు...

vijayasai 28032018 3

అయితే, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మరో సారి షాక్ కు గురయ్యే వార్త... 5 కోట్ల ఆంధ్రులు మోడీ పై పోరాడుతుంటే, ఇదే మోడీ చేత తాను రాసిన పుస్తకం విడుదల చేపించనున్నాడు A2 విజయసాయి రెడ్డి... మళ్ళీ కాళ్ళ పై పడే సీన్ ఈ రాష్ట్ర ప్రజలు చూడనున్నారు... "వెంకటేశ్వర వైభవం" అనే పుస్తకం రాసాడు అంట A2.. ఈ పుస్తకం ఆవిష్కరించడం కోసం మోడీని టైం అడిగితే, సరే అన్నారు అంట... తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు మన ప్రధానికి కనపడవు కాని, A2 రాసిన పుస్తకం మాత్రం విడుదల చేస్తారంట... ఆయినే, 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న వాడికి, ప్రధాని స్థాయి వ్యక్తి ప్రోత్సహిస్తున్నాడు అంటే, ఇంకా ఏమి చెప్పాలి ?

డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశంసించారు. తమిళనాడులోని ఈరోడ్ లో పార్టీకి సంబంధించిన బహిరంగసభలో పాల్గొన్న ఆయన చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఏమాత్రం సిగ్గూశరం రోషముంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఏ విధంగా నిలదీస్తున్నారో ఓసారి చూసి తెలుసుకోవాలన్నారు.

stalin 28032018 1

తమిళనాడులోని ఈరోడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు కేంద్రం ముందు సాష్టాంగపడి, రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. బలహీనమైన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ చెప్పుచేతల్లో పెట్టుకుందని... తద్వారా తమిళనాడుపై పెత్తనం చెలాయిస్తోందని మండిపడ్డారు. వీరిద్దరూ కేంద్రం ముందు సాష్టాంగపడి, రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.

stalin 28032018 1

కేంద్ర ప్రభుత్వం ఎదుట సాష్టాంగపడిన, చేవ, తెగువ, వెన్నెముక లేనటువంటి పాలన తమిళనాడులో కొనసాగుతోందని స్టాలిన్ విమర్శించారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేసే విషయంలో తమిళనాడును కేంద్రం వంచిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు ఉన్న తెగువ, స్వాభిమానం, పౌరుషం, పోరాటపటిమ పళని, పన్నీర్ సెల్వంలకు ఎందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు.

 

ఒక పక్క అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రం చేస్తున్న అన్యాయం పై, రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పై అన్నీ చెప్పుకుంటూ, ఆవేశంగా ప్రసంగిస్తూ ప్రజల ఆకాంక్షను వినిపిస్తూ వస్తున్నారు... ఈ లోపు, నిన్న విజయసాయి రెడ్డి చేసిన పిచ్చి వాగుడు గురించి, చంద్రబాబు గుర్తుతెచ్చుకున్నారు... ఇంతలా కష్టపడుతూ, ఢిల్లీ పై పోరాటం చేస్తుంటే, అదే ఢిల్లీ నాయకుల కాళ్ళ మీద పడి, బయటకు వచ్చి, చనిపోయిన నా తల్లిదండ్రుల పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ, తన తల్లిని గుర్తు చేసుకుంటూ, చంద్రబాబు భావోద్వేగానికి గురైయ్యారు... కొంచెం సేపు మాట కూడా రాకుండా, అలా ఉండిపోయారు... 12 ఏళ్ళ కిత్రం రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు తల్లి గురించి, ఇలాంటి మాటలే మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే బాధపడ్డారు... మళ్ళీ 12 ఏళ్ళ తరువాత, ఈ రోజు మళ్ళీ ఆయన తల్లిని కించపరుస్తూ మాట్లాడిన మాటలతో చంద్రబాబు మరోసారి బాధపడ్డారు...

cbn emotion 28032018 1

ఇది చంద్రబాబు తన తల్లిని గుర్తు చేసుకుని భావోద్వేగంతో మాట్లడిని మాటాలు "నిన్న చుస్తే, ఒక నిందితుడు, ప్రధాన మంత్రి కాళ్ళకి దండం పెట్టి, బయటకు వచ్చి, ఒక తండ్రికి, ఒక తల్లికి పుట్టినావడైతే అంటూ నన్ను సంభోదించాడు... మన సంస్కృతీ ఏంటి ? బాధ వెయ్యదా ? మనందరికీ తల్లి తండ్రి అంటే ఎంత ఎమోషన్ ఉంటుంది.. వారిని దేవుళ్ళతో సమానంగా చూస్తాం... వారు చనిపోతే కూడా, డీప్ సెంటిమెంట్ ఉంటుంది... వారి ఫోటోలకి దేవుళ్ళతో సమానంగా పూజిస్తాం.. వారి ఆత్మ, వారి ఆశీస్సులు మనతో ఉండాలని... సంక్రాంతి రోజున చనిపోయిన పెద్దలకు పండుగ చేస్తాం, మీ ఆశీస్సులు మాకు ఉండాలని ప్రార్దిస్తాం"

cbn emotion 28032018 1

"అలాంటి సంస్కృతిలో, తల్లి దండ్రుల గురించి మాట్లాడే సంస్కృతి వీళ్ళది. ఎంత బాధ వేస్తుని, ఎంత ఆవేదన ఉంటుంది ? నేను మనిషినే, నాకు బాధ ఉంది, ఆవేదన ఉంది... మహిళలను గౌరవించి, తల్లిని ఆరధించే సమాజం మనిది... మా తల్లితో నా కోసం ఎంతో కష్టపడి, ఇంతవరకు పెంచింది... ప్రతి ఒక్కరికి తల్లితో సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది... అందరికీ ఉన్నట్టే, మా తల్లిని అంటే, మా తల్లిని కించపరిస్తే నాకు బాధ ఉంటుంది... అయనా పడతాను. ప్రజల కోసం పడతాను... నేను ఒక ఆశయం కోసం పని చేస్తున్నా, వారి కోసం ఇలాంటివి పడతాను" అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు...

నరేంద్ర మోడీ ప్రభుత్వం, అవిశ్వాస నోటీసు చర్చకు రాకుండా, ఎందుకు పారిపోతుందో, ఇప్పుడు తెలుస్తుంది... సొంత పార్టీ ఎంపీలే బహిరంగంగా మోడీ పై తిరుగుతుబాటు ప్రకటిస్తున్నారు... బహిరంగంగానే ఇలా ఉంటే, ఇంకా సమయం కోసం ఎదురు చూస్తున్న వారు ఇంకా ఎంత మంది ఉన్నారో, అందుకే మోడీ ప్రభుత్వం, అవిశ్వాసం నుంచి పారిపోతుంది... ఈ రోజు, బీజేపీయేతర ఫ్రంట్ కోసం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, బీజేపీ ఎంపీలే వెళ్లి కలిసారంటే, మోడీ పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉందో తెలుస్తుంది.. ఇదే టైంలో, మరో ఎంపీ కూడా తిరుగుబాటు ప్రకటించారు...

modi 28032018

పార్లమెంటులోని పార్టీ కార్యాలయంలో ఉంటూ వివిధ పార్టీల ఎంపీలను మమత కలుసుకుంటున్నారు. బీజేపీలో ఉంటూనే ఆ పార్టీ విమర్శకులుగా పేరున్న శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హాలను మమత ఇవాళ కలుసుకున్నారు. మహాకూటమిని ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే అంశంపై, మమతా ఇప్పటికే చొరవ తీసుకున్న సంగతి తెలిసిందే... ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత గోపాల్ యాదవ్, డీఎంకే నేత కనిమొళి, శివసేన ఎంపీలను మంగళవారంనాడే మమతా బెనర్జీ కలుసుకున్నారు... అయితే బీజీపీ ఎంపీలు కూడా మోడీ పట్ల వ్యతిరేకత చూపిస్తూ, మమతను కలవటం ఆసక్తిగా మారింది..

modi 28032018

ఇది ఇలా ఉండగా, యూపీకి చెందిన బీజేపీ దళిత ఎంపీ సావిత్రిబాయి పూలె సొంత పార్టీపైనే తిరుగుబాటు చేశారు. మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని... బడుగు, బలహీనవర్గాలకు ప్రస్తుతం అందిస్తున్న రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా... ఏప్రిల్ 1వ తేదీన లక్నోలో తాను ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇలా ప్రధాని మోడీ పై సొంత పార్టీ నేతలే అవిశ్వాసం ప్రకటిస్తుంటే, ఇంకా విపక్షాల సంగతి చెప్పేది ఏముంది. అందుకే వీరు చర్చకు భయపడుతూ, వాయిదా వేసుకుని వెళ్ళిపోతున్నారు...

Advertisements

Latest Articles

Most Read