విజయవాడలో జాతీయ రహదారిపై బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సరికొత్త డిజైన్ రూపుదిద్దుకుంటోంది. అత్యంత సుందరంగా కనిపించేలా ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఫ్లై ఓవర్‌ నిర్మాణం జరగనుంది. నిర్మాణానికి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దేశంలోనే రెండో సుందర పైవంతెనగా దీన్ని నిర్మించాలని ఆదేశించారు. మంగళవారం డిజైన్లను సీఎం పరిశీలించారు, ఫ్లై ఓవర్‌ నూతన డిజైన్లకు సంబంధించి వీడియో ఎఫెక్ట్స్‌ ప్రజంటేషనను వీక్షించారు.. గతంలో రూపొందించిన డిజైన్లను సీఎం తిరస్కరించారు. ప్రస్తుతం డిజైన్ల ప్రకారం ఫ్లై-ఓవర్ 1.40 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు.

ఫ్లై-ఓవర్ రెండు భాగాలుగా ఉంటుంది. జ్యోతిమహల్‌ నుంచి విశాఖ వైపు వాహనాలు వెళ్లేందుకు ఒక వంతెన, ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌ నుంచి చెన్నై వైపు వెళ్లేందుకు ఒక వంతెన రెండు భాగాలుగా ఉంటాయి. మూడు వరసలతో ఇవి ఉంటాయి. మధ్యలో పచ్చదనం పెంచుతారు. ఫ్లై-ఓవర్ కింద కూడా గ్రీనరీ ఉంటుంది. ఈ నిర్మాణంతో బెంజి సర్కిల్‌ యథావిధిగా ఉంటుంది. దాని స్వరూపం మారదు.

బందరు రోడ్డు నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణ, బెంజి సర్కిల్‌ పైవంతెన కలిపి ఒకప్యాకేజీగా టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. దీనికి మొత్తం దాదాపు రూ.1462కోట్లు అంచనా వ్యయం. దీనిలో 64.6కిలోమీటర్ల బందరు రోడ్డుకు రూ.740.70కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్యాకేజీలో నాలుగు మేజర్‌ , అయిదు చిన్న , అయిదు పాదచారుల వంతెనలు నిర్మించనున్నారు. మిగిలిన వ్యయం బెంజిసర్కిల్‌ పైవంతెనకు వెచ్చించాల్సి ఉంద.

ఫ్లై ఓవర్‌ నూతన డిజైన్లకు సంబంధించి వీడియో ఎఫెక్ట్స్‌ ప్రజంటేషన్ ఈ క్రింది వీడియోలో చూడవచ్చు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read