mobile banking 1

ప్రస్తుత కరెన్సీ సంక్షోభంలో, డిజిటల్ కరెన్సీ ఉపయోగించమని ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో, కేవలం మీ మొబైల్ తోనే, చాలా రకాల సేవలు వినియోగించుకోవచ్చు. బ్యాలన్స్ తెలుసుకోవడం, మినీ స్టేట్మెంట్, ఒక ఎకౌంటు నుంచి ఇంకో ఎకౌంటు కు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఇంటర్‌నెట్‌తో కూడా పనిలేదు. ఏ రకమైన GSM ఫోనుల్లో అయినా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్‌ అకౌంట్‌లో రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నుంచి *99#కు డయల్‌ చేస్తే చాలు. ఇప్పటివరకు 51 బ్యాంకులు ఈ సర్వీస్ లో ఉన్నాయి.

*99# విశేషాలు

  • ఈ సర్వీస్ ఉపయోగించాలి అంటే, ఇంటర్నెట్ కు సంబంధం లేదు. ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా ఈ సర్వీస్ ఉపయోగించవచ్చు.
  • అన్ని టెలికాం సర్వీసులు నుంచి, ఈ సర్వీస్ ఉపయోగించవచ్చు
  • అన్ని రకాల GSM మొబైల్ ఫోన్స్ లో ఈ సర్వీస్ ఉపయోగించవచ్చు
  • ఈ సర్వీస్ మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా 24/7 ఉపయోగించవచ్చు
  • ఏ రకమైన యాప్ మీ ఫోనులో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు
  • మీ మొబైల్‌ నెంబర్ బ్యాంక్‌ అకౌంట్‌తో రిజిస్టర్‌ అయి ఉండాలి
  • మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, వాళ్ళ మొబైల్ నెంబర్, ఆదార్ నెంబర్, బ్యాంకు ఎకౌంటు నెంబర్, MMID నెంబర్, IFSC కోడ్ మొదలైనవి మీ దగ్గర ఉంచుకోండి.

*99# ఏ రకమైన సర్వీసులు చెయ్యవచ్చు

  • ఫండ్స్ ట్రాన్స్ఫర్
  • ఎకౌంటు బ్యాలన్స్
  • మినీ స్టేట్మెంట్
  • వన్ టైం పాస్వర్డ్ జెనరేట్ చెయ్యటానికి
  • మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ జెనరేట్ చెయ్యటానికి
  • మీ బ్యాంకు ఎకౌంటు ఆదార్ తో లింక్ అయ్యిందో లేదో, తెలుసుకోవటానికి

ముందుగా ఏమి చెయ్యాలి

బ్యాంక్‌ అకౌంట్‌లో రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నుంచి *99#కు డయల్‌ చెయ్యాలి. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అవ్వకపోతే, మీ బ్యాంకుకి వెళ్లి, రిజిస్టర్ చేసుకోవాలి.

mobile banking 2

  • మొబైల్‌ నుంచి *99#కు డయల్‌ చేసిన తరువాత NUUP (NUUP- National Unified USSD Payments) నుంచి, వెల్కమ్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ OK ప్రెస్ చెయ్యాలి.
  • తరువాత, మీ బ్యాంకు యొక్క 3 లెటర్స్ షార్ట్ నేమ్ కాని, మీ బ్యాంకు యొక్క IFSC కోడ్, మొదటి నాలుగు అక్షరాలు కాని, లేకపోతే 2 డిజిట్ డైరెక్ట్ కోడ్ కాని ఎంటర్ చెయ్యాలి. Ex: స్టేట్ బ్యాంకు షార్ట్ నేమ్ SBI, IFSC కోడ్ మొదటి నాలుగు అక్షరాలు SBIN,2 డిజిట్ డైరెక్ట్ కోడ్ 41. మీరు 2 డిజిట్ డైరెక్ట్ కోడ్ తో , మీ మొబైల్ నుంచి *99*41# డయల్ చేస్తే, మీ SBI ఎకౌంటు ఆక్సెస్ అవుతుంది.
  • మీకు ఇక్కడ కొన్ని ఒప్షన్స్ ఉంటాయి. ఎకౌంటు బ్యాలన్స్, మినీ స్టేట్మెంట్, ఫండ్స్ ట్రాన్స్ఫర్ లాంటి ఆప్షన్స్ లో మీకు అవసరం అయినది సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఫండ్స్ ట్రాన్స్ఫర్ చెయ్యటం ఎలా ?

ఫండ్స్ ట్రాన్స్ఫర్ మూడు రకాలుగా చెయ్యవచ్చు. RBI నిభందనలు ప్రకారం రోజుకి Rs.5000 వరుకే ట్రాన్స్ఫర్ చెయ్యవచ్చు

 

ఆధర్ నెంబర్ ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చెయ్యటం

  • ముందుగా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి "Fund Transfer using beneficiary Aadhaar number"
  • మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చెయ్యాలో, వాళ్ళ ఆదార్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి, అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చెయ్యాలి, ఎంటర్ చెయ్యండి.
  • తరువాత, ఈ ట్రాన్స్ఆక్షన్ ఓకే చెయ్యటానికి, MPIN ఎంటర్ చెయ్యాలి.
  • ఆ ఆధార్ నెంబర్ తో, ఏ బ్యాంకు ఎకౌంటు అయితే లింక్ అయ్యి ఉందో, ఆ ఎకౌంటు లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది.
  • Enter 5 for Fund Transfer using beneficiary Aadhaar number.
  • Subsequent screen to enter Beneficiary Aadhaar Number will appear.
  • Enter MPIN and last 4 digits of account number (Optional).

mobile banking 3

IFSC కోడ్, బ్యాంక్ ఎకౌంటు నెంబర్ ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చెయ్యటం

  • ముందుగా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి "Fund transfer using IFSC code"
  • మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చెయ్యాలో, వాళ్ళ ఎకౌంటు నెంబర్, 11 డిజిట్ IFSC కోడ్, అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చెయ్యాలి, ఎంటర్ చెయ్యండి.
  • తరువాత, ఈ ట్రాన్స్ఆక్షన్ ఓకే చెయ్యటానికి, MPIN ఎంటర్ చెయ్యాలి.
  • Enter 4 for IFSC Fund Transfer
  • Enter account number and 11 digit IFSC of the Beneficiary
  • Enter the amount (space) remarks, which is optional
  • Enter MPIN to approve the transaction

mobile banking 4

MMID’ (Mobile Money Identifier) ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చెయ్యటం

  • ముందుగా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి "Fund transfer using MMID"
  • ముందుగా మీరు ఎవరకి అయితే ట్రాన్స్ఫర్ చెయ్యాలి అనుకుంటున్నారో, వాళ్ళ 10 డిజిట్ మొబైల్ నెంబర్, వాళ్ళ 7 డిజిట్ MMID నెంబర్, అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చెయ్యాలి, ఎంటర్ చెయ్యండి. MMID నెంబర్ తెలుసుకోవటానికి వాళ్ళ బ్యాంకుని సంప్రదించవచ్చు.
  • తరువాత, ఈ ట్రాన్స్ఆక్షన్ ఓకే చెయ్యటానికి, MPIN ఎంటర్ చెయ్యాలి.
  • Enter 3 for MMID Fund Transfer
  • Enter 10 digit Mobile number(space) 7 digit MMID of the Beneficiary
  • Enter the amount (space) remarks, which is optional
  • Enter MPIN to approve the transaction

mobile banking 5

బ్యాంకు బాలన్స్ తెలుసుకోవటం ఎలా ?

  • పైన చెప్పిన విధంగా ముందు, మీ ఎకౌంటు కి కనెక్ట్ అవ్వాలి.
  • తరువాత మీ బ్యాంక్‌ బ్యాలెన్స్ తెలుసుకోవటానికి, 1 నొక్కితే చాలు, మీ బ్యాంక్‌ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో మొబైల్‌లో ప్రత్యక్షమవు తుంది.

బ్యాంకు మినీ స్టేట్మెంట్ తెలుసుకోవటం ఎలా ?

  • పైన చెప్పిన విధంగా ముందు, మీ ఎకౌంటు కి కనెక్ట్ అవ్వాలి.
  • తరువాత మీ బ్యాంక్‌  మినీ స్టేట్మెంట్ తెలుసుకోవటానికి, 2 నొక్కితే చాలు, మీ బ్యాంక్‌  మినీ స్టేట్మెంట్ మొబైల్‌లో ప్రత్యక్షమవు తుంది. ఆకరి 3  ట్రాన్స్ఆక్షన్స వివరాలు తెలుస్తాయి.

మీ బ్యాంకు యొక్క 3 లెటర్స్ షార్ట్ నేమ్ కాని, మీ బ్యాంకు యొక్క IFSC కోడ్, మొదటి నాలుగు అక్షరాలు కాని, లేకపోతే 2 డిజిట్ డైరెక్ట్ కోడ్ కాని ఇక్కడ తెలుసుకోండి

mobile banking 6 1

 

mobile banking 6 2

ఈ క్రింద పేర్కున్న టెలికాం కంపెనీలు ఈ సేర్విసును ఇస్తున్నాయి.

mobile banking 7

ఈ క్రింద పేర్కున్న విధంగా లాంగ్వేజ్ కూడా ఎంచుకోవచ్చు.

mobile banking 8

Advertisements

Comments   

0 #13 KIRAN 2017-01-25 17:25
Good information
I have one doubt how to down load PG memo because I lost the my memo please conclusion.....
Quote
+2 #12 Bhaskara chary 2016-12-14 11:33
Nice good idea ,thanq ,for ur kind information
Quote
+1 #11 Sampath n kumar 2016-12-11 23:09
Good facility for smal transactions
Quote
-1 #10 Isac 2016-12-10 07:25
Super information
Quote
+1 #9 shiva 2016-12-09 01:50
It is use ful to every one
Quote
0 #8 thirumal 2016-12-08 05:41
realy very good useful information, i hope all the poeple useing this service. it is very helpfull.
Quote
-3 #7 Harish 2016-12-06 13:51
Citibank is not there
Quote
0 #6 arther samuel 2016-12-05 02:30
Most useful information.
Quote
-3 #5 srinivas ravella 2016-11-30 10:13
it is very good information
Quote
+1 #4 MANOHAR 2016-11-30 03:48
good information
Quote

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read