జగన్ నిజ స్వరూపం ప్లీనరీ సాక్షిగా బయటపడింది. తెలుగుదేశం ఆరోపిస్తున్నట్టు, ప్లీనరీ పెట్టింది రాష్ట్ర సమస్యలు చర్చించటానికి కాదు, చంద్రబాబుని తిట్టటానికే అనే, ఆరోపనులు నిజమయ్యాయి. గుంటూరు సభ సాక్షిగా, అందరూ చూస్తూ ఉండగా, లైవ్ లోనే, వీళ్ళ నిజస్వరూపం బయట పడింది.

రొజాని మాట్లడవల్సిందిగా, ఉమ్మారెడ్డి మైక్ లో చెప్పారు.. రోజా మాంచి ఉత్సాహంతో స్పీచ్ ఇవ్వటానికి వచ్చింది. ఇంతలో ఉమ్మారెడ్డి వచ్చి, రోజాతో "అమ్మాయ్ ఒకటికి పది సార్లు చెప్తున్నా, తిట్టమని..." అని చెప్పారు... దానికి రోజా "ఎవర్ని?" అని ప్రశ్నించింది... దానికి ఉమ్మారెడ్డి "తిట్టమంటున్నాడు, చంద్రబాబు గారిని..." అని సమాధానం... దానికి రోజా "ఆ సరే సరే" అని అంది. ఈ మాటలు, స్పష్టంగా మైక్ లో నుంచి వినిపించాయి. తరువాత, రోజా తన బూతు నోరుతో ఎప్పటిలాగే రేచ్చిపోయింది.

ఇంత సిగ్గు లేకుండా, కేవలం చంద్రబాబుని బాగా తిట్టటానికే, మీటింగ్ పెట్టుకున్నాం, అని వాళ్ళంతట వాళ్ళే చెప్పుకున్నారు. జగన్, రోజా అంటే అన్ని విలువలు వదిలేసారు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు, అనుకోవచ్చు... మరి అంత అనుభవం, వయసు ఉన్న ఉమ్మారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇలా తయారు అయ్యారు అంటే, అది ఆ పార్టీ సావాసం యొక్క గొప్పతనం. రాజకీయం ప్రక్కన పెడితే ...ఎవడో ఉస్కో ఉస్కో అంటేగాని స్టేజి పై ఏమి చెప్పాలో తెలియకుండా స్టేజి ఎక్కేయ్యడం ఈ మధ్య అలవాటు అయిపోయింది ..

ఏ రాజకీయ పార్టీ అయినా సమావేశాలు, ప్లీనరీలు పెట్టుకుంటే మంచి చెడు, అంతర్గతంగా జరిగే తప్పు ఒప్పులు, భవిషత్తులో తీసుకోవలసిన జాగ్రత్తలు మీద చర్చించుకోవాలి.. మరి ఇక్కడ మట్టికి బాబు బాబు అని బాబు జపం చేస్తున్నారు.

మీరూ వినండి... సౌండ్ ఎక్కువ పెట్టుకుని, జాగ్రత్తగా వినండి

Advertisements

Advertisements

Latest Articles

Most Read