నిండా మునిగినోడికి చలి ఏమి ఉంటుంది అని, ఈ దొంగల పార్టీకి, ఇలాంటివి ఒక లెక్కా పక్కా ? పార్టీ అధ్యక్షుడి ప్రొఫైల్ చదవాలంటే, ఆ 420 కేసులు లిస్టు చదవటానికి, ఒక జాతీయ్ ఛానల్ ప్రింట్ అవుట్ తీసుకుని వచ్చి మరీ అడిగింది... అంతటి ప్రొఫైల్ ఉంది... మరి ఆయన అనుచరులు ఏమి తక్కువ, అందుకే, వారు కూడా, ఆ నాయకుడి పేరు నిలబెడుతున్నారు.. విచిత్రం ఏమిటి అంటే, ఇలాంటి వారు, మన కోసం పోరాడతారు, చంద్రబాబు లాంటి వాడిని జైలుకు పంపిస్తా అని సవాల్ చేస్తారు... ఇలాంటి వారు, అవినీతి గురించి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది...

ycp mla 21032018

ఇక విషయానికి వస్తే, వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్‌లో భార్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌ వాదనను సమర్థిస్తూ దీనిపై విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి వైకాపా తరపున పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెదేపా అభ్యర్థి వెంకట రమణరాజుపై గెలుపొందారు.

ycp mla 21032018

అయితే పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వెంకటరమణరాజు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించింది. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో భార్యను ఓ చోట ఎండీగా, మరోచోట సాధారణ గృహిణిగా పేర్కొన్నారని, ఆదాయ వనరులను సరిగా చూపలేదని నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు వంద పేజీల తీర్పును వెలువరించింది. ఈ కేసును పునర్విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రాతో కూడిన ధర్మాసనం హైకోర్టును ఆదేశించింది.

అవిశ్వాస తీర్మానం పై, గత నాలుగు రోజులుగా, పార్లమెంట్ నుంచి పారిపోతున్నాడు మోడీ... తనకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా సరే, ఎదో తెలియని భయం... అందుకే తెరాస, అన్నాడీయంకేతో డ్రామాలు ఆడిస్తూ సభ వాయిదా వేస్తున్నారు... అయితే, ఈ విషయం పై ఒక నేషనల్ ఛానల్ సంచలన కధనం ప్రచారం చేసింది... బీజేపీలో అంతర్గతంగా లుకలుకలు చెలరేగినట్లు ఆ కధనం సారంశం... అవిశ్వాసం కనుక వస్తే, కొంత మంది బీజేపీ ఎంపీలు, మోడీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాసం ఉన్నట్టు, అద్వానీ వర్గం ఎంపీ చెప్పినట్టు ఆ కధనం సారంశం... ఇది కనుక జరిగితే, అవిశ్వాస తీర్మానం నెగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

aviswasam 21032018 2

ఇప్పటికే అమిత్ షా, దీని పై లెక్కలు వేయగా, 302 మంది మద్దతు తమకు లభిస్తుందని అంచనాకు వచ్చారు... అయితే, అవిశ్వాసం కనుక పెడితే, ఆయాన వైఖరి పై నచ్చని సొంత పార్టీ నేతలు వోటింగ్ గు గైర్హాజరు అవ్వటం కాని, వ్యతిరేకంగా వోట్ వేసే అవకాసం ఉన్నట్టు సమాచారం... ఇటీవల త్రిపురలో బీజేపీ అగ్రనేత ఆడ్వాణీని మోదీ అవమానించిన తీరు చాలా మంది పార్టీ ఎంపీల మనసు గాయపరిచింది. పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు పూర్తి సంఖ్యలో ఎంపీలు రాకపోవడం..

aviswasam 21032018 3

అదే సందర్భంలో, విప్‌ జారీ చేసినా ఉభయసభల్లో బెంచీలు ఖాళీగా కనపడడం పార్టీ అగ్ర నేతలను కలవరపరుస్తోంది... ఈ పరిణామాలు చూస్తుంటే, అవిశ్వాసం కనుక వస్తే, ఇక మోడీకి మూడినట్టే అని, అందుకే, ధైర్యం చెయ్యలేక, అవిశ్వాసం నుంచి పారిపోతున్నారని చెప్తున్నారు...చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి పలు అంశాలు బయటకు వస్తాయని, అది కర్ణాటక ఎన్నికల్లో తమకు నష్టం చేకూరుస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం... అందుకే ఇక శుక్రవారం, పార్లమెంటు ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి...

గత 15 రోజుల నుంచి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కాదు... ఇతను చేసిన చీకటి ఎవ్వారాలు, అడ్డంగా, నిలువుగా ఫోటోలు, వీడియోలతో సహా రోజుకు ఒకటి బయట పడుతుంది.... అవిశ్వాసం అంటూ, అదే తీర్మానం పట్టుకుని ప్రధానిని కలుస్తాడు... అవిశ్వాసం అంటూ, మోడీ కోసం రోజుకి పది సార్లు వెళ్లి కలుస్తాడు.. అవిశ్వాసం అంటూ, రాజనాథ్ సింగ్ కు వంగి వంగి నమస్కారాలు పెడతాడు... ఈ రోజు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో మంతనాలు జరుపుతూ దొరికాడు... ఇక ఈయన నేషనల్ మీడియాలో మోడీకి చేస్తున్న భజన కూడా అందరికీ తెలుసు...

vijayasayi 21032018 2

ఇవన్నీ మీడియా పదే పదే అడగటంతో, మీడియా పై చిందులు తొక్కాడు... నా ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రధానిని కలుస్తా, మీకెందుకు, చంద్రబాబుకి ఎందుకు అంటూ రెచ్చిపోయాడు... ఇక చంద్రబాబు పై అయితే, ఏకవచనంతో సంభోదిస్తూ చెలరేగిపోయాడు... రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, గాలి జనార్ధన్ రెడ్డి, ఒకసారి ఇలాగే ప్రెస్ లో, చంద్రబాబుని బూతులు తిట్టాడు... ఆ రేంజ్ లో, ఈ రోజు విజయసాయి రెడ్డి చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నా ఇష్టం, మోడీని కలుస్తూనే ఉంటా అంటూ రెచ్చిపోయాడు...

vijayasayi 21032018 3

చంద్రబాబుని జైలుకి పంపిస్తా అని, దాని కోసం మోడీని కలుస్తా, మంత్రుల్ని కలుస్తా, అందరినీ కలుస్తా, చంద్రబాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధాన మంత్రిని, మంత్రులను కలుస్తూనే ఉంటానని అన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు తమకు మాత్రమే ఉందని, చంద్రబాబుకి లేదని చెప్పారు... చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకు చేయాల్సిందంతా చేస్తామని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీని తన ఇష్టం వచ్చినన్నిసార్లు కలుస్తానని స్పష్టం చేశారు. ..

మోడీ - అమిత్ షా ద్వయం మీద, దేశ ప్రజలకే కాదు, సొంత పార్టీ నేతలకు కూడా మబ్బులు వీడి, అసలు రూపం కనిపిస్తుంది... ఆ పార్టీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు ప్రద్యుత్ బోరా బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు... పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీకి, ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు... దేశం నలుమూలలకు బీజేపీని విస్తరించేందుకు ఐటీ సెల్ ద్వారా ప్రద్యుత్ బోరా కీలక పాత్ర పోషించారు... ఈయన రాజీనామాకు కారణం, పార్టీలో చేస్తున్న పనులు అంటూ, అమిత్ షా కు ఘాటు లేఖ రాసి మరీ, రాజీనామా చేసారు... ఈ ఉదంతంతో, మరోసారి బీజేపీ ఎలాంటి పార్టీ అనే విషయం బయట పడింది...

bjp it cell 21032018 2

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ‘‘ప్రజాస్వామ్య సంప్రదాయానికి తూట్లు పొడవడంపై’’ కలత చెందాననీ.. మిగతా పార్టీలకు బీజేపీకి తేడా లేకుండా పోయిందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘‘పార్టీకి బాగా పిచ్చి ముదిరింది. ఎలాగైనా గెలిచితీరాలన్న ఉద్దేశ్యంతో పార్టీ విలువలను తుంగలో తొక్కేశారు. 2004లో నేను చేరిన పార్టీ ఇది కాదు..’’ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

bjp it cell 21032018 3

పార్టీ సాగిస్తున్న ప్రస్తుత విధానాలతో బీజేపీపై తనకు నమ్మకం పోయిందన్నారు. ‘‘ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా దేశానికి ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం. ఇందుకు బీజేపీ కూడా మినహాయింపు కాదు. ప్రజలు ఇతర అవకాశాల వైపు చూస్తున్నారు..’’ అని బోరా పేర్కొన్నారు. అస్సాంలో కాంగ్రెస్, ఆమాద్మీ, ఏజీపీ పార్టీలు తనకు అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని ఎప్పుడూ స్వీకరించలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా పనితీరుపై ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ బోరా తన నాలుగు పేజీల లేఖలో లేవనెత్తారు.

Advertisements

Latest Articles

Most Read