నిన్నటి నుంచి వివేక కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలు ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లతో నడుస్తున్నాయి. ప్రజలు కూడా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. నిన్న వాచ్మెన్ రంగయ్య సుపారీ ఇచ్చారని, తొమ్మిది మంది ఉన్నారని, ఇద్దరు ప్రముఖులు ఉన్నారని చెప్పారంటూ వార్తలు రావాటంతో, ఇప్పుడు ఆ సుపారీ ఇచ్చిన ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరు అనే విషయం పై చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో పరిణామం చోటు చేసుకుని. వివేక కేసులో విచారణలో భగంగా, సిబిఐ అధికారులు సునీల్ యాదవ్ అనే పులివెందుల చెందిన వ్యక్తిని కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సునీల్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టు మెట్లు ఎక్కారు. ఇందులో ప్రధానంగా చూస్తే, ఇటీవల సిబిఐ అధికారులు పదే పదే చాలా సార్లు, కడప సెంట్రల్ జైలు కేంద్రంగా జరుగుతున్న విచారణను అతన్ని పిలిపించారు. అతనితో పాటుగా, అతని కుటుంబ సభ్యులని కూడా విచారణకు పిలిపించారు. ఈ నేపధ్యంలో సిబిఐ అధికారులు విచారణ పేరుతో తమ పై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, అలాగే పదే పదే సిబిఐ అధికారులు తమని వేధిస్తున్నారని, అందుకే తాము హైకోర్టుని ఆశ్రయించాల్సి వస్తుంది అంటూ, అతను హైకోర్టు ముందు ఉంచిన పిటీషన్ లో తెలిపారు.

sunil 24072021 2

ఆ పిటీషన్ లో హైకోర్టుని విజ్ఞప్తి చేస్తూ, తమ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కాబట్టి, తమని న్యాయవాది సమక్షంలో, విచారణ చేపించాలని కోరారు. తమ దగ్గర నుంచి ఖాళీ కాయితాల పై సంతకాలు కూడా తీసుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే అవసరం అయితే లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధం అని అన్నారు. సిబిఐ అధికారులు తమని వేదించకుండా, తమను న్యాయవాది సమక్షంలో విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ, సునీల్ యాదవ్ తో పాటుగా, ఆయన కుటుంబ సభ్యులు కూడా హైకోర్టుని ఆశ్రయించారు. సిబిఐ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా, తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటీషన్ లో కోరారు. ఈ పిటీషన్ లో సిబిఐ డైరెక్టర్ ను కూడా ప్రతివాదిగా చేర్చారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ తో పాటుగా, అతని కుటుంబ సభ్యులు అయిదుగురిని, సిబిఐ అధికారులు వివేక కేసులో విచారణకు పలు మార్లు పిలిచారు. అయితే నిన్నటి నుంచి ఈ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read