రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జగన్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే... రోజు రోజుకీ దిగజారుతూ, శాశ్వతం తన పార్టీని సమాధి చేసే పనిలో ఉన్నాడు... చివరకు పాదయాత్ర లాంటి యాత్రలు చేస్తున్నా, కనీస స్పందన లేదు... ఎక్కడా మైలీజి లేదు... నిజానికి ప్రభుత్వం పై పోరాడటానికి ఎన్నో అవకాశాలు ఉన్నా, జగన్ మాత్రం తన సెల్ఫ్ గోల్స్ తో, అవకాశాలు వదులుకుని, తన మెడకే చుట్టుకునేలా చేసుకుని, ప్రజల్లో చులకన అవుతున్నాడు... అమరావతి నుంచి పట్టిసీమ దాకా, ఇలా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ లని కూడా వ్యతిరేకిస్తూ ముందుకు పోతున్నారు... చివరకు అసెంబ్లీకి కూడా రాకుండా, బయట తిరుగుతున్నాడు...

jagan 12032018 3

ఇలా తల తిక్క నిర్ణయాలతో, చాలా మంది నాయకులు పార్టీని వీడి వచ్చేస్తున్నారు... బొత్సా, రోజా, కొడాలి నాని లాంటి మహా ఘనులు తప్ప, ఆ పార్టీలో చెప్పోకో దగ్గ నేతలు లేరు.. జగన్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, జగన్ కొత్త స్నేహితుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు.. జగన్ కు కొన్ని అంశాల్లో తిరుగులేని మద్దతు వస్తోందని అన్నారు... జగన్ ఏంతో పోరాడుతున్నారని, జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు... అందుకే, చంద్రబాబు, జగన్ కు భయపడి ఏమి చెయ్యాలో తెలియక, హోదా అంటూ, ప్యాకేజీ అంటూ హడావిడి చేస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు...

jagan 12032018 3

విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేసారు... బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాటలు విన్న జగన్, ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ సంతోషాన్ని ప్రకటించారని వైసిపీ వర్గాలు అంటున్నాయి... జగన్ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వచ్చాయని, ఇన్నాళ్ళు నేను చేస్తున్న పోరాటాలు ప్రజలు గుర్తించలేదు, మీడియా గుర్తించలేదు, చివరకి సొంత పార్టీ నేతలు కూడా గుర్తించలేదు, కాని మొదటి సారి మన కొత్త స్నేహితుడు నన్ను అర్ధం చేసుకున్నారు అంటూ, జగన్ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వచ్చాయని వైసిపీ వర్గాలు చెప్తున్నాయి...

మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, కేంద్రంలో ఉన్న బీజేపీతో ఎలాంటి సంబంధాలు మైంటైన్ చేస్తుందో అందరికీ తెలిసిందే... అయితే, ఇప్పటికి వరకు తెర వెనుక ప్రచారాలు మాత్రమే ప్రజలకు తెలుసు.. అయితే రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి, నేషనల్ మీడియా వేదికగా తమ అనైతిక పొత్తు గురించి, ప్రజలను ఎలా మభ్యపెడుతున్నాం అన్నది బయట పెట్టేసారు... ఈ వీడియో చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వీరి నైజం ఏంటో అర్ధమైంది... కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం లేదు, రాహుల్ గాంధీ మోసం చేస్తాడు అని చెప్తూ, స్పెషల్ స్టేటస్ ఇచ్చేది మోడీ మాత్రమే, ఆయన మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉందీ అంటూ, విజయసాయి రెడ్డి, నేషనల్ మీడియాలో ఊదరగొట్టింది అందరూ చూసారు...

vijayasayi 11032018 2

ఇప్పుడు ఇదే, విజయసాయి రెడ్డికి, జగన్ కు పెద్ద తలనొప్పి అయ్యింది... ఇలా పిచ్చి తనంగా, ప్లాన్ బహిర్గతం చేసినందుకు, కేంద్రంలోని బీజేపీ పెద్దలు, విజయసాయి పై ఫైర్ అయ్యారని సమాచారం... ఆ వీడియో వైరల్ కావటంతో, బీజేపీ, వైసిపీ ఎలాంటి గేమ్ రాష్ట్రంలో ఆడబోతున్నాయో అందరికీ ఇట్టే అర్ధమవుతుంది... దీంతో, ఢిల్లీ పెద్దలు విజయసాయిని ఇంకోసారి నేషనల్ మీడియాలో చర్చలకు పంపవద్దు అంటూ, జగన్ కు కూడా గెట్టిగా క్లాస్ పీకారని తెలుస్తుంది.. దీంతో జగన్ కూడా, విజయసాయి మీద కస్సు మన్నారు... నేను అవిశ్వాసం అని ఎదో డ్రామాలు ఆడుతుంటే, నువ్వేమో మోడీ మెప్పు కోసం విశ్వాసం అంటుంటే, మనం డ్రామా ఆడుతున్నామని ఇట్టే అర్ధమవుతుంది, అంటూ విజయసాయిని మందిలించారు..

vijayasayi 11032018 3

విజయసాయి మాటలను బట్టి, కొన్ని రోజులుగా ప్రచారంలో ఉనట్టు, వైసిపీతో పొత్తు కోసం, టిడిపిని బయటకు గెంటారు... ఇప్పుడు హోదా అనో, ఎదో ఒక సోది చెప్పి, టిడిపి మీద నెపం నెడతారు... అప్పుడు జగన్ వెళ్లి బీజేపీతో చేరతాడు.. ఇదే వీరి వ్యూహం అని చెప్పకనే చెప్పారు.. ఎందుకంటే, ప్రస్తుతం, బీజేపీ హోదా అనే మాటే లేదు అంది... రాహుల్ నేను మొదటి సంతకం హోదా మీద అంటున్నాడు... మరి హోదా ఎవరు ఇస్తే వారే మాకు కావలి అనే జగన్, ఇప్పటికీ మోడీ మీద ఎలా నమ్మకం పెట్టుకున్నాడు ? రాహుల్ ఇస్తాను అంటున్నా, కనీసం ఎందుకు స్వాగాతించటం లేదు ? రాబోయే రోజుల్లో, వీరి నాటకాలు బయట పడతాయి...

వేదికపై అద్వానీని పట్టించుకోని మోదీ అనే వీడియో గత రెండు రోజుల నుంచి చూస్తున్నాం... అయితే, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఒకసారి కూడా, రెండో సారి తిరిగి వెళ్ళేప్పుడు కూడా, ఇదే రకంగా అవమానించారు మోడీ... అంటే, ఇదేదో యాద్రుచికంగా జరిగింది కాదు, కావాలనే మోడీ, అద్వానీని ఇలా అవమానించారు అనే విషయం అర్ధమవుతుంది... పూర్తి వివరాల్లోకి వెళ్తే, త్రిపుర కొత్త సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకకు పార్టీ దిగ్గజాలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, త్రిపుర మాజీ సీఎం మానిక్ సర్కార్ తదితరులు హాజరయ్యారు. మోదీ స్టేజ్ పైకి చేరుకుంటున్న సమయంలో అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌లకు నమస్కారం చేశారు.

modi triupra 11032018 2

ఆ పక్కనే ఉన్న బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, మోదీ నమస్కారం చేసినా.. ఆయన పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడం కెమెరాకు చిక్కింది. అద్వానీ రెండు చేతులను జోడించి అలాగే కొద్దిసేపు ఉన్నప్పటికీ మోదీ అటువైపు చూడలేదు. త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ దగ్గరికి వెళ్లి చేతులు కలిపారు. అలాగే చాలాసేపు నిల్చున్న అద్వానీ వైపు చూడలేదు మోదీ. ఉక్కు మనిషి అద్వానీని ప్రధాని ఘోరంగా అవమానించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

modi triupra 11032018 3

అద్వానీ సమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలన్న సంస్కారం గురించి బీజేపీ నేతలకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకప్పుడు అద్వానీ పదాలకు నమస్కరించిన మోదీ ఇప్పడు ఆయన ప్రధాని అని నమస్కారం పెట్టేందుకు చేతులెత్తిన అద్వానీపై కన్నెత్తి కూడా చూడకపోవడంపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు రెండో వీడియో కూడా బయటకు రావటంతో, మోడీ ఇలా ఎందుకు కావాలని చేస్తున్నారో అర్ధంకావటం లేదని బీజేపీ పెద్దలు అంటున్నారు... ఈ వీడియో చూడండి...

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల పై, ఏ విషయం అడిగినా, మాకు లెక్కలు పంపలేదు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీలు) ఇవ్వలేదు అంటూ, కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు ఎదురుదాడి చెయ్యటం చూస్తున్నాం... వీరికి తోడు, రాష్ట్రంలో కొన్ని పార్టీలు, అటు కేంద్రాన్ని ఏమాత్రం నిందించకుండా, రాష్ట్రం మీద పడతారు... మేము లెక్కలు చెప్పాం అని డేట్ లు తో సహా చెప్పినా వినని పరిస్థితి.. ఎంత సేపు మోడీని ఒక్క మాట అనకుండా, చంద్రబాబుని ఇరికించాలి అనే పరిస్థితి... అయితే, వీరందిరికే, అదే కేంద్రం నుంచి వచ్చిన అధికారులు దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు...

kendram 11032018 2

గత నెల 20, 21 తేదీల్లో అమరావతిలో పర్యటించిన కేంద్ర అధికారుల బృందం..రాజధాని నగర నిర్మాణ పనులప ట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసారు. యూసీలు ఇచ్చారంటూ లిఖిత పూర్వకంగానూ అంగీకరించారు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ నిర్మాణ ప నులు పూర్తి పారదర్శకంగా జరిగాయని... రాజధాని నగరాభివృద్ధి సంస్థ చేసిన వ్యయాల నివేదికను ఆన్‌లైన్‌లో ప్రజలందరూ చూసేలా ఉంచిందని ధృవీకరించినట్లు సమాచారం. ఇదేసమయంలో..తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు కేంద్రంఇచ్చిన నిధులు రూ.1,500 కాకుండా..అదనంగా మరో రూ. 650 కోట్లు ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి ఈ బృందం సిఫారసు చేసింది.

kendram 11032018 3

అలాగే మరో వెయ్య కోట్లుకు సంబదించి, గుంటూరు, విజయవాడ ప్రాంత పరిధిలో చేపడుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని ఈ బృందం పేర్కొంది. అయితే..ఇందుకు కారణాలనూ ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఈ పనులకు ఆక్రమణలను తొలగించడం పెద్ద సమస్యగా మారిందని బృందం పేర్కొంది. ట్రాఫిక్‌ అవరోధాలనూ గుర్తించింది. పనుల్లో వేగం పెరగాలంటే.. ఆక్రమణలు తొలగించడం..ట్రాఫిక్‌ నియంత్రణ ప్రధానమైనవిగా సూచించినట్లు తెలుస్తోంది. రాజధాని నగరాభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన రూ.2,500 కోట్ల పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించిన కేంద్ర కమిటీ ఆ పనుల తీరుపట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిందని చెబుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read