విభజన చట్టంలో హామీలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ శాసనభ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రధాని ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు న్యాయం కోసం పోరాడతానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని తెలిపారు. విభజన ఇంకా పూర్తవ్వలేదని అన్నారు. విభజన కష్టాల నుంచి గట్టెక్కిస్తారనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ, విజయసాయి రెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..

cm vijayasayi 13032018 2

బీజేపీలో జరిగే కీలక నిర్ణయాలన్నీ వైసీపీకి ముందే ఎలా తెలుస్తున్నాయని సీఎం అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ముందే ఎలా తెలిసింది?. కోవింద్ బీహార్ గవర్నర్‌గా ఉన్నప్పుడే సాయిరెడ్డి వెళ్లి కలిశారు. ఆర్థిక నేరస్తులకు అధికారం దగ్గర అంత స్వేచ్ఛ ఉండకూడదు. టీడీపీ.. ఎన్డీఏలో ఉన్నా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా చెప్పే వరకూ నాకు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో తెలియదు అని చంద్రబాబు అన్నారు..

cm vijayasayi 13032018 3

మోదీ ప్రత్యేక హోదా ఇస్తారని పూర్తి విశ్వాసం ఉందని విజయసాయి అంటున్నారు. అలాంటప్పుడు వైసీపీ అవిశ్వాసం ఎందుకు పెడుతుందో అర్దం కావడం లేదని అన్నారు... వైసీపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలేసి నన్ను విమర్శిస్తోందని, ప్రజలు మోస పోరని, వైసీపీని శాశ్వతంగా శిక్షిస్తారని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ-1, ఏ-2 నిందితులు ప్రధానిని ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు. దోచుకున్న ఆస్తులు రికవరీ చేసి రాష్ట్రానికి ఇవ్వాలని ప్రధాని మోదీని కోరినట్లు చంద్రబాబు చెప్పారు...

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీలో భావోద్వేగానికి గురయ్యారు... అమరావతిని, బీజేపీ, కేంద్రంలోని ఢిల్లీ పెద్దలు ఎలా ఎగతాళి చేస్తున్నారో చెప్తూ, భావోద్వేగంతో, కళ్ళల్లో నీళ్లతో ఉద్వేగంగా మారారు... ఆయన మాటల్లో, "డ్రీమ్ సిటీ కడతారా.. గ్రీన్ సిటీ కడతారా.. ఎదో సిటీ కడతారంట, కట్టమనండి, ఏమి కట్టారు.. అని కొందరు బీజేపీ వాళ్ళు అంటున్నారు... నేను ఇంతటితో తృప్తి పడదలుచుకోలేదు... అమరావతి ఆంధ్రుల రాజధాని.. హైదరాబాద్ కంటే గొప్పగా కడతా.. చెన్నై కంటే బ్రహ్మడం గా కడతా.. బెంగుళూరు ని మించి కడతా.. ప్రపంచం లోనే గొప్ప సిటీగా అమరావతిని నిర్మిస్తా... ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునేలా కడతా" అంటూ కళ్ళల్లో నీళ్లతో ఉద్వేగంగా చంద్రబాబు..

cbnamaravati 13032018 1

వెంటనే తమాయించుకుని, ప్రసంగం కొనసాగించారు... ‘ఆంధ్రప్రదేశ్‌ పక్క రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేవరకు ఆదుకోమని కేంద్రాన్ని కోరుతున్నా. కేంద్రం సాయం వల్లే రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు సాధించిందని భాజపా నేతలు అంటున్నారు. మరి భాజపా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ వృద్ధి ఎందుకు జరగడం లేదు? మేము కష్టపడుతున్నాము కాబట్టే అభివృద్ధి సాధించగలుగుతున్నాం. రాష్ట్రం విభజన జరిగినప్పుడు మోదీ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురిట్లోనే చంపేసింది. మేం అధికారంలో ఉంటే రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం చేసేవాళ్లం’ అని వ్యాఖ్యానించారు.

cbnamaravati 13032018 1

విభజన చట్టం, ప్రత్యేక హోదా ఐదుకోట్ల ఆంధ్రుల హక్కు. ఎన్టీఆర్‌ ఆంధ్రులకు ఆత్మగౌరవం ఇస్తే.. నేను ఆత్మవిశ్వాసం ఇచ్చా. నాకు భయం లేదు. ఎలాంటి లాబీయింగ్‌కు పాల్పడలేదు. కేంద్రాన్ని గవర్నర్‌ పదవి అడిగానా?మంత్రి పదవి, కార్పోరేషన్‌ పదవి అడిగానా?. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని అడగడానికి రాష్ట్ర భాజపా నేతలకు మొహమాటం ఉందేమో? నాకు లేదు అంటూ చంద్రబాబు మాట్లాడారు...

ఏపీఎస్ఆర్టీసీకి అత్యాధునిక బస్సులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. వీటిని సోమవారం అధికారికంగా ప్రారంభించారు. 2018 సంవత్సరంలో ఆర్టీసీ యాజమాన్యం అత్యాధునిక వసతులున్న 19 అమరావతి ఏసీ బస్సులను కొనాలని నిర్ణయించి, ఆమేరకు కొనుగోలుకు చర్యలు కూడా తీసుకున్నది. ఒక్కో బస్సు ఖరీదు రూ. 1,15,50,000 ఉంది. అధిక వ్యయంతో కూడుకున్న ఈ బస్సుల్లో ప్రస్తుతం ఏసీ అమరావతి బస్సులు బస్ భవనకు చేరుకున్నాయి. ఈ కొత్త బస్సులు కొన్ని ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఆటోమేటిక్ గేర్, హై హార్స్ పవర్ -380, అధునాతన సౌకర్యవంతమైన పాసింజర్ సీట్లో కలిగి ఉన్నాయి.

rtc 13032018 1

ఒక్కో బస్సులో ఆధునిక పద్దతిలో 47 సీట్లు ఏర్పాటు చేశారు. బస్ పొడవు వచ్చేసి 13.8 మీటర్లు ఉంది. ఇందులో రెండు టీవీలు, 3 సీసీ కెమెరాలు కూడా ఉండడం గమనార్హం. ప్రతి సీటుకు మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కలిగించారు. వోల్వో కంపెనీ ద్వారా వీటిని కొనుగోలు చేశారు. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఈ బస్సులను ప్రారంభించారు. కాగా ఇప్పటికే సంస్థలో మొత్తం 263 ఏసీ బస్సులున్నాయి. ఇందులో అమరావతి బస్సులు 45, గరుడ 60, గరుడ ఫస్ట్ 21, ఇంధ్ర 100, మెట్రో లగ్జరీ 30, వెన్నెల 7 ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. 2017లో 25 గరుడ బస్సులను కరోన సంస్థ నుంచి కొనుగోలు చేశారు. ఈసందర్భంగా ప్రతి బస్సుకు రూ. 66 లక్షలు వ్యయం చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 11,781 బస్సులున్నాయి. వాటిలో 2,722 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. అంటే ఆర్టీసీ ఆధ్వర్యంలో నికరంగా ఉన్న బస్సులు 9,050 మాత్రమే.

rtc 13032018 1

49 శాతం బస్సులు గ్రామీణ ప్రాంతాల్లోను, 11 శాతం సిటీ బస్సులు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో తిప్పుతున్నారు. స్పెషల్ టైపు బస్సులు సూపర్ లగ్జరీవి 1340, అల్ట్రా డీలక్స్ 618, ఎక్స్ప్రెస్ 2026, ఏపీ 263 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణగా బస్సులు నడుపుతూ ప్రతి రోజు 43లక్షల కిలో మీటర్లు తిప్పుతున్నారు. రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి బస్సులు నడుతున్నారు. గిరిజన కొండ ప్రాంతాలలోని పాడేరులో సైతం ఆర్టీసీ డిపో ఉన్నది. సమిష్టి కృషి, ప్రజల ఆదరణ, ప్రభుత్వ సహకారం వల్ల గత ఏడాది 66.88 శాతం ఉన్న ఆక్యుపెన్సీ 73.29 శాతానికి పెరిగింది. తద్వారా గత ఏడాది (జనవరి 2017 వరకు ఉన్న రూ. 736.84 కోట్ల నష్టాలను ప్రస్తుతం రూ. 403.75 కోట్లకు తగ్గించుకోగలిగారు. అంటే దాదాపు రూ. 333.09 కోట్ల నష్టాలను అధిగమించగలగడం గమనార్హం.

ఇప్పటికే కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలగిన తెలుగుదేశం పార్టీ, త్వరలోనే ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేయటానికి సమాయత్తమవుతోంది. కేంద్ర మంత్రుల రాజీనామాను మొదటి అస్త్రంగా పరిగణించిన తెలుగుదేశం కేంద్రంపై మరింత ఒత్తిడి తేవాలని సంకల్పించింది. దశల వారీగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించిన తెలుగుదేశం పార్టీకి తాజాగా కేంద్రం వ్యవహరించిన తీరు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జప్తు చేసిన రూ.34 కోట్లను ఈడీ ద్వారా తిరిగి ఇప్పించడాన్ని, ఏ విధంగా అర్ధం చేసుకోవాలంటూ తెలుగుదేశం ప్రశ్నిస్తుంది... అదే విధంగా, విజయసాయి రెడ్డి, మాకు మోడీ మీద పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పి, మళ్ళీ అవిశ్వాసం అని డ్రామాలు ఆడటం కూడా గమనిస్తుంది.

cbn step 13032018 2

అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్ర ప్రదేశ్ కు అన్ని విధాల ఆదుకోవడంతో పాటు కేంద్రం నుంచి విభజన చట్టం, హామీల అమలు కాకపోవడంపై మెట్టు దిగే వీలులేదని టీడీపీ సంకేతాలు ఇచ్చింది. అయితే ఒక వైపు కేంద్రమంత్రులు రాజీనామాలు చేయడం, మరో వైపు ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తున్న నేపధ్యంలో తాజాగా జప్తు చేసిన ఈడీ ఆస్తులను తిరిగి ఇవ్వడం వెనుక పెద్ద మతలబు ఉందనే దిశగా ఈ రోజు జరిగిన భేటీలో లోతుగా చర్చించినట్లు సమాచారంచంద్రబాబు అభిప్రాయ పడుతున్నారు. పార్లమెంటులో కేవలం నలుగురు సభ్యుల మద్దతు ఉన్న వైఎస్సార్ సీపీ కేంద్రం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం హాస్యాస్పదంగా ఉందనే దిశగా కూడా చర్చ జరిగింది.

cbn step 13032018 3

అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలని పేర్కొన్న నేతలు వైఎస్సార్ సీపీని ముద్దాయిల పార్టీ అని, అలాంటి పార్టీని తెలుగుదేశం కాదు కదా, ఇతర పార్టీల మద్దతు కూడా లభించబోదనే అభిప్రాయం వ్యక్తమైంది. కేసుల మాఫీ కోసం వైఎస్సార్ సీపీ కుప్పిగంతులు వేస్తోందని, ఢిల్లీ చుట్టూ, ప్రధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నదని దుయ్యబట్టిన ముఖ్యమంత్రి, ఇతర నేతలు ప్రజా క్షేత్రంలోనే ఎత్తుగడలను తిప్పి కొట్టాలని నిర్ణయించారు. యధావిధిగానే పార్లమెంటు వేదికగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని జాతీయ రాజకీయాలను నిశితంగా పరిశీలించి, బీజేపీ - వైసిపీ డ్రామాలు చూసి, మరో అస్త్రాన్ని ప్రయోగించాలనే నిర్ణయానికి నేతలు వచ్చారు.

చట్ట బద్దంగా ఇచ్చిన హామీలు విభజన అంశాల పై సుప్రీం కోర్టుకు వెళ్ళాలనే దిశగా కూడా కసరత్తు చేశారని సమాచారం. తొలుత సుప్రీంకోర్టులో కేసు వేసిన తరువాతే కేంద్రం స్పందనను బేరీజు వేయాలని చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా రావాల్సిన విభజన చట్టంలోని హామీల పై, ఇన్నాళ్ళు ఓర్పుగా చూసాం అని, ఇక ఉపేక్షించేది లేదని, చంద్రబాబు చెప్తూనే ఉన్నారు... అయితే, ఇప్పుడు కోర్ట్ కి వెళ్తే, అవి వెంటనే విచారణకు వస్తాయా ? ఇప్పుడు కేంద్రం ఏమన్నా చెయ్యాలనుకున్నా, కేసు తేలేదాకా వీలు ఉంటుందా అనే అంశాల పై కూడా, లోతుగా చర్చిస్తున్నారు... రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకుంటే, ఎంతటి నిర్ణయం అయినా తీసుకుంటానికి రెడీ అని చంద్రబాబు చెప్తున్నారు... ఎన్డీయేతో రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన బంధాన్ని కూడా సమీక్షించి, సమీప భవిష్యత్తులో అనుసరించనున్న వ్యూహంపై కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారు..

Advertisements

Latest Articles

Most Read