2013 ఫిబ్రవరి 24న ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రిగా తాను చేసిన వాగ్దానాన్ని ప్రస్తుత గౌరవ ప్రధాని గౌరవిస్తారని ఆశిస్తున్నానని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. రాజ్యసభలో స్వల్పకాల వ్యవధి చర్చలో పాల్గొంటూ... విభజన తర్వాత హైదరాబాద్‌ ఆదాయాలు తెలంగాణకే చెందుతాయి కనుక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న నిర్ణయాన్ని నాటి ప్రతిపక్ష నేత అరుణ్‌ జైట్లీ, ఇతర బీజేపీ నేతలతో కలసి చర్చించి తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాలను ఎవరు అధికారంలో ఉన్నా గౌరవించాలని, ఆ వాగ్దానాలు పార్లమెంట్‌ తరఫున చేసినవని మన్మోహన్‌సింగ్‌... మోదీకి గుర్తు చేశారు.

manmohan 25072018 2

‘‘హైదరాబాద్‌లో వసూలయ్యే ఆదాయమంతా తెలంగాణకు వెళ్తుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బంది ఏర్పడుతుందన్న ఉద్దేశంతోనే ఆనాడు నేను ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చాను. నాటి ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీతోపాటు, ఇతర భాజపా సీనియర్‌ నేతలతో చర్చించిన తర్వాతే ఆ ప్రకటన చేశాను. ప్రభుత్వం అన్నది నిరంతర ప్రవాహం. సభలో ఇచ్చిన హామీలను గౌరవించి అమలు చేయాలి. పార్లమెంటులో ఇచ్చిన హామీలకు ఆ గుణం ఉంటుంది. ఇప్పుడు ప్రధాని సహచరులుగా ఉన్న వ్యక్తులతో చర్చించిన తర్వాతే నేను ఆనాడు హామీలు ఇచ్చినందున... ప్రధాని వాటన్నింటినీ అమలు చేయాలి.’’ అని మన్మోహన్ అన్నారు.

manmohan 25072018 3

చర్చకు కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాధానమిచ్చారు. ‘‘విభజన చట్టంలోని ప్రతి అక్షరాన్నీ తు.చ. తప్పకుండా అమలు చేశాం. ఇప్పటికే 90 శాతం హామీలు నెరవేర్చాం. మిగిలినవి నెరవేరుస్తున్నాం. ప్రత్యేక హోదా ద్వారా లభించే నిధులకన్నా అధికంగానే ఇస్తున్నాం. ప్రధాన మంత్రి అంటే ప్రధాన మంత్రే. ఏ పార్టీ ప్రభుత్వానికి చెందిన వారైనా సరే... ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఏపీకి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తాం’’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని కూడా అన్నారు. అదే సమయంలో... మన్మోహన్‌ ఇచ్చిన హామీల్లో అత్యంత ప్రధానమైన ‘ప్రత్యేక హోదా’పై మాత్రం పాతపాటే పాడారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డంకిగా మారాయని రాజ్‌నాథ్‌ తెలిపారు. ‘‘

ఆంధ్రప్రదేశ్ సమస్యల పై ఢిల్లీతో పోరాడదాం రండి అంటే, నాలుగు నెలల నుంచి ఈ జగన్, పవన్ లలో ఒక్కడు కూడా, మోడీ అనే పేరు ఎత్తలేదు. కాని వెరైటీగా, చంద్రబాబుని మాత్రం, ఏకి పెడుతున్నారు. హోదా రాజకపోయినా చంద్రబాబే, జోన్ రాకపోయినా చంద్రబాబే, విభజన హామీలు ఒక్కటీ అమలు కాకపోయినా చంద్రబాబే. తెలుగుదేశం పార్టీ, ఢిల్లీలో మోడీ పై యుద్ధం చేస్తుంటే, ఆ పోరాటాన్ని దేశం మొత్తం మెచ్చుకుంటుంటే, ఈ వీరులు మాత్రం, ఆంధ్రప్రదేశ్ లో చిల్లర పంచాయతీ చేస్తున్నారు. నువ్వు వెధవ అంటే నువ్వు వెధవ అని.. నీకు నలుగురు పెళ్ళాలు అంటే, నువ్వు లక్ష కోట్ల దొంగ అని, ఇలా చిల్లర తనంగా కొట్టుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, ఈ రోజు కూడా మోడీని ఢిల్లీలో డీ కొట్టింది. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అంటే, మరో సారి ఎండగట్టింది.

tdp 25072018 2

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ గంగలో కలిపారని తెదేపా లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభలో జీరో అవర్‌ సందర్భంలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన ఆయన తెలుగులో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భగా ప్రధాని ఇచ్చిన సమాధానం ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని విమర్శించారు. ప్రజలంతా కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఎలుగెత్తి చాటుతున్నారని చెప్పారు. 2014లో రూపొందించిన రాష్ట్ర విభజన చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంపైనే ఉందన్నారు.

tdp 25072018 3

విభజన సమయంలో ఆనాడు మోదీ సహచరులతో మాట్లాడాకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చామని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నిన్న రాజ్యసభలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా తోట నర్సింహం ప్రస్తావించారు. కేంద్రం ఇప్పటికైనా ఏపీకి జరిగిన అన్యాయంపై కళ్లు తెరవాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా రూపొందించిన చట్టాలను అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. రాష్ట్రం పట్ల కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజల సమస్యలను, ఆంధ్రప్రదేశ్‌ విభజన సమస్యలను కూడా ప్రస్తావించడంలేదన్నారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా సుమారు గంటన్నర పాటు మాట్లాడిన నరేంద్ర మోదీ రాజకీయ ఉపన్యాసం చేశారు తప్ప ఏపీకి సాయం చేసేలా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

మనం మన హద్దుల్లో ఉంటే, హుందా రాజకీయం చేస్తే, ఎవడైనా హుందాగానే రియాక్ట్ అవుతారు. లేదు నేను ఎదుటి వాడిని పుల్ల పెట్టి కెలికి కెలికి పెడతాను, కాని నన్ను మాత్రం, ఎవరూ ఏమీ అనకూడదు, అనే వేషాలు ప్రజా జీవితంలో కుదరవు. మన వెనుక వంద బొక్కలు పెట్టుకుని, ఎదుటివాడిని కాలేలాగా రెచ్చగోడితే, మన బొక్కలు గురించే మాట్లాడతారు. ఎక్కడ వరకు ఆగాలో, అక్కడ ఆగితే, ఎవరికీ ఇబ్బంది ఉండదు. నేను ఏమైనా అంటాను, నన్ను మాత్రం ఎవరూ ఏమి అనకూడదు అంటే రాజకీయాల్లో అస్సలు కుదరదు. నిన్న జగన్ ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేసాడో చూసాం. అది తప్పు అని అందరూ ఖండించారు కూడా. మరి పవన్ కళ్యాణ్ కావాలని ఒక వర్గాన్ని మాటి మాటికి రెచ్చగొట్టే చర్యలు కూడా ఖండించాలి కదా..

pawan 25072018 2

నిన్న పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. అది డైరెక్ట్ గా హిందూపురం ఎంపీ బాలకృష్ణ గురించి అనే విషయం అందరికీ తెలుస్తుంది. ఆ ప్రెస్ నోట్ ప్రకారం, పవన్ అభిమానులు, ఓ ర్యాలీలో బైక్ సైలెన్సర్లు తీసేసి భారీ రొద చేసిన విషయంలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. జ‌న‌సేన సైనికులు బైక్ సైలెన్స‌ర్ తీసి శబ్దం చేస్తే అదేదో పెద్ద నేరం చేసిన‌ట్లు చూస్తున్నారని ఆరోపించిన ఆయన, ఇంట్లో తుపాకీతో కాల్చి బ‌య‌ట‌ తిరుగుతున్న వాళ్ల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. జ‌న‌ సైనికుల సంస్కారం చాలా గొప్ప‌ద‌ని వ్యాఖ్యానించారు పవన్. అదే సమయంలో వ్యాపారాలు చేసే వాళ్ళు రాజకీయాల్లోకి పనికిరారు అంటూ, ఆ ప్రెస్ నోట్ లో ఉంది.

pawan 25072018 3

అందరూ జగన్ లాంటి వారు కాదు కాబట్టి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పవన్ చేసిన వ్యాఖ్యల పై స్పందించలేదు. స్పందించి ఉంటే ఎంత రచ్చ అయ్యేది ? కులాల మధ్య గొడవలు దాకా వెళ్ళేది. పవన్ కళ్యాణ్ కులాల మధ్య గొడవలు పెట్టటానికి చుస్తున్నాడు, అతనికి స్పందించవద్దు అని ఆదేశాలు ఇవ్వటంతో, ఎవరూ పవన్ ని సీరియస్ గా తీసుకోవటం లేదు. అయితే, వ్యాపారాలు చేసే వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు అనే పవన్, సినిమా అనేది వ్యాపారం కాదు సంఘ సేవ అని పవన్ ఉద్దేశమా ? మెగా ఫ్యామిలీ లో 9 మంది హీరో లు,5 గురు నిర్మాతలు చేసేది సంఘ సేవా ? ప్రజా రాజ్యం పార్టీ పెట్టి చేసింది వ్యాపారం కాదా ? పవన్ పార్టీలో కొత్తగా చేరుతున్న వారు వ్యాపారస్థులు కాదా ? ఎదుటి వాడికి చెప్పే సమయంలో, మన వెనుక ఏముందో చూసుకోకుండా, స్టేట్మెంట్ లు ఇస్తే, ప్రజలు గొర్రెల మంద అనుకుంటున్నారా ?

నిన్న జగన్ చేసిన వ్యాఖ్యల పై పవన్ స్పందించారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ బలమైన వ్యక్తిని కాబట్టే జగన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని అన్నారు. మార్పుకోసం ప్రయత్నిస్తున్నాననే కోపంతో జగన్‌, బీజేపీ, తెలుగుదేశం నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని పవన్‌ అన్నారు. సంస్కారం లేకుండా మాట్లాడే అలవాటు నాకు లేదు అని పవన్ అన్నారు... ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి, ఆయన చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఇది మాట్లాడే ముందు, వ్యక్తిగత దూషణలుకు మేము దూరం, కాని పవన్ లాంటి వాడు, వేదాలు మాట్లాడుతుంటే, ఈయన ఇంతకు ముందు చేసిన సంస్కారం లేని పనులు చెప్పాలి..

pk 25072018 2

చంద్రబాబు మామని వెన్ను పోటు పొడిచాడు అన్నాడు పవన్... ఇది వ్యక్తిగతం కాదా ? అది వాళ్ళ పార్టీ విషయం, దీనికి ప్రజలకు సంబంధం ఏమి ఉంది ? మొన్న వైజాగ్ లో, లోకేష్ ని ఉద్దేశించి, ఎంత హేళనగా మాట్లాడాడో అందరూ చూసారు. ఒక మనిషి ఆకారాన్ని గురించి మాట్లాడటం వ్యక్తిగతం కాదా ? ఇది సంస్కారవంతులు వాడే భాషా ? ఇక నాలుగు నెలల క్రితం, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో వేసిన వెకిలి ట్వీట్ లు చూసాం.. రవి ప్రకాష్, రాధా కృష్ణ ఫ్యామిలీ ఫోటోలు వేసి మరీ, వారిని హేళన చేసాడు. ఇది వ్యక్తిగతం కాదా ? జగన్ చేసిన పనిని, చంద్రబాబుకి లింక్ పెట్టి, సంస్కారం లేని పని అని చెప్తున్న పవన్, నువ్వు చేసిన, చేస్తున్న పనులు సంస్కారం ఉన్న పనులా ?

ఈ ట్వీట్లు చూడండి, ఇది సంస్కారం ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలా ? ఇతనే ఇలా మాట్లాడితే, అసలకే అదుపు తప్పిన ఇతని ఫాన్స్ ఎలా మాట్లాడతారు ? ఈ ట్వీట్స్ చూడండి.. "బొంబాయిలో ఇంతే.. బొంబాయిలో ఇంతే".. "బాబు నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం, కూర, పప్పు తో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా.. అలాగే సంస్కారవంతమైన సబ్బుతో తల స్నానం చెయ్యమని చెప్పండి.." "త్వరలోనే సరదాగ , కాలక్షేపం కోసం “అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !! ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది ..i #areyOsambaHukumSardar" "RK, please welcome to ““బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదూసి కొడదాం “ కార్యక్రమానికి మీకు స్వాగతం.." "Stay tuned to “బట్టలు విప్పి మాట్లాడుకుందాం” program nunchi - Pawan Kalyan with cameraman Twitter."..

pk 25072018 3

చంద్రబాబు అమ్మ గురించి, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు జనసేన ఎందుకు ఖండించలేదు ? చంద్రబాబుని ఫోర్త్ జెండర్ అని సంభోదిస్తే జనసేన ఎందుకు ఖండించలేదు ? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కాల్చి పారేయ్యమంటే, ఎందుకు ఖండించలేదు... అప్పుడు మాత్రం, పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు మన మీద ఎదురు వచ్చే సరికి నొప్పిగా ఉంది. తప్పుని తప్పు అని ఖండించి, విలువలతో కూడిన రాజకీయం నువ్వు చేసి ఉంటే, నీ మీద జగన్ చేసిన వ్యాఖ్యలకు అందరూ సపోర్ట్ ఇచ్చే వారు. నువ్వు ఏక్ నెంబర్ అయితే, జగన్ దశ్ నెంబర్... ఇద్దరూ ఒక్కటే స్కూల్.. వ్యక్తిత్వంలో నిలకడ లేని ప్రతి వాడూ కులాన్ని వేసుకొని నాయకుడిలా బయలు దేరటం మన ఖర్మ కాక మరేంటి?

Advertisements

Latest Articles

Most Read