రాష్ట్రంలో జిల్లాల విభజన అన్నది పూర్తిగా ప్రజల అభిప్రాయం మేరకు జరగాలని, శ్రీకాకుళం జిల్లా విభజన కూడా ఆ విధంగా ప్రజల అభిప్రాయం మేరకు జరగాలని, లేనిపక్షంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా విభజిస్తే అన్ని విధాలా పూర్తి నష్టం జరుగుతుందని మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్ర సాదరావు నిర్వందంగా తెలియచేశారు.రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రి కృష్ణదాస్, వైకాపా రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా పర్యవేక్షకులు విజయసాయిరెడ్డి సమక్షంలోనే ధర్మాన ప్రసాదరావు జిల్లా విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఉన్న ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు పార్లమెంటరీ నియోజ కర్గాలవారీగా విభజన జరిగితే శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లాలోకి వెళ్లిపోతాయి. ఇవి ప్రస్తుతం విజయనగరం పార్లమెంటరీ నియోకవర్గంలో ఉన్నాయి.

ఇటీవల జగన్మోహనరెడ్డి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని ప్రకటించడంతో జిల్లా వాసులకు ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రెండు నియోజకవర్గాలు వెళ్లిపోతే శ్రీకాకుళం జిల్లా పూర్తిగా వెనుకబడిపోయిన జిల్లా అయిపోతుందని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా విభజన జరిగితే అంతే సంగతులని ఆయన అన్నారు. వైఎస్ కుటుంబానికి శ్రీకాకుళం జిల్లాపై ఎంతో ప్రేమ ఉందని, వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి ఇంతవరకూ రాష్ట్రంలో ఏప్రభుత్వ కార్యక్రమమైనా అనేకం శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా ప్రసాదరావు అభిప్రాయంతో ఏకీభవించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయలమేరకే ప్రభుత్వం జిల్లాల విభజన చేస్తుందని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read