రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ అమరావతి. మొన్నటి వరకు కార్యాలయాలకు వైసీపీ రంగులు, డాక్టర్ సుధాకర్, నిమ్మగడ్డ కేసులు ప్రతి రోజు కోర్టుల్లో నాని, ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించాయి. అయితే ప్రభుత్వం మాత్రం, తాను అనుకున్నది చెయ్యాలి అనే పట్టుదలతో, కోర్టుల ముందు మాత్రం, ఇబ్బందులు పడింది. అన్ని విషయాల్లో ఇటు హైకోర్టులో, అటు సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా అమరావతి అంశం తెర పైకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని కోసం, రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, నిర్ణయం తీసుకుంది. రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులు ప్రభుత్వం ఆమోదించుకుంది. అయితే ఈ రెండు బిల్లులు చెల్లవు అంటూ, రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, మరి కొన్ని సంఘాలు కలిసి, హైకోర్టులో పిటీషన్ వేసి, బిల్లులను నిలుపుదల చెయ్యాలని, హైకోర్టుని కోరాయి.

దీని పై విచారణ జరిపిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చెయ్యమని, ఎన్ని రోజులు కావాలని అడగటం, దానికి ప్రభుత్వ తరుపు న్యాయవాది పది రోజులు కావాలి అని చెప్పటంతో, హైకోర్టు అందుకు అంగీకరిస్తూ, అప్పటి వరకు స్టేటస్ కో విధించింది. అయితే ఇప్పుడు హైకోర్టు నిర్ణయం పై, ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఆదేశాలు నిలిపివేయాలని సుప్రీంని కోరింది. హైకోర్టు ఎక్స్‌పార్టీగా పేర్కొంటూ, ప్రాధమిక కారణాలు తెలియకుండా, హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అని ప్రభుత్వం పిటీషన్ లో తెలిపింది. అయితే, ప్రభుత్వానికి కోర్టుకు వెళ్ళే హక్కు ఉన్నా, ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ హైకోర్టు కేవలం ప్రభుత్వానికి కౌంటర్ వెయ్యటం కోసమని, పది రోజులు గడువు ఇస్తూ, స్టేటస్ కో విధించింది కానీ, స్టే ఇవ్వలేదు. ఒక వేళ ప్రభుత్వం, మేము 2-3 రోజుల్లో కౌంటర్ ఇస్తాం అంటే కోర్టు ఏమి చెప్పేదో. పది రోజులు కూడా ఆగకుండా, ఇంత హడావిడిగా ప్రభుత్వం సుప్రీంకు ఎందుకు వెళ్లిందో అర్ధం కావటం లేదు. మరి ప్రభుత్వ ఆలోచన ఏమిటో, రేపు సుప్రీం కోర్టు ఏమి చెప్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read