కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం మాదిరిగానే ఉంది వైసీపీ మద్దతుతోఓ ప్రముఖ చానెల్ పోరాటం. మునిగిపోయే పడవలాంటి వైసీపీ కోసం సదరు చానెల్ దశాబ్దాలుగా కూడగట్టుకున్న క్రెడిబులిటీ-రేటింగ్స్ కూడా పణంగా పెట్టేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. వాస్తవంగా తెలంగాణ పెద్దల కోసం రవిప్రకాశ్‌ని రకరకాల కేసుల్లో ఇరికించి ఆ చానెల్ చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ కోసం కాకుండా జగన్ కోసం 24 గంటలూ పనిచేయడం మొదలుపెట్టింది. సరే ఎవరు యజమాని అయితేనేం? ఏళ్లుగా సాధించుకున్న నెంబర్ వన్ స్థానాన్ని వైసీపీ కోసం వదులుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడు ఆ ప్రముఖ చానెల్ నెంబర్ 1 స్థానాన్ని వదులుకుంది. ఒక వారం బార్క్ రేటింగ్స్‌లో నెంబర్ వన్‌కి వచ్చిన ఆ ఛానెల్ కోట్లు ఖర్చు చేసి కుట్రలతో, కుతంత్రాలతో నెంబర్ వన్ స్థానం ఎవరూ కొట్టేయ్యలేరంటూ భారీ హోర్డింగులతో హోరెత్తించింది. కేకులు కట్ చేశారు. సిబ్బందితో బలవంతపు సంబరాలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ నెంబర్ వన్ సంబరం ఒక్క వారం కూడా నిలవలేదు. 23వ వారానికి 80 పాయింట్లతో ఎన్టీవీ దూసుకుపోయింది. ముఖ్యమైన మెట్రో నగరం హైదరాబాద్‌లోనూ ఆ చానెల్ రేటింగ్ ఫస్ట్ ప్లేసు నుంచి జారిపోయింది. తెరచాటు యజమాని కోసం అథఃపాతాళానికి దిగజారిపోయి తప్పుడు వార్తలు ప్రసారం చేయడానికీ వెనుకాడని ఆ చానెల్ విశ్వసనీయత పూర్తిగా కోల్పోయింది. విలువలు-వంకాయలు- మూటగట్టి మూలన పెట్టి వక్రీకరణలు, వక్రభాష్యాల ఆ చానెల్ ప్రస్తుతం సెకండ్ ప్లేస్. ఇలాగే కొనసాగితే ఆ స్థానం అట్టడుగుకి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు మీడియా ఎనలిస్టులు.
వైసీపీ తోక పట్టుకుని నిండా మునిగిన ప్రముఖ చానెల్
Advertisements