శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ సోదాలపై కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్. రాజకీయ వేధింపుల్లో భాగంగానే కేంద్రం ఐటీ అధికారులను రంగంలోకి దించిందని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడింది. ఒకేసారి 19 బృందాలను దించడం ఎప్పుడూ జరగలేదని మండిపడింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంతో ప్ర త్యక్ష యుద్ధానికి దిగాలని నిర్ణయించింది. ఉద్దేశపూర్వకంగా, రాజకీయ వేధింపుల దృష్టితో చేస్తున్న ఇటువం టి దాడులకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల సహకారం ఇవ్వరాదని నిర్ణయించారు.

ap cabinet 06102018

ఐటీ సోదాలకు వచ్చే అధికారులకు భద్రత కల్పించకూడదని నిర్ణయించింది. లా సెక్రటరీ సలహా తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకే సామాజికవర్గంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని.. కేంద్రంపై అన్ని స్థాయిల్లో పోరాటం చేయాలని.. ఈ మేరకు కేబినెట్‌లో చర్చించినట్టు సమాచారం. కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న తీరు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను రాజకీయ ప్రత్యర్థులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయాలని తీర్మానించారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఏసీబీ వంటి సంస్థలు విచారణ జరపకుండా గతంలో ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకోవడంపైనా దృష్టి సారించారు.

ap cabinet 06102018

మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో కూడా చైతన్యం కలిగించడానికి రాజకీయంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ‘‘నేను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇందిరాగాంధీ నుంచి అనేక మంది ప్రధాన మంత్రులను చూశాను. రాజకీయంగా అనేక మందితో విభేదించాం. కానీ, ఈ ప్రధానిలాగా పగ, కక్షతో వ్యవహరించే ధోరణి ఎక్కడా లేదు. ప్రతి రోజూ ఏదో ఒక అలజడి. తెల్లవారితే ఈ రోజు ఏం చేస్తారో... ఎక్కడ సమస్య తెస్తారో అని కాచుకొని చూసుకొనే పరిస్థితి తేవడం ఘోరం. దీనిని చూస్తూ ఊరుకోవడం సరికాదు. ఎంతవరకైనా పోరాడదాం’’ అని సీఎం అన్నారు. రాజకీయ వేధింపులే కాకుండా ఏపీకి పెట్టుబడిదారులు రాకుండా చేయాలన్న కసి కేంద్రంలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఎప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నా, సర్వేలు రావటం అనేది సహజం. అయితే మన రాష్ట్రంలో మాత్రం, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి, అనూహ్యంగా, జాతీయ మీడియాలో కూడా, మన రాష్ట్రం గురించి సర్వేలు వెయ్యటం ప్రారంభం అయ్యాయి. ఇలాంటివి ఇది వరకు ఎన్నికలప్పుడు మాత్రమే జాతీయ మీడియా వేసిది. అయితే జగన్ మాత్రం, తనకు తెలిసిన విద్యలతో, జాతీయ మీడియాతో టై అప్ అయ్యి, సంవత్సరం ముందు నుంచి హడావిడి చేస్తూ, జగన్ గెలిచిపోతున్నాడు అంటూ ఆ సర్వేలు వేయించుకుంటాడు. అదే తీసుకవచ్చి, తన పేపర్ లో మెయిన్ హెడ్డింగ్ గా వేసుకుని, తాను ఆనంద పడుతూ, తన అభిమనాలుని ఆనంద పరుస్తాడు.

republic 05102018 1

ఈ కోవలోనే, నిన్న ఒక సర్వే వచ్చింది. అందులో, జగన్ గెలిచిపోతున్నాడు, చంద్రబాబు ఓడిపోతున్నాడు అంటూ, ఆ సర్వే ఊదరగొట్టింది. జగన్ మోహన్ రెడ్డికి 21 ఎంపీ సీట్లు, చంద్రబాబుకి కేవలం 4 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయి అంట. అంతే కాదు, బీజేపీకి మన రాష్ట్రంలో 12.5% ఓటు షేర్ ఉంది అంట. కాంగ్రెస్ కి 7.2% ఇక ఓటు షేర్ ఉంది అంట. ఇది చూసుకుని, జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా ఆగటం లేదు. అయితే, ఈ సర్వే ఫాల్స్ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే, ఇది వరకు కూడా ఇలాంటే సర్వేలే వచ్చాయి. తీరా ఎన్నికలు ఆయిత తరువాత, జగన్ ఓడిపోవటం అనేది కామన్.

republic 05102018 1

జగన్ ఏమో సర్వేల్లో గెలుస్తాడు, చంద్రబాబు ఏమో, ప్రజల్లో గెలుస్తాడు, ఇదే జరుగుతూ వస్తుంది. కావాలంటే, అప్పట్లో జగన్ గెలుస్తాడు అంటూ చెప్పిన సర్వే లు చూడండి.. ఇలా ప్రజలను ప్రభావితం చెయ్యటానికి, జగన్, అమిత్ షా పడుతున్న తిప్పలు ఇవి. దీని పై తెలుగుదేశం కూడా స్పందించింది... కేంద్ర ప్రభుత్వం ఛానెల్స్ ద్వారా తప్పుడు సర్వేలు చేయిస్తోందని, మన రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉంటే, ఈ సర్వేలో మాత్రం 26 సీట్లు చూపిస్తున్నారని, ఈ సర్వే ఎలాంటిదో ఇక్కడే తెలుస్తుందని అన్నారు. బీజేపీకి బాకా కొట్టే ఇలాంటి ఛానెల్స్ లో సర్వేలు వేస్తే, ప్రజలు నమ్మరని, కనీసం గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉన్నా ప్రజలు నమ్ముతారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒకేసారి, వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది ఐటి అధికారులు రావటం, ఉదయంగా నుంచి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల పై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ సీనియర్లతో మాట్లాడారు. ఎన్నికల జరగబోయే రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దాడులు చేయటం బీజేపీకి అలవాటైపోయిందని వ్యాఖ్యానించారు. ఇది మోడీ, షా నైజం అని తెలిపారు. తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, తెలంగాణాలో ఇలాగే చేసారని, మన పై ఎన్నికల ముందు వస్తారనుకుంటే, ఇప్పుడే మొదలు పెట్టారని అన్నారు. పార్టీ నేతలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొంటామని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

itraids 05102018

అయితే ఉదయం టిడిపి నేతల ఇళ్ళ పై దాడికి బయలుదేరిన ఐటి అధికారులు, మీడియా వెంబడించడం, టీడీపీ వర్గాలకు సమాచారం అందటంతో ప్లాన్ బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. మొదట బెంజిసర్కిల్‌లోని నారాయణ కాలేజికి వెళ్లిన ఐటీ బృందం మీడియా వెంబడించడంతో అక్కడి నుంచి బందర్ రోడ్డులోకి వెళ్లారు. అయితే తమను వెంబడించవద్దని మధ్యాహ్నం తర్వాత తామే వివరాలు వెల్లడిస్తామని ఐటీ అధికారులు స్పష్టం చేశారు.విజయవాడలో నారాయణ కళాశాలల వద్దకు వచ్చిన ఐటీ అధికారులు ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ కళాశాలలపై ఎటువంటి ఐటీ దాడులు జరగలేదని మంత్రి నారాయణ ప్రకటించారు.

itraids 05102018

నెల్లూరులోని మంత్రి ఇంటి వద్దకు కూడా వెళ్లారని సమాచారం అందింది. అయితే ఆ సమయంలో మంత్రి నారాయణ ఇంట్లోనే ఉన్నారు. అక్కడకు ఎవరూ రాలేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలపై మోదీ ప్రభుత్వం కక్షసాధిస్తోందని మంత్రి నారాయణ ఆరోపించారు. బీదా మస్తాన్‌రావు సంస్థలపై ఐటీ దాడులు కుట్రపూరితమే అని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటకలో మాదిరిగా ఏపీపై పెత్తనం చేయాలని భావిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని నారాయణ విద్యాసంస్థలపై ఎక్కడా కూడా ఐటీ అధికారులు దాడులు చేయలేదని వివరించారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలపై కూడా దాడులు జరుగుతాయని ముందుగా ప్రచారం జరిగింది. విజయవాడ నుంచి కొన్ని ఐటీ బృందాలు గుంటూరు వైపునకు వెళ్లడమే ఈ ప్రచారానికి కారణం.

ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల ఈరోజు ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత బీద మస్తాన్ రావు సహా పలువురు నేతలకు సంబంధించిన కంపెనీల్లో ఈ రోజు తనిఖీలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈరోజు అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశానికి ముందే కొందరు మంత్రులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న విమర్శలు, రాష్ట్రంలో ఐటీ అధికారుల దాడుల అంశంపై అంతర్గతంగా చర్చ జరిగినట్టు సమాచారం.

cbn cabinet 05102018 2

కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించి టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని, నేతలంతా ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. టీడీపీలోనే కాకుండా ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా టీడీపీ నేతలే టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుగుతుండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీద మస్తాన్ రావు వ్యాపార సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. నిన్న మొదలైన ఈ తనిఖీలు నేడు కూడా కొనసాగాయి. కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన కుటుంబసభ్యుల కంపెనీల్లో సోదాలు జరిగినట్లు సమాచారం.

cbn cabinet 05102018 3

టంగుటూరు మండలం చెరువుకొమ్ముపాలెంలోని సదరన్‌ గ్రానైట్స్‌ కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహించింది. అలాగే జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంటలో సదరన్‌ ట్రోపికల్‌ ఫుడ్స్‌ ఆఫీసులో ఐటీ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. నారాయణ విద్యా సంస్థల్లో తనిఖీలు చేసేందుకు ఐటీ ప్రయత్నించడంతో ఇది కేవలం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోదీకి తనకు నచ్చని వారిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయించడం అలవాటుగా మారిందని, భయపడాల్సిన అవసరం లేదని.. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని నేతలకు టీడీపీ అధినేత సూచించారు. ఇదిలా ఉంటే.. మంత్రులతో చంద్రబాబు జరిపిన సమావేశంలో కేసీఆర్ విమర్శలు కూడా చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.

 

Advertisements

Latest Articles

Most Read