ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందనే విధంగా మారింది, ఏపిలో ఉద్యోగులు పరిస్థితి. ఐఆర్ కంటే పీఆర్సీ తక్కువ ఇచ్చిన చరిత్ర ఏపి ప్రభుత్వానిది అయితే, అది తీసుకున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకే దక్కిందని, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది. అయితే ఇప్పుడు నిన్న రాత్రి ప్రభుత్వం ఇచ్చిన జీవోతో, ఉద్యోగులు మరింత షాక్ తిన్నారు. హిఆర్ఏ, పెన్షన్ కు సంబంధించి, ఉత్తర్వులు ఇచ్చింది. ఈ దెబ్బతో ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా మోసపోయాం అని గ్రహించి, ఈ రోజు నుంచి ఆందోళనకు పిలిపు ఇచ్చాయి. ప్రధానంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమాఖ్య, ఈ రోజు ఆందోళనకు పిలిపు ఇచ్చింది. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావటంతో పాటుగా, ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసల ర్యాలీలు నిర్వహించటంతో పాటుగా, నిన్న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను దగ్ధం చేయాలని పిలుపు ఇచ్చింది. అలాగే ఉద్యోగ సంఘాలు రేపు అందరినీ మీటింగ్ కు రమ్మన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. అప్పటి వరకు కూడా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక కొన్ని ఉద్యోగ సంఘాలు అయితే, ఈ విషయం పైన నోరు ఎత్తటం లేదు. అయితే కింద స్థాయి నుంచి వచ్చిన ఒత్తిడితో, కొన్ని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలిపు ఇచ్చాయి.

prc 18012022 2

ఆంధ్రర్పదేశ్ లో ఉద్యోగ సంఘాలకు సంబంధించి ప్రధానంగా, రాష్ట్ర సచివాలయానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులు 30 శాతం hra తీసుకుంటున్నారు. వీరి అందరికీ ఇప్పుడు ఇందులో కోత పడింది. 14 శాతం తగ్గించి 16 శాతం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో 20 శాతం hra తీసుకుంటున్నారో, వారు అంతా కూడా 8 శాతానికి వచ్చేసారు. వారు అంతా కూడా ఇప్పుడు లబో దిబో అంటున్నారు. దీంతో పాటు మరో కీలకమైన విషయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఐర్ 27 శాతం చేసిందో, అది ఇప్పుడు 23 శాతం వచ్చింది. అయితే ఇందులో కూడా డీఏ అరియర్స్ అడ్జస్ట్ చేస్తామని చెప్పటంతో, ఉద్యోగులు మరింత షాక్ కు గురయ్యారు. ఇక మరో అంశం, ఇక నుంచి పీఆర్సీ ప్రతి 5 ఏళ్ళకు కాకుండా, ప్రతి 10 ఏళ్ళకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే డీఏలు తప్ప, ఇక పదేళ్ళ వరకు జీతాలు పెరగవు. దీంతో మొత్తం అంశాలు రాత్రి వదిలిన జీవోలు చూసి, ఉద్యోగ సంఘాల నోట మాట రావటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read