తెలుగు రాష్ట్రాల్లో, రాజకీయాలు, సినిమా రంగం కలిసే ప్రయాణం చేస్తూ ఉంటాయి. గత ఎన్నికల్లో ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవటంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. నందమూరి, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టి, దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవటంలో వైసీపీ సకెస్స్ అయ్యింది. ఎన్నికల తరువాత, పవన్ కళ్యాణ్ ని, జగన్ టార్గెట్ చేస్తున్న విధానం చూసి, చాలా వరకు మెగా అభిమానులు, వైసీపీ నుంచి దూరం అయ్యారు. ఇదే సందర్భంలో జగన్ మాత్రం, చిరంజీవిని దగ్గరకు తీసారు. అయితే చిరంజీవికి వస్తున్న సినిమాలు ఫ్లాప్ అవ్వటం, రాజకీయంగా కూడా చిరంజీవి దూరంగా ఉండటంతో, వైసీపీకి రాజకీయంగా ఉపయోగ పడలేదు. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అవ్వటం, హిట్ టాక్ రావటంతో, సహజంగానే సినీ అభిమానుల్లో ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. దీన్ని తనకు అనుకూలంగా వైసీపీ మలుచుకుంది. చిరంజీవికి సపోర్ట్ గా వైసీపీ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే వారు పోస్ట్ లు పెట్టారు. ఇది ఇలా నడుస్తూ ఉండగానే, నిన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రయ్య నిర్వహించిన ఆలయ్ బలయ్ కార్యక్రమంలో, చిరంజీవి పాల్గున్నారు. చిరంజీవితో పాటుగా, పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారు కూడా పాల్గున్నారు.

garikapati 07102022 2

ఈ సందర్భంగా గరికపాటి వారు ప్రసంగిస్తూ ఉండగా, మరో పక్క చిరంజీవి ఫోటో షూట్ లు చేస్తూ బిజీగా ఉన్నారు. స్టేజి పైన మొత్తం గందరగోళంగా ఉండటంతో, గరికపాటి వారికి ఆగ్రహం వచ్చింది. అప్పటికీ గౌరవంగానే, చిరంజీవిని విజ్ఞప్తి చేస్తూ, ఫోటో షూట్ ఆపేయాలని కోరారు. ఇలా ఉంటే తాను ప్రసంగించలేనని అన్నారు. కొద్ది సేపటికి చిరంజీవి వచ్చి, ఆయన పక్కన కూర్చోవటంతో, ఆయన ప్రసంగించారు. వాళ్ళు ఇద్దరూ అక్కడ బాగానే ఉన్నారు. నిజానికి ఇద్దరూ అతిధులే, ఒకరు మాట్లాడేప్పుడు, మరొకరు గౌరవించుకోవాలి. అయితే ఈ అంశంలో, చిరంజీవి అభిమానులు, సోషల్ మీడియాలో గరికపాటి పై వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. దీనికి ఆజ్యం పోస్తూ వైసీపీ సోషల్ మీడియా కూడా రంగంలోకి దిగింది. గతంలో గరికపాటి తన ప్రసంగాలలో వివిధ సందర్భాల్లో అన్న ఎన్టీఆర్, చంద్రబాబు ప్రస్తావన తీసుకు వస్తూ చేసిన ప్రసంగాలు పెట్టి, ఆయన్ను తెలుగుదేశం వారిగా సృష్టించే ప్రయత్నం చేస్తూ, అమర్యాదగా పోస్టులు పెడుతూ, పద్మశ్రీ గరికపాటి వారిని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. చిరంజీవి, గరికపాటికి లేని బాధ, వీళ్ళకు ఎందుకో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read