పథకాలు తీసేస్తాం, అక్రమకేసులు పెడతాం, దాడులు చేస్తామంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. గత మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి ప్రజా తీర్పును తారుమారు చేసినట్లుగా ఈ రోజు కౌంటింగ్ కూడా వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి పంచాయతీలో ఆఖరి ఓటు లెక్కించేంతవరకు ఎవరూ కౌంటింగ్ కేంద్రం వదలి బయటికి రావద్దు. ప్రతి పంచాయతీలో చివరి ఓటు లెక్కించేంతవరకు అప్రమత్తంగా ఉండాలి. కరెంటు తీసి వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతుండడంపై జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి డిక్లరేషన్ ఇచ్చేంతవరకు ఎలక్షన్ ఏజెంటు, కౌంటింగ్ ఏజెంటు, అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోను బయటికి రావద్దు. పోలీసులు ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించినా, బెదిరింపు చర్యలకు దిగినా, కౌంటింగ్ ప్రక్రియలో వైసీపీ నేతలు ఏవైనా అవకతవకలకు పాల్పడినా వెంటనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి 7557557744 లేదా ఎస్ఈసీకి 08662466877 నెంబరుకు తెలియజేయండి. 9గానీ, అంతకంటే తక్కువ ఓట్లుగానీ తేడా ఉన్నప్పుడు మాత్రమే రీ కౌంటింగ్ చేయాలి. ఒకసారి మాత్రమే రీకౌంటింగ్ చేయాలి. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో కెమెరాలు లేదా సీసీ కెమెరాలతో రికార్డు చేయాలి. కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తయి ఫలితాలు ప్రకటించకుండా, డిక్లరేషన్ ఇవ్వకుండా జాప్యం చేసినా వెంటనే తెలియజేయాలి. చివరి ఫలితం తేలేంతవరకు తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం అందుబాటులో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఏ ఇబ్బంది వచ్చినా గానీ తెలియజేయగలరు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read