ఈ రోజు మరోసారి డీజీపీ గౌతం సవాంగ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికీ ఆయన నాలుగు అయుదు సార్లు హైకోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించగా, మూడు సార్లు హైకోర్టు ముందుకు వచ్చారు. ఈ రోజు మరోసారి డీజీపీని హైకోర్టు ముందుకు రావాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు దిక్కరణ పిటీషన్ పైన విచారణ చేసిన ధర్మాసనం, ఈ నెల 27న డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు, హోం సెక్రటరీ కూడా, తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు పూర్వాపరాలు చూస్తే, రామారావు అనే పోలీసు అధికారి ప్రమోషన్ విషయంలో, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అధికారులు పాటించలేదని, దాని పై కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. ఆ పిటీషన్ పైన గతంలో విచారణ జరిగిన సమయంలో డీజీపీ హాజరు కావాలని, ఈ రోజు హాజారు కావాలని గతంలోనే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు డీజీపీ తరుపున అఫిడవిట్ దాఖలు చేసారు. అందులో, ఎన్నికల విధుల్లో హాజరుకాలేక పోతున్నాం అని, అఫిడవిట్ దాఖలు చేయగా, దాని పై ధర్మాసనం ప్రశ్నించింది. ఒక పక్క ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఆదేశాలు వచ్చే వరకు, ఎన్నికలు వద్దు అంటుంటే, మీరు ఇలా అఫిడవిట్ ఎలా దాఖలు చేసారు అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఈ నెల 27న మాత్రం కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read