విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో హోంగార్డుల ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీయిజం ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి అన్నారు. హోంగార్డులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటున్నారని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులను, పోలీసులకు వేరుగా చూడటం లేదన్నారు. ఇది సన్మాన సభ కాదని.. హోంగార్డుల చైతన్య సభ అని పేర్కొన్నారు. కేంద్ర సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థ సహకరిస్తే మొట్టమొదట హోంగార్డులనే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడటంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలసి సీఎం పోలీసుశాఖకు సూచించారు. లాక్డ్ హౌస్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు.

homegaurds 02072018 1

1948లో ఆంధ్రప్రదేశ్ హోం గార్డ్ చట్టం రూపకల్పన చేశారు. పోలీసులతో సమానంగా ప్రకృతి వైపరీత్యాలు, శాంతి భద్రతల, ట్రాఫిక్ విధుల్లో, నేరపరిశోధన పనుల్లో, బీటు డ్యూటీ సమయంలో విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ వ్యవస్థ ఏర్పడి 70 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం మేలు చెయ్యని విధంగా ఈ వ్యవస్థ కు గౌరవం, గుర్తింపు తీసుకొని రావడం జరిగింది. ఇప్పటి వరకు రోజువారి అందించే దినసరి భత్యాన్ని రూ.400 నుంచి రూ.600 పెంచుతూ నెలకు రూ.9000 ఉన్న జీతాన్ని రూ.18000 జీతం చెల్లింపుకు ఉత్తర్వులు జారీచేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి గరిష్టంగా రూ.2,50,000 వైద్య సేవలు కల్పిస్తున్నారు. హోం గార్డ్ మరణించిన సమయంలో ఇచ్చే సహాయాన్ని రూ.1000 నుంచి రూ.10 వేలకు పెంచారు.

homegaurds 02072018 1

ప్రమాదవశాత్తు గాని, సహజ మరణం గాని సంభవిస్తే రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల రెండు రోజులు జీతం తో కూడిన సెలవు మంజురూ చెయ్యడం జరిగింది. రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డు లు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్ నియామకంలో హోంగార్డు లకు 8 శాతం కోటాను అమలుచేస్తున్నారు. మహిళా హోంగార్డు లకు మూడు నెలల ప్రసూతి సెలవులు. విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సహా ఏ హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ సహకరిస్తే మొదట హోంగార్డులనే ఆదుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి కమిషనర్ బి.ఉదయ లక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా 13 జిల్లాలోని 447-ప్రభుత్వ, 150-ఎయిడెడ్ జూనియర్ కళాశాలలకు చెందిన 2 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం పొందనున్నారు. ఇప్పటివరకూ 1 నుంచి 10వ తరగతి వరకే మధ్యాహ్న భోజనాన్ని సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యాన అమలు చేస్తున్నారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ వారికీ..దీన్ని విస్తరిస్తున్నారు.

inter 02072018 2

ఈ విద్యా సంవత్సర బడ్జెటును రూ.23 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. ఒక్క కృష్ణాజిల్లాలోనే 25 ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల నుంచి 15వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేయాలని, పేద, మధ్య తరగతి విద్యార్థులను ఆదుకోవాలనే లక్ష్యంతో..మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఇంటర్ ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. ఏపీలో మధ్యాహ్న భోజన పథకాన్ని 1982 నుంచి అమలు చేస్తున్నారు. 2003 నుంచి దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం(1-5 తరగతులు) ప్రారంభించారు. 2008లో 6 నుంచి 8 తరగతులకు, ఆ తర్వాత 9, 10 తరగతులకు దీన్ని విస్తరించారు. 2010-11 నుంచి ప్రత్యేక స్కూళ్ల విద్యారులకూ అమలు చేస్తున్నారు. 2012-13 నుంచి 220 పని దినాల్లోనూ విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు.

inter 02072018 3

విద్యార్థులు బడికి సక్రమంగా రావడం, హాజరుశాతం పెంపుదల, బాలబాలికలకు పౌష్టికాహారం అందించాలనేదీ.. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ప్రాథమిక, మాథ్యమిక విద్యార్థులకు సోమవారం-కోడిగుడ్డు, సాంబారు, మంగళవారం-కూరగాయలు, బుధవారం - పప్పు, కూరగాయలు, కోడి గుడ్డు, గురువారం-సాంబారు, శుక్రవారం-కూరగాయాలు, కోడిగుడ్డు, శనివారం-పప్పు, కూరగాయలతో భోజనాన్ని వడిస్తున్నారు. ఇదే మేనునూ కొంచెం మార్పులతో ఇంటర్ విద్యార్థులకూ అమలు చేస్తారని తెలుస్తోంది.

పసిబిడ్డ ఆంధ్ర రాష్ట్రం, పాకుతూ, లేచి నిలుచోవటానికి అపసోపాలు పడుతుంటే... అడుగడుగునా ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు, అధిపత్యం కోసం, అధికారం కోసం, చంద్రబాబుని నిలువరించేందుకు కేంద్రంలో పెద్దలు వంచన చేస్తుంటే... మీకు అడ్డం రాను, రాష్ట్రానికి చేయూత నివ్వండి మహాప్రభూ అంటూ ఒకరకంగా తలవొగ్గారు చంద్రబాబు... అయినా ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి...మిత్రధర్మాన్ని విస్మరించి..ద్రోహం చేసిందెవరో తెలియదా...?వంచన చేసిందెవరో తెలియదా ...? మోడీ మోసం పై ధర్మ పోరాటం చేస్తుంటే, ఇదే రోజు జగన్ పార్టీ, అనంతపురం లో వంచన దీక్ష అంటూ, చంద్రబాబుకు వ్యతిరేకంగా దీక్ష చెయ్యటం ఏంటి ?

vanchana 02072018

చంద్రబాబు కి వ్యతిరేకంగా, రాష్ట్ర సమస్యలపై దీక్షలు చేయండి... పెన్షన్ లు ఇవ్వకపోతే , నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, రైతు ఋణమాఫీ చేయకపోతే, డ్వాక్రా ఋణమాఫీ చేయకపోతే, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టకపోతే, అన్న కాంటీన్ లు పెట్టకపోతే, ఉద్యోగులకు నలభైమూడు శాతం ఫిట్ మెంట్ ఇవ్వకపోతే, రిటైర్ మెంట్ ఏభైఎనిమిది నుండి అరవై చేయకపోతే, పట్టిసీమ నీరు కృష్ణ లో అనుసంధానం చేయకపోయి ఉంటే, కృష్ణా డెల్టా ఎండిపోయుంటే, పులివెందులకు నీరు ఇవ్వకపోయుంటే, అనేక ఆటంకాలమధ్య పోలవరం ఏభైశాతం పనిపూర్తవక పోయి ఉంటే, పక్క రాష్ట్రం ధనిక రాష్ట్రం ఒక్క ఉద్యోగం అయినా ఇవ్వకపోయినా, రెండుసార్లు డియస్ సీ ప్రకటించకపోతే, ఆర్టీసీ ని లాభాల్లోకి తీసుకు రాకపోతే, రాష్ట్రంలో అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు వేయకపోతే, సంవత్సరం లోపల మన రాష్ట్రం, మన రాజధాని మనదగ్గర నుండే పాలన చేయకపోతే, హుద్ హుద్ లాంటి జలప్రళయం ని సమర్థవంతంగా ఎదుర్కోక పోతే, కియామోటార్స్, హీరో మోటార్స్, ఆపిల్ లాంటి కంపెనీలు రాకపోతే, అన్నిటికన్నా ముప్పై మూడువేల ఎకరాలు ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క రక్తం చుక్క కారకుండా కేవలం తన మీద నమ్మకంతో రైతులు ఇవ్వకపోతే, అప్పడు కదా చంద్రబాబు కి వ్యతిరేకంగా దీక్షలు చేయాల్సింది.

vanchana 02072018

మరేంటయ్యా ...కేంద్రం మోసం చేసింది...మోదీ కక్ష గట్టాడు, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది...ప్రజలంతా ఆగ్రహంతో కేంద్రం మీద యుద్దం చేస్తుంటే... మీరేంటయ్యా ప్రజల మీద యుద్దం ప్రకటించారు... మీ కేసుల గురించా ? ప్రజలందరికీ తెలుసు ...ఇక డ్రామాలు చాలించి ...ముసుగులు తీసి ప్రత్యక్ష యుద్దం చేయండి...బాబు కావాలో, మీరు కావాలో ప్రజలు తేల్చుకుంటారు.. రోజులుమారాయి...మీ డ్రామాలు...అసలు నయవంచన మీదే, అని ప్రజలుకు బాగా అర్దమయింది...సమయం కోసం చూస్తున్నారు... వంచకులు వంచన దీక్ష చెస్తారు... ధర్మం గా ఉండే వారు ధర్మ పొరాట దీక్ష చెస్తారు... వంచన దీక్ష, అని పేరు పెట్టమని చెప్పిన విజయసాయి రెడ్డికి మాత్రం, వందనాలు..

వైసిపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గుట్టు, రట్టు అయ్యే టైం వచ్చింది. బీజేపీతో జగన్ కలిసి పోయి ఆడుతున్న డ్రామాలకు ఇక తెర పడననుంది. అన్నీ ఇక బహిరంగంగానే జరగనున్నాయి. తెలుగుదేశం దూరం అవ్వటం, శివసేన అడ్డం తిరగటంతో, కేసిఆర్ జగన్ లను కలుపుకుని, మాకు బలం ఏ మాత్రం తగ్గలేదు అని బీజేపీ చూపించాలి అనుకుంటుంది. ఇందుకోసం, రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నికలను, బీజేపీ వాడుకుంటుంది. త్వరలో జరిగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఇటు టీఆర్ఎస్ కు, అటు వైసీపీల మద్దతు అమిత్ షా కోరారు. ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్‌ పీజే కురియన్‌ జూలై 2న పదవీ విరమణ చేస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రెండు రోజుల్లోనే డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికను పూర్తి చేసే అవకాశం ఉంది. రాజ్యసభలో మొత్తం సీట్లు 245. బిహార్‌ నుంచి ఖాళీ అయిన స్థానం ఇంకా భర్తీ కాలేదు. అంటే, రాజ్యసభ సంఖ్యా బలం 244. డిప్యూటీ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవడానికి 123 ఓట్లు అవసరం.

jagan rs 02072018

కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలకు 119 ఎంపీల మద్దతుండగా.. పీడీపీతో పొత్తు తెగిపోయిన తర్వాత బీజేపీకి, దాని మిత్రపక్షాలకు కలిపి 108 ఎంపీల బలం ఉంది. బీజేపీకి 76 మంది.. మిత్రపక్షాలు,, స్వతంత్రులు కలిస్తే 108 మంది సభ్యుల మద్దతు లభిస్తోంది. కాంగ్రె్‌సకు నామినేటెడ్‌తో కలిసి 52 మంది సభ్యులుండగా.. తృణమూల్‌, బీఎస్పీ, ఎస్పీ, వామపక్షాలు, స్వతంత్రులు, చిన్నాచితక పార్టీలతో కలిస్తే ప్రతిపక్షాల సంఖ్యా బలం 119 వరకూ పెరుగుతుంది. దాంతో, నాలుగు నామినేటెడ్‌ పదవుల భర్తీపై బీజేపీ దృష్టి సారించింది. ప్రముఖ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, సినీ తారలు మాధురీ దీక్షిత్‌, అనుపమ్‌ ఖేర్‌, రాజ్యాంగ నిపుణుడు సుభాష్‌ కశ్యప్‌, మరాఠీ రచయిత బాబా సాహెబ్‌ పురంధరే తదితరుల పేర్లను పరిశీలిస్తోంది.

jagan rs 02072018

ఈ నాలుగు ఖాళీలనూ భర్తీ చేసినా.. డిప్యూటీ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవడానికి ఎన్డీయేకు సంఖ్యా బలం సరిపోదు. ఫలితంగా.. దాదాపు 26 ఏళ్ల తర్వాత డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి నజ్మా హెప్తుల్లా ప్రతిపక్ష అభ్యర్థి రేణుకా చౌదరిపై 33 ఓట్ల ఆధిక్యంతో గెలిస్తే.. ఈసారి అధికార బీజేపీకి ప్రతిపక్షం ముచ్చెమటలు పోయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఎలాగూ జగన్ మద్ధతు అడుగుతుంది. ఆయన వారి కోరిక మేరకు కమలానికి జై కొడితే... ఆంధ్రాలో టీడీపీకి మరో బలమైన అస్త్రాన్ని ఇచ్చినట్టవుతుంది. ఇప్పటికే బీజేపీ - వైసీపీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందని... కొన్ని ఆధారాలను టీడీపీ బయటపెట్టింది. తాజాగా డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కమలానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరింత ఇబ్బందులు వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాదంటే మోడీ క‌న్నెర్ర‌ - అవునంటే ఏపీ ప్రజలకు ఆగ్ర‌హం అన్నట్టుగా వైసీపీ పరిస్థితి మారుతుంది.

Advertisements

Latest Articles

Most Read