ప్రధాని మోడీ, ఎట్టకేలక మన రాష్ట్రానికి వస్తున్నారు. అయితే బీజేపీ నేతలు చెప్తునట్టు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు కాదు, విభజన హామీలు నెరవేరుస్తాం అని చెప్పటానికి కాదు, లేకపోతే మరే ఇతర పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి కాదు.. ఆయన అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు వస్తున్నారు. కర్నూల్ లో అతి పెద్ద సోలార్ పార్క్ ప్రారంభోత్సవానికి రమ్మని, దాదాపు సంవత్సరం నుంచి ప్రభుత్వం అడిగినా రాని ప్రధాని, 5 కోట్ల మంది ఆంధ్రులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా రాని ప్రధాని, ఇప్పుడు వస్తున్నారు.. ఈ నెల 22న షార్ కు రానున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో సుమారు రూ. 650 కోట్లతో నిర్మించిన రెండవ రాకెట్ వాహన అనుసంధాన భవనాన్ని మోడీ ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు.

modi 0307201 2

ఆయన పర్యటన ఖరారు కావడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో భారత శాస్త్రవేత్తలు వివిధ విభాగ అధిపతులు అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్లో ప్రస్తుతం ప్రయోగాల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. అయితే అందుకు సరైన రాకెట్ వాహన అనుసంధాన భవనం లేకపోవడం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒక్క భవనం పై ఆధారపడే ప్రయోగాలు చేయాలంటే సాంకేతికంగా ఇబ్బందులు ఎదుర వుతున్నాయి.

modi 0307201 3

దీంతో 2015లో షార్ లో రెండవ అనుసంధాన భవనాన్ని నిర్మించాలని అప్పటి ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తరువాత ఇస్రో చైర్మన్ గా పని చేసిన ఏఎస్ కిరణ్ కుమార్ ఆ ప్రతిపాదన పై ప్రతేక శ్రద్ధ చూపడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు గత రెండు సంవత్సరాల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. అయితే షార్ లో రెండో అనుసంధాన భవనానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగానే ఆ భవనాన్ని జాతికి అంకితం చేయాలని ప్రస్తుత ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ పట్టుదలతో ఉన్నారు. ఇలా దేశానికి గర్వంగా ఉండే ప్రాజెక్ట్ ల గురించి రాకీయం చెయ్యకూడదు కాని, ఈ సందర్భంలో అయినా, కానీసం ఆంధ్రప్రదేశ్ గుర్తు ఉన్నందుకు, ప్రధానికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత, ఏదన్నా కనికరించి, ఆంధ్రులు చేస్తున్న ఆందోళనలు ప్రధాని అడ్రస్ చేస్తారేమో చూడాలి.

కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లి తిరిగి వస్తూ వాతావరణ ప్రతికూలత నేపథ్యంలో హిల్సా బేస్‌ క్యాంపు వద్ద చిక్కుకొని తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న తెలుగు యాత్రికుల యోగక్షేమాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ మేరకు అక్కడి పరిస్థితిపై ఏపీ భవన్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌తో మాట్లాడగా.. హిల్సాలో పరిస్థితి గురించి ఆయన సీఎంకు వివరించారు. హిల్సా బేస్‌ క్యాంప్‌ వద్ద 100 మంది తెలుగు యాత్రికులు ఉన్నట్టు వారు తెలిపారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా యాత్రికుల గురించి సీఎం ఆరా తీశారు.

cbn 002072018 2

ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులతో మాట్లాడని సీఎం అధికారులను ఆదేశించారు. యాత్రికులను హెలికాప్టర్‌లో హిల్సా నుంచి సిమిల్‌కోట్‌కు.. అనంతరం సిమిల్‌కోట్‌ నుంచి ప్రత్యేక విమానంలో నేపాల్‌గంజ్‌కు తరలించాలని సూచించారు. అలాగే, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులను కూడా సంప్రదించాలన్నారు. యాత్రికులకు అవసరమైన రవాణా, వైద్య సదుపాయాలను సమకూర్చాలని ఆదేశించారు. తెలుగు యాత్రికులంతా క్షేమంగా స్వస్థలాలకు చేరేలా వారికి తోడ్పాటునందించాలన్నారు.

cbn 002072018 3

మరోవైపు నేపాల్‌ రాయబార కార్యాలయ అధికారులతో ఇప్పటికే ఏపీ భవన్‌ అధికారులు సంప్రదింపులు జరపగా.. వారు స్పందించారు. యాత్రికులతో తమ ప్రతినిధులు సంప్రదింపుల్లో ఉన్నారని వెల్లడించారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, ఇతర వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సిమిల్‌కోట్‌లో తమ వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చే మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఇబ్బందులు వున్నాయని తెలిపారు. వాతావరణం అనుకూలించగానే విమానాలు నడుపుతామని సంస్థలు చెప్పాయని తెలిపారు.

కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాథోర్ ప్రారంభించిన ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దేశ వ్యాప్తంగా స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీలు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొని తాను కసరత్తు చేస్తున్న వీడియోని ట్వీట్ చేశాడు. దీంతో పాటు అతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఛాలెంజ్ చేశాడు. దీన్ని స్వీకరించిన ప్రధాని తాను యోగా చేస్తున్న వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. అయితే ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి సంచలన విషయం బయటకొచ్చింది. ప్రధాన మంత్రి చేసిన ఈ యోగా వీడియో కోసం ప్రభుత్వం ఏకంగా రూ.35 లక్షలు ఖర్చు చేసినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది.

fitness 02072018 2

అయితే ఈ ఖర్చు కేవలం ఈ వీడియో కోసం మాత్రమేకాదు.. అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం చేసిన కొన్ని యానిమేషన్ చిత్రాల కోసం కూడా వెచ్చించినట్లు తెలుస్తోంది. యోగా దినోత్సవం ప్రచారం కోసం నరేంద్ర మోదీ యోగా చేస్తున్నట్లుగా ఓ యానిమేషన్ వీడియోని చిత్రీకరించారు. అయితే దీనికి ముందుగా రూ.40 నుంచి 45 లక్షల వరకూ ఖర్చు జరుగుతుందని భావించినా.. తక్కువ ఖర్చు జరిగే చోట చిత్రీకరించి మొత్తాన్ని తగ్గించినట్లు సమాచారం. ఇది మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవం కోసం ఇచ్చిన యాడ్‌లకు ఆయుష్ మినిస్ట్రీ దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు ఈ పత్రిక ప్రచురించింది. ప్రస్తుతం ఈ కథనం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సోషల్‌మీడియాలో ఈ కథనం ప్రచారం కావడంతో ప్రధానిని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఆ కథనం అవాస్తవమని వాదిస్తున్నారు.

fitness 02072018 3

అయితే ఈ విమర్శల పట్ల సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ స్పందించారు. మోదీ ఫిట్‌నెస్ వీడియోను ప్రధాని కార్యాలయ వీడియోగ్రాఫర్ చిత్రీకరించారని తెలిపిన రాథోడ్.. డబ్బు ఖర్చు పెట్టారని వచ్చిన వార్తలు తప్పుడు కథనాలన్నారు. మోదీ ఫిట్‌నెస్ వీడియోల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మోదీకి ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసరగా.. దానికి స్వీకరించిన మోదీ.. త్వరలోనే ఫిట్‌నెస్ వీడియో షేర్ చేస్తానని తెలిపారు. అందుకు అనుగుణంగానే.. యోగా దినోత్సవానికి వారం రోజుల ముందు ప్రధాని మోదీ తన ఫిట్‌నెస్ వీడియోను ట్వీట్ చేశారు.

కేంద్ర రోడ్డు రవాణా, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎప్పుడు జనవరి నెలలో చెప్పారు. నేను ప్రతి నెలా వచ్చి పోలవరం చూస్తాను, కాంట్రాక్టర్ల చేత పనులు పరిగెత్తిస్తాను, కేంద్రం నుంచి డబ్బులు వెంటనే వచ్చే విధంగా చేస్తాను అని. అయితే, ఇప్పటికి ఏడు నెలలు అయ్యింది. అడ్రస్ లేరు. కేంద్రంతో తెలుగుదేశం కటీఫ్ తరువాత, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఈ తరుణంలోనే, ఈ నెల 11న గడ్కరీ, పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. సవరించిన అంచనాలు ఫైనల్ అవ్వాల్సిన దశలో, గడ్కరీ పోలవరం సందర్శన, మనకు మంచిది అనే అభిప్రాయం అధికారాల్ ఉంది. ఈ విషయం పై దేవినేని ఉమా మాట్లాడారు. ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణయించిన సమయంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

gadkari 02072018 2

పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 56 శాతం పూర్తయినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 66వ సారి వర్చువల్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి ఉమామహేశ్వరరావు సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నిర్మాణం సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హెడ్ వర్క్స్ 42.16 శాతం, డ్యామ్ ప్రధాన ప్యాకేజీ పనులు 40.65 శాతం, తవ్వకం పనులు 75.80 శాతం, కాంక్రీట్ పనులు 28.40 శాతం, రేడియల్ గేట్ల పనులు 61.30 శాతం, వంద శాతం డయాఫ్రామ వాల్ పనులు, జెట్ గ్రౌంటింగ్ పనులు 90.70 శాతం పూర్తి అయినట్లు వివరించారు.

gadkari 02072018 3

కుడి ప్రధాన కాలువ పనులు 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 61.67 శాతం, అనుసంధాన ప్యాకేజీ పనులు 58.32 శాతం పూర్తి అయినట్లు చెప్పారు. 1396.6 మీటర్ల డయాఫ్రం వాల్ కాంక్రీట్ పనులు పనులు రికార్డు టైమ్ లో పూర్తి చేసినట్లు తెలిపారు. దిగువ కాపర్ డ్యామ్ పనులు వచ్చే సోమవారానికి పూర్తి అవుతాయన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన తరువాత రూ.8662 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.6727 కోట్లు రీఇంబర్స్ చేసిందని, ఇంకా రూ.1935 కోట్లు రావలసి ఉందని అన్నారు. జూన్ చివరినాటికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించిన బిల్లులను పోలవరం డెవలప్ మెంట్ అథారిటీకి పంపినట్లు మంత్రి చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read