ఆదివారం విశాఖలో ఒక్కసారిగా ప్రజలకు ఉలిక్కి పడ్డారు. విశాఖలో పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు చెప్పారు. దీంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసారు. సుమారుగా 7.14 నిమిషాలకు భూమి కంపించింది. భూప్రకంపనలతో పాటుగా, భారీ శబ్దం కూడా వినిపించటంతో, భాయందోళనకు గురయ్యారు. అక్కయ్యపాలెం, మధురానగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, పెందుర్తి పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 3.6 గా నమోదు అయ్యిందని, అధికారులు చెప్తున్నారు. గాజువాక సమీపంలో ఇది కేంద్రీకృతం అయ్యిందని తెలుస్తుంది. గతంలో ఏడు రోజులు క్రితం కూడా విశాఖలో ప్రకంపనలు వచ్చాయని, కానీ సిటీకి వెలుపల రావటం వల్ల, అది రికార్డుల్లో రాలేదని చెప్తున్నారు. అయితే ప్రకంపనలతో పాటుగా, పెద్ద శబ్దం కూడా రావటంతో, ఒక్కసారిగా విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు. అధికారులు మాత్రం ఎలాంటి భయం లేదని చెప్తున్నా, వరుసగా వస్తున్న ఈ ప్రకంపనల పై అయితే, ప్రజల్లో ఆందోళన ఉంది.
news
కన్ఫెషన్ స్టేట్మెంట్ తో బాంబు పేల్చిన దస్తగిరి.. బడా పేర్లు బయటకు... మొత్తం 40 కోట్లు..
వైఎస్ వివేకనందరెడ్డి ఏపిలో ఒక సంచలనం. అత్యంత క్రురంగా చం-ప-బ-డ్డా-రు. 2019 ఎన్నికల సమయంలో జరిగిన ఈ దారుణం గురించి, అప్పట్లో సిబిఐకి ఇవ్వాలి అని గగ్గోలు పెట్టిన జగన్ గారు, తరువాత అధికారంలోకి వచ్చి సిబిఐ ఇవ్వద్దు అని పిటీషన్ విత్ డ్రా చేసుకున్నారు. చివరకు హైకోర్టు సిబిఐకి అప్ప చెప్పింది. మధ్యలో సిబిఐ విచారణ పైన, వైఎస్ వివేక కుమార్తె సునీత, నాకు న్యాయం జరగటం లేదని చెప్పిన విషయం కూడా చూసాం. అయితే ఇప్పుడు వైఎస్ వివేక డ్రైవర్ దస్తగిరి బాంబు పేల్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో బడా బడా నేతలు బయట పడ్డాయి. అసలు మ-ర్డ-ర్ ఎందుకు చేసారు ? ఎంత ఖర్చు చేసారు ? ఎవరు ఉన్నారు ? ఎవరెవరు పాల్గున్నారు మొత్తం దస్తగిరి చెప్పేసాడు. ఆగస్ట్ 30న దస్తగిరి, కోర్టులో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ని, కోర్టు ఈ రోజు మిగతా నిందితుల న్యాయవాదులకు ఇచ్చింది. దీంతో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పుడు మీడియాకు వచ్చింది. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు బయట పడ్డాయి. వివేక హ-త్య జరిగిన తీరుని పూస గుచ్చినట్టు వివరించారు దస్తగిరి. సీఆర్పీసీ 164(1) సెక్షన్ కింద, దస్తగిరి ప్రొద్దుటూరు కోర్టులో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు దస్తగిరి.

వివేకను చం-పి-న వారిలో మొత్తం నలుగురు పాల్గున్నట్టు చెప్పారు దస్తగిరి. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకని చం-పి-న-ట్టు దస్తగిరి చెప్పారు. వివేక మ-ర్డ-ర్ ప్లాన్ మొత్తం, ఎర్ర గంగిరెడ్డి చేసారని చెప్పారు. బెంగుళూరులో జరిగిన ఒక ల్యాండ్ వివాదం వ్యవహారంలో తనకు వాటా ఇవ్వక పోవటంతో, వివేక పై ఎర్ర గంగిరెడ్డి ఆగ్రహం పెంచుకుని, కక్షతో రగిలిపోయే వాడని అన్నారు. ఇక 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, తనను మోసం చేసారు అంటూ వైఎస్ వివేక, గంగిరెడ్డి, అవినాష్ రెడ్డిలకు వార్నింగ్ ఇస్తూ, వారి అంతు చూస్తానని చెప్పారని దస్తగిరి చెప్పారు. అవినాష్ ఇంటి దగ్గర ఇదే విషయం పై వివేక గొడవ కూడా పడ్డారని చెప్పారు. ఇక వివేక మ-ర్డ-ర్ కోసం రూ.40 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. దస్తగిరికి అయుదు కోట్లు ఇస్తాం అని చెప్పి, కోటి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు దస్తగిరి చెప్పారు. ఇప్పుడు మొత్తం పెద్ద తలకయాల పేర్లు బయటకు రావటంతో, ఏమి జరగబోతుంది, సిబిఐ ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి.
అర్ధరాత్రి ఎందుకీ హడావిడి ? జగన్ పర్యటన పై విమర్శలు..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. అమిత్ షా మూడు రోజుల పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యకత వహిస్తారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా, పలు రాష్ట్రాల సియంలు తిరుపతి వచ్చి హాజరు కానున్నారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాల సియంలు హాజరు అయ్యి, 48 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రాల మధ్య సహకారంతో పాటుగా, రాష్ట్రాల మధ్య ఉండే విబేధాలు కూడా చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గునటానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపి రానున్నారు. ఇందులో భాగంగా ఆయన మూడు రోజుల పటు ఏపిలో ఉంటారు. ఈ రోజు సాయంత్రం అమిత్ షా రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఎయిర్ పోర్ట్ లో, అమిత్ షా కు స్వాగతం పలకనున్నారు. అక్కడ నుంచి రాత్రి రాత్రి 7.40 గంటలకు అమిత్ షా తిరుపతి చేరుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శనం ఎల్లుండి ఉండే అవకాసం ఉంది. రేపు నెల్లూరు జిల్లా పర్యటనకు అమిత్ షా వెళ్తారు. వెంకటాచలంలో ఆయన పర్యటిస్తారు. స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో అమిత్ షా పాల్గుంటారు.

ఇప్పటికే ఉప రాష్ట్రపతి వెంకయ్య కూడా వచ్చారు. ముప్పవరపు ఫౌండేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గుంటారు. రేపు సాయంత్రం దక్షిణాది జోనల్ కౌన్సిల్ భేటీ ఉంది. సోమవారం శ్రీవారి దర్శనం చేసుకుని, ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఆతిధ్య రాష్ట్రం కావటంతో జగన్ మోహన్ రెడ్డి, అమిత్ షా కు ఈ రోజు స్వాగతం పలుకుతారు. స్వాగతం అనంతరం జగన్ ఒక్కరే శ్రీవారి దర్శనం చేసుకుంటారనే, ఈ రోజు రాత్రి 11.30 గంటలకు బయలు దేరి, అర్ధరాత్రి ఒంటి గంటకు గన్నవరం రానున్నారు. మళ్ళీ రేపు మధ్యానం ఒంటి గంటకు తిరుపతి వెళ్లనున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి అర్ధరాత్రి ఒంటి గంటకు ఆదరాబాదరాగా వచ్చి, మళ్ళీ రేపు మధ్యనమే తిరుపతి వెళ్ళటం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పది గంటల టైం ఉంటుంది, ఇలా తిరుపతికి రెండు సార్లు, వెళ్ళటం రావటం ఎందుకని, అనవసరమైన ప్రజా ధనం వృధా తప్ప, ఏమి ఉపయోగం అని ప్రశ్నిస్తున్నారు. ఎలాగూ పడుకునే టైం కదా, ఎందుకు అంత అర్జెంట్ గా, అర్ధరాత్రి ఒంటి గంటకు రావటం మళ్ళీ పది గంటల్లోనే తిరిగి తిరుపతి ప్రయాణం అని ప్రశ్నిస్తున్నారు.
పడేలా చేద్దాం
కుప్పం పోలింగ్ కి కళ్ళు తిరిగే ప్లాన్ వేసిన వైసీపీ..! కుట్రను భగ్నం చేయటానికి టిడిపి రెడీ..!
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, ఏమైతే అరాచకాలు జరిగాయో, దాన్ని ఇంకొంతగా మెరుగులు దిద్ది, కుప్పంలో అమలు పరచటానికి, అన్ని వ్యూహాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది అంటూ మీడియాలో కధనాలు వస్తున్నాయి. ముఖ్యంగా మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, గతంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసారు. అయితే ఇప్పుడు అలా కాకుండా, ఫోర్ వీలర్స్ వాడాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మెన్లు, ఇలా రకరకాల హోదాలతో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు చెందిన నామినేటడ్ పోస్టుల్లో ఉండే వారి కార్లలో, కుప్పంలో దొంగ ఓట్ల కోసం తరలించబోతున్నట్టు సమాచారం ఉంది అంటూ మీడియాలో కధనాలు వస్తున్నాయి. దీంతో పాటుగా, ప్రతి వార్డులోను 150 దొంగ ఓట్లు వేయటానికి, పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు కధనాలు వస్తున్నాయి. ఈ ప్రతి వార్డులో 150 దొంగ ఓట్ల కోసం ముందు నుంచే కసరత్తు చేసారు. కొత్తగా ప్రతి వాడులో 150 దొంగ ఓట్లు నమోదు అయినట్టు తెలుస్తుంది. వీరిని ఎలా ఓటు వేయించాలి అనే దాని పై పక్కాగా స్కెచ్ వేసారు. ఒకటి అక్కడ కుప్పంలో ఉండే ఖాళీ ఇళ్ళను ఇప్పటికే అద్దెకు తీసుకున్నారు. కేవలం 5 రోజుల కోసం రూ.20 వేల వరకు అద్దెలు చెల్లించి, ఈ దొంగ ఓట్ల కోసం బయట నుంచి వచ్చిన జనాలను ఇక్కడ దింపినట్టు తెలుస్తుంది.

ఎక్కడ ఖాళీ ఇళ్లు ఉన్నా, ఈ దొంగ ఓటర్లను ఇక్కడ డంప్ చేసారు. వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలను ఇక్కడ ప్రచారం చేసుకోనివ్వని పోలీసులు, ఇక్కడ మాత్రం ఇలాంటి వారిని పట్టించుకోవటం లేదు. ఇక రెండో వ్యూహంగా కుప్పంలో ఉన్న వైసిపీ వారే, రెండు మూడు ఓట్లు వేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఉదయమే వచ్చి దొంగ ఓట్లు, తరువాత వచ్చి తమ సొంత ఓటు వేసే విధంగా కూడా ప్లాన్ చేసినట్టు ఆ కధనం చెప్తుంది. మొత్తం మూడు అంచెల్లో ఈ దొంగ ఓట్లు వేయటానికి ప్లాన్ చేసారు. ఎలాగైనా 3 నుంచి 5 వేల వరకు దొంగ ఓట్లు వెయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే టిడిపి క్యాడర్ చాలా పటిష్టంగా ఈ వ్యవహారాలు అన్నీ గమనిస్తున్నారు. టిడిపి క్యాడర్ కు దొరక్కుండా చూడాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. మరో పక్క టిడిపి నేతలు, ఈ వ్యూహాన్ని భగ్నం చేయటానికి టిడిపి కూడా సన్నద్ధం అయ్యింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అనుభవంతో, టిడిపి కూడా కౌంటర్ ప్లాన్ రెడీ చేసింది. అయితే పోలీసులు, అధికారులు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.