టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ నిర్ణయాల వల్ల విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని, మరో సంచలన విషయం బయట పెట్టారు. అన్ని రాష్ట్రాలు తిరస్కరించిన సెకీ టెండర్లను ఏపీ మాత్రమే ఖరారు చేసిందని, ఇందులో మతలబు ఏంటో జగన్ చెప్పాలని పయ్యావుల అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జరగలేదని కమిటీలు తేల్చాయని, జగన్ మాత్రం ఏదో అవినీతి జరిగిందని ప్రచారం చేశారని పయ్యావుల అన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల పై ఎన్నో విచారణలు వేసి ఏమీ తేల్చలేకపోయారని పయ్యావుల గుర్తు చేసారు. ఇక పోతే ప్రైవేటు సంస్థల్లో తయారయ్యే విద్యుత్ ను ఏపీలో అందుబాటులో ఉన్న విండ్ ఎనర్జీని నిలిపివేసి ప్రైవేట్ సంస్థల దగ్గర అధిక రేటుకు విద్యుత్ కొన్నారని, పయ్యావుల సంచలన ఆరోపణలు చేసారు. జగన్ తప్పుడు నిర్ణయంతో ప్రజలు అధిక బిల్లులు చెల్లించాల్సి వచ్చిందని, దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు.

payyavula 13122022 2

జగన్ సన్నిహితులకు పంప్డ్ స్టోరేజ్ విధానంలో ఆస్తులు కట్టబెట్టారని, కేంద్రం ఆదేశాలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా పంప్డ్ స్టోరేజ్ ఒప్పందాలు, కేటాయింపులున్నాయిని పయ్యావుల చేసిన ప్రకటనతో, ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కి పడింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడతారా? అని పయ్యావుల ప్రశ్నించారు. ప్రజా ఆస్తులు ఏకపక్షంగా మీవాళ్లకు కట్టబెడతారా? అని నిలదీశారు. టెండర్లు పిలవకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో కట్టబెడతారా?, డబ్బులేమో ప్రజలు చెల్లించాలి.. ఆదాయం మీకు కావాల్సిన వ్యక్తులకా? అంటూ పయ్యావుల విరుచుకు పడ్డారు. విద్యుత్ రంగంలో మేము లేవనెత్తిన ఒక్క అంశంపైనైనా స్పందించారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు జగన్ చెబుతున్నది వాస్తవమైతే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నిలదీశారు. మరి దీని పై జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

కేంద్రాన్ని అడిగి మరీ తాము చేతకానివాళ్లం అని అనిపించుకున్నారు వైసీపీ నేతలు. పోలవరాన్ని 2020 అని ఒకసారి, 2021లో మరోసారి, 2022లో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ మంత్రులు కేంద్రం సమాధానంతో ఇబ్బందికర పరిస్థితిలో పడ్డారు. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతుందా అని..రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. దీనిపై కేంద్రం  అవునంటూ సమాధానం ఇవ్వడంతో వైసీపీ ఎంపీలు ఖంగుతిన్నారు.  టిడిపి హయాంలో 72 శాతం పనులు పూర్తి అయిన పోలవరం వైసీపీ సర్కారు రాకతో నిలిచిపోయాయి. రివర్స్ టెండరింగ్తో ఏడాది, వరదలతో మరో ఏడాది ఆలస్యమైన పనులు కనీసం 3 శాతం కూడా కాలేదు. దీంతో 2024కి కూడా ప్రాజెక్టు పూర్తికావడం అసాధ్యమని కేంద్రం తేల్చి చెప్పేసింది.

రుషికొండపై విధ్వంసం చూశాక కన్నీళ్లు వస్తున్నాయని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రీయ జల బిరాదరీ చైర్మన్ రాజేంద్ర సింగ్ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణతో కలిసి రుషికొండని పరిశీలించారు. సముద్రం ఒడ్డున రక్షణగా వున్న రుషికొండని జగన్ రెడ్డి సర్కారు ధ్వంసం చేయడం క్షమించరాని నేరం అన్నారు. న్యాయస్థానం పరిధిలో ఈ అంశం ఉందని, న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తునన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నదులు కూడా పూర్తిగా కలుషితం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎట్టకేలకు సుప్రీం కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హ-త్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అనంతబాబు డీఫాల్ట్ బెయిల్ పిటీషన్ పై, ఈ రోజు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. వదనలు విన్న అనంతరం సుప్రీం కోర్ట్ బెయిల్ ఇచ్చింది. ఈ ఏడాది మే 23న పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేసారు. అప్పటి నుంచి అతను రాజమండ్రి జైలులో ఉన్నారు. కింద కోర్ట్ బెయిల్ ని నాలుగు సార్లు తిరస్కరించింది. ఆ తరువాత హైకోర్టు కూడా తిరస్కరించింది. దీని పైన ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఎట్టకేలకు సుప్రీంలో బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో మొదట అనంతబాబు పై కేసు పెట్టలేదు. ఆందోళనలు తరువాతే కేసు పెట్టారు. అయితే పోలీసులు కూడా ఈ కేసులో సరిగ్గా చార్జ్ షీట్ వేయలేదు అనే విమర్శలు వచ్చాయి. దాదపుగా ఆరు నెలలు అనంతబాబు జైల్లో ఉన్నారు. అయితే ఈ తీర్పు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చార్జిషీట్ పదే పదే ఉపసంహరించుకోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఏపి ప్రభుత్వం ఖంగుతింది. అనంతబాబుని రక్షిస్తున్నారు అంటూ, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, సుప్రీం వ్యాఖ్యలతో నిజం అయ్యాయి...

Advertisements

Latest Articles

Most Read