ఒక పక్క మాకు జగన్ తో పొత్తు అనేది ఉండదు అని బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్తుంటే, "కాకినాడ బీజేపి" మాత్రం హోల్ సేల్ గా, పొత్తులో భాగంగా తనకు కేటాయించిన సీట్లు వైసీపీకి అమ్మేసింది అని కాకినాడలో ప్రచారం జరుగుతుంది.
పొత్తులో భాగంగా మిత్రపక్షం కోరినట్లు ఎనిమిది కార్పొరేషన్ సీట్స్ బిజెపికి కేటాయించింది టీడీపీ. కాని పాపం బిజెపికి కాండిడేట్ లు లేరో, ఏమో కాని, చాలా వారకు ఆ ఎనిమిది సీట్లలో వైసీపీకి చెందినవారే అనే ప్రచారం జరుగుతుంది. బీజేపి నాయకుడు విష్ణు కుమార్ రాజు అయితే, తెలుగుదేశం సీట్ల కేటాయింపులో అన్యాయం చేసింది అని, రెబెల్స్ నిలబెట్టింది అని హడావిడి చేశారు. తెలుగుదేశం వాదన వేరేలా ఉంది.
దానికి ఊతం ఇస్తూ ఇప్పుడు మరో భయంకర నిజం బయటపడింది. "కాకినాడ బీజేపి" ఎంతకు దిగజారిందో ఈ విషయం తెలిస్తే సిగ్గేస్తుంది. కాకినాడ 29 వ వార్డ్ లో టీడీపీ-బీజేపి ఉమ్మడి అభ్యర్థి అయిన చిట్నీడి శ్రీనివాస్ అనే అభ్యర్ధి, ప్రధాని నరేంద్ర మోడీని తిడుతూ ఎన్నో పోస్ట్లు తన ఫేస్బుక్ ఎకౌంటు లో పోస్ట్ చేశారు. సాక్షాత్తు ప్రధాని మోడీని తిడుతున్న వ్యక్తికి బీజేపి ఎలా సీట్ ఇస్తుందో వారికే తెలియాలి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ గురించి అయితే, ఏకంగా బూతులు తిడుతూ ఉన్న పోస్ట్లు షేర్ చేశాడు, ఈ మహానుభావుడు.
సీట్ ఇవ్వటానికి బిజెపి కి బుద్ది లెదా, ఒప్పుకొవటానికి కాకినాడ టిడిపి నాయకులకి బుద్ది లెదా అని కాకినాడ ప్రజలు అనుకుంటున్నారు.. రెబెల్ కాండిడేట్ కో, ఇండిపెండెంట్ కో ఓటు వేసి, ఇలాంటి వాడికి బుద్ది చెప్పాలి అని పిలుపుస్తున్నారు.

