ఈ రోజు హైకోర్టు సంచలన ఆదేశాలు జరీ చేసింది. టీటీడీలోని ముగ్గురు తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి, పిటీషన్ దాఖలు అయ్యింది. ఆ పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మసనం, టిటిడి ఈవో ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, అదే విధంగా రూ.2 వేలు జరిమానా విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా కేసు విషయం చూసుకున్నట్టు అయితే, టీటీడీ పరధిలో ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తూ, వాళ్ళు క్రమబద్దీకరణ కోసం గతంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషన్ పైన సుదీర్ఘమైన విచారణ జరిపిన ధర్మాసనం, ముగ్గురినీ కూడా క్రమబద్దీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉద్యోగులు చాలా కాలంగా సర్వీస్ లో ఉండటంతో, వాళ్ళకు పెర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులని దేవాదాయ ఈవో పట్టించుకోక పోవటంతో, వాళ్ళు కోర్టు దిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. ఈ రోజు దీని పై విచారణ జరిగింది. రెండు తరుపున వాదనలు వినిపించారు.

హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినా కూడా, కావాలనే ఆదేశాలు అమలు చేయలేదని, కోర్టు ముందు పిటీషన్ తరుపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీని పైన అటు టిటిడి వాదనలు, పిటీషనర్ తరుపున వాదనలు విన్న న్యాయస్థానం, ఉద్దేశపూర్వకంగానే ఆదేశాలు అమలు చేయలేదని భావిస్తూ, టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధించింది హైకోర్టు. అయితే దీని పై టిటిడి ఈవో తమ శిక్షను తీసి వేయాలని, హైకోర్టు ముందు అపీల్ చేసుకునే అవకాసం ఉంది. అపీల్ చేసుకుంటే హైకోర్టు ఏమి చెప్తుందో చూడాలి. దీని పై అపీల్ కు వెళ్తారా , లేక డివిజనల్ బెంచు కు అపీల్ కు వెళ్తారా అనేది చూడాల్సి ఉండి. గతంలో కూడా ఇలాగే అధికారులకు జైలు శిక్ష విధించినా,వారు క్షమాపణ చెప్పి అపీల్ చేయటంతో, గతంలో హైకోర్టు ఆ శిక్షను వెనక్కు తీసుకుంది. మరి ఈ సారి ఏమి అవుతుందో చూడాలి. అయితే ఇలా కోర్టు దిక్కరణ చేయటం అనేది, ఈ ప్రభుత్వంలో అతి సాధారణం అయిపొయింది

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎలక్షన్స్ అయ్యేవరకు  మంత్రులు ఎవ్వరూ అవినీతికి పాల్పడొద్దని, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి,టివి 5,ఇంకా కొన్ని  ఛానళ్ల కళ్లన్నీ మీమీదే ఉంటాయి కాబట్టి మీరు ఎవ్వరూ అవినీతికి పాల్పడొద్దని  సీఎం జగన్, మంత్రులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మీరు ఏ చిన్న తప్పు చేసినా దానిపైనే,  మీడియా ఎక్కువగా ఫోకస్ చేసి, వరుస పెట్టి టివీల్లో ఊకదంపుడు దంచుతారని జగన్ మంత్రులకు తేల్చి చెప్పారు. ఇటువంటి వార్తలు మీడియాల్లో వస్తే  దాని  ప్రభావం ఎలక్షన్‍పై తీవ్రంగా  ఉంటుందని జగన్ మంత్రులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.  మంత్రులందరూ  ఇకపై సొంత ప్రయోజనాలు ఆశించకుండా, సంక్షేమ పథకాలపైనే  దృష్టి పెట్టాలని జగన్ దిశ నిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు వాలంటీర్ల చేతుల మీదుగా నడుస్తున్న పథకాలు, ఇక నుంచి  మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేయాలని, అంతే కాకుండా గడపగడపకు ప్రతీ ఒక్కరూ వెళ్ళాలని , వెళ్లేలా ప్రతి ఒక్కరూ చూడాలని మంత్రులకు, జగన్  గట్టిగా వార్నింగ్ ఇచ్చారట

బీజేపీతో జనసేన బంధం తెగిపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ తెలంగాణాలో 32 నియోజకవర్గాలకు జనసేన ఇన్చార్జులను పార్టీ అధిష్టానం ప్రకటించడమే. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేనని పోటీ చేయనివ్వకుండా బీజేపీ అడ్డుపడింది. బీజేపీ రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూసిన జనసేనాని వైసీపీ అరాచక పాలనపై తానే రోడ్డు ఎక్కేశారు. తాజాగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మేము ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చం అని స్పష్టం చేశారు. బీజేపీ తాము టార్గెట్ చేసే వివిధ పార్టీల నేతలను ఐటీ,ఈడీ దాడులు చేయిస్తూ లొంగదీసుకుంటోంది. బీజేపీతో జనసేన దూరం కావడంతో పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటి దాడులు జరిగాయనే ప్రచారం సాగుతోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ జనసేన పొత్తు చిత్తయినట్టే.

ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశంలో కేంద్రమంత్రి నిరంజన్‌ జ్యోతి ఏపి ప్రభుత్వ పనితీరుని ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ నిర్మించింది కేవలం 5 వేల ఇళ్లు మాత్రమేనని కేంద్రం మంత్రి స్పష్టం చేసారు. 2019 నుంచి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీఎంఏవై పథకం కింద ఏపీలో 5 ఇళ్లు మాత్రమే నిర్మించారని కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ కి 2016 నుంచి 1,82,632 ఇళ్లను కేటాయించామని కేంద్రం చెప్పింది. అంతకు ముందు 2016 టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో 46,726 ఇళ్ల నిర్మాణం జరిగిందని కేంద్రం తేల్చి చెప్పేసింది. కాని గత మూడేళ్లలో వైసిపి ప్రభుత్వం కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించారని, మిగతా 46,721 ఇళ్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినవేనన్న కేంద్రమంత్రి నిరంజన్‌జ్యోతి లోకసభ సాక్షిగా తేల్చి చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read