రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ రెడ్డి పాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ ప్రభుత్వం సమైక్య రాష్ట్రం అంటూ ప్రజలను మభ్యపెట్టడం మోసగించడమేనన్నారు. టిడిపి హయాంలో వ్యవసాయ రంగంలో రికార్డులు సాధించామని, వైసీపీ రైతు వ్యతిరేక విధానాల వల్లే అన్నదాతల ఆత్మహ-త్యల్లో దేశంలోనే రాష్ట్రం మొదటిస్థానంలో వుందన్నారు. ప్రజలు సమస్యల్లో వుంటే పరిష్కరించడం మానేసి సమైక్యాంధ్ర అంటూ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే వైసీపీకే చెల్లుతుందన్నారు. చేసిన తప్పులను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాలని, సత్వరం స్పందించి అన్నదాతలకు అండగా నిలవాలి చంద్రబాబు డిమాండ్ చేశారు.
news
పార్లమెంట్ చెప్పిన దాన్నే ఫేక్ చేసి పడేసిన సాక్షి.. అవాక్కయిన ఏపి ప్రజలు...
నేరాలు, ఘోరాలలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ మరో ఆందోళనకర అంశంలో మొదటి స్థానంలోకి వచ్చింది. అభివ్రుద్ధిలో అథమస్థానంలో కొనసాగుతూ అన్నదాతల ఆత్మహ-త్యల్లో అగ్రస్థానంలోకి ఎగబాకింది. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రైతుల బలవన్మరణాలు రెండింతలు పెరిగాయని పార్లమెంటు సాక్షిగా గణాంకాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా రైతులు ఆత్మహ-త్య చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో వుండటం ఆందోళన కలిగిస్తోంది. టిడిపి పాలనలో 2017లో 375 మంది, 2018లో 365 మంది రైతుల ఆత్మహ-త్యలు చేసుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతుల ఆత్మహ-త్యలకు పాల్పడ్డారు. ఇది ఇలా ఉంటే, జగన్ గారి సాక్షి మాత్రం, చంద్రబాబు హయాంలోనే మా పాలన కంటే ఎక్కువ ఆత్మహ-త్యలు అంటూ, పార్లమెంట్ లో చెప్పిన దాన్నే ఫేక్ చేసి పడేసారు.
పోలవరం పై మరో బాంబు పేల్చిన కేంద్రం... జగన్ చేస్తుంది ఇదా ?
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి మరింత దూరం కానుంది. పోలవరాన్ని సోమవారంగా మార్చి 70 శాతం పనులు పూర్తి చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోగానే పోలవరానికి ఆటంకాలు మొదలయ్యాయి. వైసీపీ సర్కారు తెచ్చిపెట్టిన వివాదాలు, రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టుకి గ్రహణం పట్టింది. వైసీపీ ఇరిగేషన్ మంత్రులు మాత్రం 2020,2021,2022లో పోలవరం పూర్తి చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అయితే పోలవరం ఇప్పట్లో పూర్తి కావడం అసాధ్యం అంటూ కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. లోక్‌సభలో ఏపీకి చెందిన ఎంపీలు కేశినేని నాని, లావు కృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్‌లు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు, కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి భిశ్వేశ్వర్ జవాబు ఇస్తూ..పోలవరం నిర్మాణం 2024 లోపు పూర్తి కాదని తేల్చేశారు. 2024కి పోలవరం పూర్తి చేయాలనుకున్నామని.. అయితే వరసగా వచ్చిన భారీ వరదలలో పనులు ముందుకు సాగలేదని ఆ సమాధానంలో కేంద్రమంత్రి స్పష్టం చేశారు.