దుర్గమ్మ ఆశీస్సులు.. కృష్ణమ్మ పరవళ్లతో..అద్భుతమైన అమరావతిని నిర్మించుకుంటున్న మనం, అమరావతిలో వేసిన తొలి అడుగు, వెలగపూడిలోని సచివాలయం.. ఈ సచివాలయం, ప్రతి ఆంధ్రుడి దేవాలయం.... అమరావతి ఆంధ్రుల రాజధాని అని ప్రకటించిన దగ్గర నుంచి, మొదలైన పాజిటివ్ వైబ్రేషన్స్, 5 కోట్ల మంది ఆంధ్రులని ముందుకు నడిపిస్తుంది… “అమరావతి”, అంటే మరణం లేనిది…క్షీణించడం, జీర్ణించడం, బాధపడటం అనేవి మచ్చుక కూడా కనిపించని ప్రాంతంగా అమరావతి విలసిల్లుతుంది. బాల్యం, కౌమారం, యవ్వనం మాత్రమే అమరత్వంలో ఉంటుంది, మరణించడం అనేదే ఉండదు... అందువల్ల ఎల్లప్పుడూ అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంటుంది.
శాతవాహనుల రాజధానిగా ఘనచరిత్ర వహించిన ఈ ప్రాంతానికి, మళ్లీ పూర్వ వైభవం తీసుకురావటానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి... రాష్ట్ర విభజన కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక లోటు.. మౌలిక సదుపాయల లేమి.. పారిశ్రామికంగా వృద్ధి చెందని కారణంగా ఉపాధి అవకాశాల కోసం యువత నిరీక్షించాల్సిన దుస్థితి.... ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రం నలు దిక్కులా సత్వర.. సమగ్రాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి. అలాంటి సమయంలో వెలగపూడి సచివాలయం నుంచి పాలన మొదలు పెట్టిన వేళా విశేషం, ఆ ప్రాంత మహత్యం, మానవ సంకల్పం అన్నీ కలిసి వచ్చాయి... రాష్ట్రంలో పనులు అన్నీ చక చకా జరిగి పోతున్నాయి...
192 రోజుల్లో సచివాలయం నిర్మాణం, ఇది చంద్రబాబు మాత్రమే చెయ్యగల మ్యాజిక్:
మ్యాజిక్ అంటే, పేపర్ మీద పనులు చూపించి డబ్బులు కొట్టేయడం కాదు.. సాద్యం కాదు అనుకున్నది, చేసి చూపించటం... సామాన్య మానవులు ఆలోచనలో కూడా అచ్చీవ్ చెయ్యలిని టార్గెట్స్, చేసి చూపించి కళ్ళ ముందు వాస్తవ రూపంలో చూపించటం... అన్ని విధాలా అడ్డు పడే రాక్షాసులని ఎదుర్కుని, పవిత్ర యజ్ఞం పూర్తి చెయ్యటం... మేము చెప్పే మ్యాజిక్ ఇది..
నిన్నటి వరకు పచ్చిక బయళ్లు... నేడు అద్భుత కట్టడాల సముదాయం... గత ఏడాది వెలగపూడిని చూసిన వారు, ఇపుడు అక్కడకు వెళ్ళినవారు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. నవ్యాంధ్ర రాజధానిలో శాసన సభ మండలి భవనాల సముదాయ నిర్మాణం కేవలం 192 రోజుల్లోనే పూర్తయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, నిబద్ధత, అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసేంతవరకూ విశ్రమించని విధానాల్ని పుణికిపుచుకున్న CRDA టీమ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పరిపాలనను సాధ్యమైనంత త్వరగా రాష్ట్రం నుంచే సాగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ధృఢ సంకల్పానికి అధికార యంత్రాంగం నిర్విరామ కృషి ఫలితమే సచివాలయంతో పాటు అసెంబ్లీ, శాసన మండలి భవన నిర్మాణం పూర్తయి ఇక్కడ నుంచే ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు శాసనాలకు వేదిక చేసుకున్నాం...
ఇంతటితో అయిపోలేదు, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే... పిక్చర్ అభీ బాకీ హై !

