విశాఖపట్నంలో, ఏనాడో స్థిరపడిన నలందా కిషోర్ గారి మృతి ఎంతగానో కలిచి వేచిందని అన్నారు. ఆయనతో నాకు ఎప్పటి నుంచి సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చారు. ఎవరో, అమెరికా నుంచి ఒక పోస్టింగ్ పెడితే, ఆ పోస్ట్ లో,ఎవరి పేరు లేకపోయినా, తమ మీదే అని భావించి, ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే, ఆ పోస్ట్ అందరూ చదివారు. నేను చదివాను, ఎవరి పేర్లు అందులో లేవు, మరి ఎందుకు బుజాలు తడుముకుని, సిఐడి పోలీసులు చేత ఎందుకు అరెస్ట్ చేపించారో తెలియదని అన్నారు. అయితే ఆయన వయసు 66 ఏళ్ళు, ఆరోగ్యం బాగోలేదు అని చెప్తున్నా సరే, విశాఖపట్నం నుంచి కర్నూల్ వరకు తీసుకు వచ్చారని అన్నారు. కర్నూల్ కోవిడ్ హబ్ అని తెలిసినా, కావాలనే అక్కడకు తీసుకు వెళ్ళారని అన్నారు. నాకు ఉన్న సమాచారం ప్రకారం, కరోనా పేషెంట్లు ఉన్న చోట, నలందా కిషోర్ ని చాలా సేపు కూర్చోబెట్టి, కరోనా టెస్టులు పేరుతో, తాత్సారం చేసారని చెప్పారు.

ఆయనకు అక్కడే కరోనా వచ్చినట్టుగా ఉందని చెప్తూ, ఆయనకు రెండు మూడు రోజులుగా నలతగా ఉండి, ఈ రోజు మరణించారని అన్నారు. అయన కరోనాతో మరణించారని, అక్కడ ఉన్న కామన్ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు, మరి రిపోర్ట్స్ లో ఎలా ఇస్తారో చూడాలని అన్నారు. అయితే నేను మొహమాటం లేకుండా చెప్పాలని అనుకుంటున్నా అంటూ, రఘురామ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది ముమ్మాటకీ పోలీస్ హత్యేనని అన్నారు. రాష్ట్రంలో రైట్ టు ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ అనేది లేదని అన్నారు. చివరకు జీవించే హక్కు కూడా లేదని అనిపిస్తుందని అన్నారు. మాట్లాడే హక్కుని హరించినట్టు, జీవించే హక్కుని కూడా హరించారా అనే అనుమానం వస్తుందని అన్నారు. కరోనా పేషెంట్లు దగ్గర పెట్టారు అంటేనే, ఆ అనుమానం వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న పోలీస్ వారి పై ఆక్షన్ తీసుకోవాలని అన్నారు. రంగనాయకమ్మ గారిని కర్నూల్ తీసుకుని వెళ్ళలేదు కాబట్టి, ఆమె బ్రతికిపోయిందని అన్నారు.

పది రోజుల క్రితం , మంత్రి బాలినేని స్టిక్కర్ ఉన్న వాహనంలో, వైసీపీకి చెందిన ఒంగోలు నాయకుడు ఒకరు, దొంగ చాటుగా, రూ.5.27 కోట్లు ఒంగోలు నుంచి చెన్నై తరలిస్తూ, తమిళనాడు చెక్ పోస్ట్ దగ్గర, తమిళనాడు పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై అనేక అనుమానాలు తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో అవినీతి సొమ్ముగా చెప్తూ, చెన్నై నుంచి హవాలా మార్గంలో, తరలిస్తున్నారు అనేది, తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఇదే విషయం పై తేల్చాలి అంటూ, తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఒక లేఖ రాసారు. పట్టుబడిన వాహనం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బంధువు, మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డిదిగా అనుమానం వ్యక్తం చేసారు. ఈడీకి ఉత్తరం రాస్తూ ఈ విషయం పై, మనీ లాండరింగ్, PMLA కింద విచారణ జరపాలని విజ్ఞప్తి చేసారు. దీంతో ఈ విషయం పై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు, ఈడీ రంగంలోకి దిగింది. ఇదే విషయం పై విచారణ మొదలు పెట్టింది.

మరో పక్క నారా లోకేష్ మాట్లాడుతూ, దొరికిన రూ.5.27 కోట్లు, జగన్ మోహన్ రెడ్డి, మారిషస్ కు తరలించిన రూ.1200 కోట్లలో కొంత భాగం అని సంచలన ఆరోపణలు చేసారు. అంతే కాదు, ఈ మొత్తం హవాలా వ్యవహారం చెన్నై వేదికగా జరుగుతుంది అంటూ, కొన్ని కంపెనీల పేర్లు కూడా బయట పెట్టారు. అలాగే, మరో విషయం చెప్తూ, జగన్ మోహన్ రెడ్డి చెన్నై లో, రూ.122 కోట్లతో మరో పెద్ద ప్యాలెస్ కడుతున్నారని ఆరోపించారు. ఇక ఈ వ్యవహారం పై స్పందించిన బాలినేని మాత్రం, తనకు ఆ దొరికిన డబ్బుకు సంబంధం లేదని అన్నారు. దొరికిన వారు తమ పార్టీ వారేనని, వారు వ్యాపారం నిమిత్తం ఆ డబ్బు తీసుకు వెళ్తున్నారని అన్నారు. అయితే రూ.5 కోట్లు క్యాష్ తో, ఎలాంటి లావాదేవీలు జరపకూడదు అనే విషయం, అందరికీ తెలిసిందే. అనేక అనుమానాలు ఉన్న ఈ విషయం పై, ఈడీ రంగంలోకి దిగటంతో, ఈ విషయం ఒక కొలిక్కి వస్తుందేమో చూడాలి.

విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటూరి వారి వీధిలో సాయి చరణ్ జ్యూయలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసులో మిస్టరీని బెజవాడ పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. ఈ సందర్భంగా విజయవాడ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ఒన్ టౌన్, కాటూరి వారి వీధిలో రాజు సింగ్ చరణ్ అనే వ్యక్తి 2 సంవత్సరాలుగా సాయి చరణ్ జ్యూయలరీ షాపును నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో లాక్ డౌన్ నేపథ్యంలో వ్యా పారం జరగకపోవడంతో 19 కిలోల వెండి వస్తువులు, రూ. 20 లక్షల నగదును షాపు వద్దనే ఉంచి, తన స్నేహితుడైన గురు చరణ్ జ్యుయలరీ షాప్ యజమాని అయిన మనోహర్ సింగ్ రాతోర్‌కు చెందిన 7 కిలోల బంగారపు ఆభరణాలు, రూ.22 లక్షల నగ దును కూడా అదే షాపులో ఉంచాడు. లాక్ డౌన్ నేపథ్యంలో తన షాపు వద్ద వనిచేసే రెగ్యులర్ వర్కర్ స్వగ్రామానికి వెళ్ళి పోవడంతో, తనకు తెలిసిన మధుధాన్ అనే వ్యక్తి ద్వారా రాజస్థాను చెందిన విక్రం కుమార్ లోహాను 40 రోజుల క్రితం పనిలోకి చేర్చుకున్నాడు. పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఉండటంతో గురువారం రాత్రంతా ఫిర్యాది షావులోనే ఉన్నాడు.

శుక్రవారం ఉదయం 9 గంటలకు తన ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో మనోహర్ సింగ్ రాతోర్ వద్ద పనిచేసిన గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఆభరణాల కోసం సాయి చరణ్ జ్యూయలరీ షాప్ వద్దకు వెళ్ళాడు. అక్కడ సదరు విక్రం కుమార్ లోహార్ కాళ్ళు చేతులు కట్టివేయబడి ఎడమ చేతికి గాయం అయి అపస్మారక స్థితిలో ఉండటం గమనించి షావు యజమానికి సమాచారం అందించాడు. ఫిర్యాది షావు వద్దకు వెళ్ళి పరిశీలించగా షాపులో ఉండాల్సిన 7 కిలోల బంగారపు వస్తువులు, 19 కిలోల వెండి వస్తువులు, రూ.42 లక్షల నగదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లుగా విక్రం కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు షాపు యజమాని తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డిసిపి విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు వెస్ట్ డివిజన్ ఎసిపి కె.సుధాకర్ పర్యవేక్షణలో ఒన్ టౌన్ ఇనస్పెక్టర్ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నేరస్థలం అయిన సాయి చరణ్ జ్యుయలరీ షాపును పరిశీలించగా నేర స్థలంలో ఒక రహస్య ప్రాంతంలో ఉండాల్సిన సిసి కెమేరాలకు సంబంధించిన డిడిఆర్ కన్పించక పోవడం, సమీపంలో ఉన్న సిసి కెమేరాలు వరిశీలించగా కొత్త వ్యక్తులెవరు షావు నుండి బయటకు రావడం కనిపించక పోవడంతో, షావు లో వనిచేసే గుమాస్తా విక్రం కుమార్ లోహాన్ చెప్పిన కట్టుకథపై అనుమానం వచ్చింది.

విచారణ లో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో విక్రంకుమార్ చేసిన నేరం బట్టబయలైంది. శుక్ర వారం ఉదయం షావు యజమాని బయటకు వెళ్లిన వెంటనే బంగారం, వెండి, నగదును దొంగిలించి షాపు క్రింద రిపేరులో ఉన్న ఇంటిలో దాచి, షావు సిసి కెమేరాలను కూడ దొంగిలించి ఇంటి ఎదురు డ్రైనేజిలో పడేసి మరల షాపు వద్దకు వచ్చి బ్లేడ్ తో తనంతట తానుగా ఎడమ చేతికి గాయం చేసుకొని షావులో ఉన్న వస్తువులను చెల్లాచెదురుగా పడేసి బయట నుండి దొంగలు వచ్చి తనపై దాడి చేసి తనను కట్టేసినట్లుగా షావులో ఉన్న సీటితో తనంతట తానుగా చేతులు కాళ్ళు కట్టేసుకొన్నానని విచారణలో విక్రంకుమార్ వెల్లడించాడు. అతనిని అరెస్ట్ చేసి ఆతను దాచిన చోట నుండి 7 కిలోల బంగారు, 19 కిలోల వెండి, రూ.42లక్షల నగదు ఉన్న బ్యాగులను, తనకు తానుగా గాయం చేసుకోవడానికి ఉపయోగించిన బ్లేడును స్వాధీనం చేసుకున్నట్లు సిపి శ్రీనివాసులు వెల్లడించారు. సంఘటనా స్థలంలో విక్రం కుమార్ వ్రేలి ముద్రలున్న బాన్లు , సెల్ ఫోన్ తదితర వస్తు వులను కూడ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోవటంతో, ఎక్కువగా అప్పులు మీదే నెట్టుకువస్తున్నా సంగతి తెలిసిందే. ప్రతి నెల అప్పులతో నెట్టుకువస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే, గతంలో అభివృద్ధి పనులు కోసం, చేసిన దీర్ఘకాలిక అప్పులు విషయంలో, అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా, ఆ నిధులు మళ్ళిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వివిధ రుణసంస్థల నుండి ప్రభుత్వానికి నిధులు అందుతున్నా, వాటిని ఖర్చు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాబార్డ్, జైకా, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు వంటి అనేక బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలను ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జపాన్‌కు చెందిన జైకా నుంచి తీసుకున్న రుణాల పరిస్థితి కూడా అదే మాదిరి ఉంది. తక్కువ ఖర్చుపై సమీక్షలు నిర్వహిస్తున్నా.. ప్రగతి మాత్రం కనిపించడం లేదు. 2017లో నీటిపారుదల రంగంలోని పలు పథకాల కోసం జైకా నుంచి 21,297 మిలియన్ యెన్ల రుణానికి ఒప్పందం జరిగింది.

ఈ రుణాల వినియోగం 2018 జూలై నుంచి అమలులోకి వచ్చింది. ఇందులో ఇప్పటివరకు 457 మిలియన్ యెన్లు మాత్రమే ఖర్చు చేశారు. మొత్తం మీద 2020 మార్చిలోగా 2,795 మిలియన్ యెన్స్ పనులు జరగాల్సి ఉండగా, కేవలం 432 మిలియన్ యెన్ల విలువైన పనులు మాత్రమే జరిగినట్లు గుర్తించారు. ఇది కేవలం 15 శాతం మాత్రమే. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 1950 మిలియన్ యెన్లు వ్యయం జరగాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 25 మిలియన్ యెన్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. అంటే లక్ష్యంలో కేవలం 1.28 శాతమే సాధించారు. ఈ పరిస్థితికి నీటిపారుదల పనులను రద్దు చేయడం, మరికొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేయడం కారణమని చెబుతున్నారు. . జైకా నిధులతో చేపడుతున్న మొత్తం 20 పనుల్లో ఎనిమిది మీడియం ఇరిగేషన్ పనులు కాగా, మిగిలినవి మైనర్ ఇరిగేషన్ పనులని సమాచారం.

Advertisements

Latest Articles

Most Read