తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ బరిలో నిలిచిన వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ మేరకు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు ‘చలో వారణాసి’ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలోని అర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్తున్నామని రైతులు చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులుగా వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్‌ వేస్తామన్నారు. పసుపు బోర్డుతోపాటు పంటకు మద్దతు ధర సాధించాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నామని, ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా తాము ప్రచారం నిర్వహించబోమని స్పష్టంచేశారు.

modi 225042019

నిజామాబాద్‌లో పోటీ వ్యవహారాన్ని భాజపా, కాంగ్రెస్‌లు రాజకీయంగా వాడుకున్నాయని ఆరోపించారు. నిజామాబాద్‌ ఎంపీ కవితే లక్ష్యంగా ప్రచారం చేయడం వల్ల అసలు లక్ష్యం పక్కదారి పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు సాధన కోసం ఐదేళ్లుగా ఆమె పోరాటం చేశారన్నారు. తమకు మద్దతుగా తమిళనాడు నుంచి కొందరు రైతులు వస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి రైతులు తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 185 మంది రైతులు బరిలో నిలవడం సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తెలంగాణా రైతులు చేసినట్టు, ఏపి నుంచి కూడా మోడీ పై పోటీ చెయ్యాలి, మనకు మోడీ చేసిన అన్యాయం, దేశానికి మరోసారి చెప్పటానికి ఇది కూడా ఒక అవకాసం.. అన్ని పార్టీల నేతలు, ఈ విషయం పై ఆలోచించాలి.

పోలింగ్‌ జరిగిపోయింది. ఓట్లన్నీ పెట్టెల్లో దాగి ఉన్నాయి. అయితే అభ్యర్థులు మాత్రం టెన్షన్‌ ..టెన్షన్‌గా గడుపుతున్నారు. కౌంటింగ్‌ తేదీ దగ్గరపడే కొద్దీ వారిలో టెన్షన్‌ మరింత పెరుగుతోంది. అయితే పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు మీద ఎవరి లెక్కలు వారు వేసుకుని ఆశల పల్లకిలో ఉన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలైన నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురంలలోని 231 పోలింగు కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీన 1,67,915 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ఓటర్ల సహనాన్ని పరీక్షించినా గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 0.98 అధిక శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళా ఓటర్లు 85,269 మంది కాగా పురుష ఓటర్లు 82,646 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి మండలంలోను మహిళా ఓటర్లదేపై చేయిగా ఉంది.

roja 25042019

ఇక ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు గెలుపు మీద ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో పోలింగు సరళి మీద సీఎం చంద్రబాబు చేపడుతున్న సమీక్షలో కూడా దాదాపు ఆరు వేలు ఆధిక్యంతో తమ పార్టీ గెలుపు సాధిస్తుందని అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ ప్రతి బూత్‌లో అంచనాను తయారు చేసుకున్నారు. వడమాలపేట మండలంలో ప్రతిసారి ప్రత్యర్థి పార్టీకి ఆధిక్యం వస్తుందని అయితే ఈ సారి ఆ అంచనా తలకిందులయ్యే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. పుత్తూరు, నగరి మున్సిపల్‌ పరిధిలో కూడా ఆధిక్యం వస్తుందని చివరకు నిండ్ర, విజయపురం మండలాల్లో కూడా స్వల్ప ఆధిక్యంతో గెలుపు సాధిస్తామని అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ప్రత్యర్థి పార్టీ అంచనాలు వేస్తోంది.

 

roja 25042019

యథా ప్రకారం వడమాలపేట మండలంలో తమకు ఆధిక్యత వస్తుందని అంచనా వేస్తూ లెక్కింపు ప్రారంభమే ఆధిక్యంతో ప్రారంభిస్తామని భావిస్తున్నారు. పుత్తూరు, నగరి రూరల్‌ పరిధిలో వచ్చే అధిక ఆధిక్యంతోనే దూసుకుపోతూ నిండ్ర, విజయపురం మండలాల్లో స్వల్ప ఆధిక్యంతో దాదాపు ఆరువేలతో గెలుపు సాధిస్తామని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన సంక్షేమ పథకాలను చివరిలో ఇరు పార్టీలు ఇచ్చిన తాంబులాన్ని తీసుకున్న ఓటరు మాత్రం గుంభనంగా చోద్యం చూస్తున్నారు. తాంబులాలు ఇచ్చాం తన్నుకు చావండని నింపాదిగా ఓటరు లోలోన ఆనందిస్తున్నారు. ఇకపోతే ఈవీఎంలలో ఓట్లు భద్రంగా ఉన్నా నాయకులకు మాత్రం అభద్రతా భావంతో తమ ప్రతినిధులను స్ట్రాంగ్‌ రూంల వద్ద అదనపు కాపలా దారులుగా నియమించుకున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తన దుస్తులు తానే ఉతుక్కున్నానని బుధవారం జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. అయితే ఇది పూర్తిగా అవాస్తమని నెటిజెన్లు మండిపడుతున్నారు. మోదీ అబద్దాలు చెబుతున్నారని కొన్ని సాక్ష్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మోదీని బుధవారం బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తన దుస్తులు తానే ఉతుక్కున్నానని మోదీ అన్నారు. దీనిపై నెటిజెన్లు విపరీతంగా మండిపడుతున్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్దాలు చెప్పడమేంటని, ఇదంతా ఎన్నికల గిమిక్కని విమర్శలు గుప్పిస్తున్నారు.

modi 25042019

మోదీ.. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. అయితే 1970ల్లో.. నరేంద్రమోదీ ఆర్‌ఎస్ఎస్ ప్రచారక్‌గా నుంచే చాంద్ మహ్మద్ అనే వ్యక్తి మోదీ దుస్తులు ఉతుకుతూ వచ్చారు. అతడు ఈ మధ్యే మరణించారు. అంటే మోదీ ముఖ్యమంత్రి కాకముందు మూడు దశాబ్దాల క్రితం నుంచే ఆయన దుస్తులు వేరే వారు ఉతికేవారనే విషయం స్పష్టమవుతోందని నెటిజెన్లు మండిపడుతున్నారు. ఇది ఒక్కటే కాదు ఒబామా నాకు మంచి స్నేహితుడు అని, మాకు మంచి రిలేషన్ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. కాని ఒక ఇంటర్వ్యూ లో మోడీ గురించి అభిప్రాయం అడగ్గా, ఒబామా మోడీ గురించి చెప్పకుండా, మన్మోహన్ గురించి చెప్పిన వీడియో క్లిప్ కూడా వైరల్ అవుతుంది.

 

modi 25042019

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడు దశల్లో పోలింగ్ కంప్లీట్ అయింది. ఇంకా నాలుగు దశల్లో పోలింగ్ జరగాలి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి సడెన్‌గా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.అసలు ఒక నటుడికి మోదీ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చాడనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల వేళ పీఎం మోదీ ..తన జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్ విడుదలకు ఈసీ బ్రేకులు వేసింది. దీంతో తన గురించి ప్రజలకు చేరాలనుకున్న విషయాలు సరిగా చేరలేకపోయింది. అదే సమయంలో ప్రధాని జీవితంపై వెబ్ సిరీస్‌ను కూడా సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. మరోవైపు కొంత మంది నటీనటులు మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే చరిత్రలో ఒక విలేఖరికి కాకుండా అక్షయ్ కుమార్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోకు ఇంటర్వ్యూ ఇవ్వడం వెనక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

వారానికో వీడియో కాన్ఫరెన్స్‌.. రోజుకో టెలికాన్ఫరెన్స్‌.. ఎడతెగని సమీక్షలు.. చకాచకా నిర్ణయాలు.. ఇప్పుడివేం లేవు. రాష్ట్రంలో అటు రాజకీయ యంత్రాంగం.. ఇటు పాలనా యంత్రాంగం.. రెండిటిలోను స్తబ్ధత నెలకొంది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ 11వ తేదీనే ముగిసింది. అన్ని దశల్లో పోలింగ్‌ జరిగి.. ఫలితాలు వెలువడేందుకు మే 23 దాకా వ్యవధి ఉంది. అప్పటిదాకా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది. చేయాల్సిన పనులేమో చాలా ఉన్నాయి. వాటిలో అధికార యంత్రాంగం చేయాల్సినవే ఎక్కువ. నియమావళి అమల్లో ఉండడంతో కొత్త నిర్ణయాలు చేసే అవకాశం లేదు. కొత్త పథకాల సంగతి తర్వాత.. కనీసం అమల్లో ఉన్న పథకాలూ సాగడం లేదు. రోజువారీ నిర్ణయాలు కూడా జరగడం లేదు. ఓపక్క తాగునీటి ఎద్దడి ముంచుకొచ్చింది.. గృహ నిర్మాణం, ఉపాఽధి హామీ పనుల కల్పన, కూలీలకు వేతనాల చెల్లింపు, కేంద్రం నుంచి రావలసిన నిధుల కోసం ప్రయత్నాలు.. అన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.

electioncode 25042019

చివరకు పురపాలక శాఖలో పన్నులు వసూలు చేసే సర్వర్లు స్తంభించినా పట్టించుకునే దిక్కు లేదు. ఇది ఖజానాలో జమ కావలసిన డబ్బు. ఇక ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల సంగతి చెప్పక్కర్లేదు. అవీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాక.. సాగుతున్న పనులు ఆగిపోయి..అంతా స్తబ్దత నెలకొంది. పరిపాలనలో పూర్తి ప్రతిష్టంభన ఏర్పడింది. వస్తున్నాం.. వెళ్తున్నాం అన్నట్లుగా పాలనా యంత్రాంగం తీరు ఉంది. పైనుంచి చెప్పేవారు లేకపోవడం, తమకు తాము నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందోనని అధికారుల్లో ఆందోళన.. మనకెందుకులే.. ఇంకో నెల ఇలానే నడిపించేద్దామన్న ఉదాశీన వైఖరి.. అధికారులు కార్యాలయాలకు వస్తున్నా.. ఏదో నిర్వేదం, ఏం చేయాలో తెలీని స్థితిలో పడిపోయారు.

electioncode 25042019

చీకట్లో దేవులాటలా... ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో కొన్ని అంశాలపై సమీక్ష జరిపారు. ప్రజల కోసం తప్పని పరిస్థితుల్లోనే సమీక్షలు చేయాల్సి వచ్చిందని, ప్రజా సమస్యలను గాలికి వదిలేయలేని స్థితిలోనే సమీక్షలు చేశామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉండడంతో.. మంత్రులు సమీక్షలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. వివాదాలకు తావివ్వడం ఎందుకన్న ఉద్దేశంతో అధికారులతో సమావేశాలు పెట్టడం లేదు. మరోవైపు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యం కొత్తగా వచ్చారు. ఆయన వైఖరి ఏంటన్నది ఇతర ఉన్నతాధికారులకు ఇంకా అంతుపట్టలేదు. ఆయన ఫలానాది చేయమంటే చేద్దాం.. అడిగితే చూద్దాం.. అన్నట్లుగా కొందరు మిన్నకున్నారు. మరికొందరు ఏదైనా ఈ నెలరోజుల పాటు వాయిదా వేసేస్తే పోలా.. అన్న నిర్ణయానికి వచ్చేశారు. ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులే ఇలా ఉండడంతో.. కింద ఆయా శాఖల్లోనూ ఏ పనులూ జరగడం లేదు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల పరిశీలన పూర్తిస్థాయిలో ఆగిపోయింది. ప్రభుత్వం-పాలనా యంత్రాంగం రెండూ ఒక రకమైన అచేతనావస్థకు చేరుకున్నాయి. కార్యాలయాలకు రావడం, పోవడం, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి.. మొత్తంగా చూస్తే చీకట్లో దేవులాటలా పరిస్థితి తయారైందని వ్యాఖ్యానిస్తున్నారు.

 

 

Advertisements

Latest Articles

Most Read