కొంత మంది చేసిన తప్పు ఒప్పుకుంటే, మరికొంత మంది ఒక తప్పుని సమర్ధించటానికి, వంద తప్పులు చేస్తూ ఉంటారు.. అలాంటి పనే ఇప్పుడు కేంద్రం చేసింది. దేశంలో హాట్ టాపిక్ గా మారిన రఫేల్‌ కుంభకోణం గురించి, ఏకంగా సుప్రీం కోర్ట్ నే తప్పుదోవ పట్టించారు. చట్టబద్ధ ప్రక్రియ జరగకుండానే జరిగినట్లు చెప్పడం, దాని ఆధారంగా తీర్పు రావడం ప్రతిపక్షాల చేతికి ప్రధానాస్త్రంగా మారింది. తీర్పులోని పేరా-25 వివాదాస్పదమైంది. కేంద్రం సీల్డు కవర్‌లో సమర్పించిన దాంట్లో ‘ధరల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే కాగ్‌తో పంచుకుంది. కాగ్‌ ఈ అంశంపై నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) సమీక్ష జరిపి పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉంది’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పడం అందరూ అవాక్కయ్యారు. అసలు కాగ్ రిపోర్ట్ ఇవ్వకుండా ఇచ్చినట్టు, దాన్ని పీఏసీ సమీక్ష చేసినట్టు కోర్ట్ కి చెప్పేశారు.

rafel 16122018 2

అయితే, ఇప్పుడు ఈ విషయం బయట పడటంతో అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చెయ్యటంతో, చేసిన తప్పు బయటపడిందని గ్రహించిన కేంద్రం, వెంటనే మరో పిటీషన్ కోర్ట్ లో వేసింది. ఈ పిటీషన్ ఏంటో తెలిస్తే చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. కేంద్రం కోర్ట్ కి చెప్పిన దాని ప్రకారం, మేము చిన్న టైపింగ్ ఎర్రర్ చేసాం, మేము కోర్ట్ కి ఇచ్చిన నివేదికలో కొంచెం ఎర్రర్ ఉంది, "THE CAG REPORT WILL BE EXAMINED BY THE PAC" అని రాయబోయి, "it has been examined by the PAC" అని చెప్పాం, ఇది కొంచెం కరెక్ట్ చెయ్యండి అని కోర్ట్ కి చెప్పింది కేంద్రం. అయితే ఈ ఒక్క మాటే ఏకంగా తీర్పుని ప్రభావితం చేసేది. మరి ఈ విషయం పై కోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో పక్క, కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఈ కమిటీ ఛైర్మన్‌ మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.

rafel 16122018 3

దీనిపై నిజానిజాలు తెలుసుకోవడానికి అటార్నీ జనరల్‌, కాగ్‌ చీఫ్‌లను పీఏసీ ముందుకు పిలిపించాలని భావిస్తున్నట్లు చెప్పారు. పీఏసీకి నివేదికను ఎప్పుడు పంపారు? ఎప్పుడు సాక్ష్యాధారాలు సమర్పించారు? అని అడుగుతామన్నారు. ఇప్పటివరకూ ఏ నివేదికా బహిర్గతం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడంవల్లే ఇలాంటి తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. కాగ్‌ నివేదిక ఇవ్వలేదు.. కేవలం తయారవుతోందని మాత్రమే చెప్పామని, తప్పులుంటే కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వం చెబుతోంది కదా అన్న విలేకర్ల ప్రశ్నకు ఖర్గే బదులిస్తూ అలాగైతే తీర్పులో రాసింది అబద్ధమా అని ప్రశ్నించారు. అది అబద్ధమని భావిస్తే ప్రభుత్వం దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజలను మోసగించడానికి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జేపీసీ వేయాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సదరు అఫిడవిట్‌ను అటార్నీ జనరల్‌ ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. సొంత అఫిడవిట్లనూ ప్రభుత్వం చదవదా అని ఎద్దేవా చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read