ఆంధ్రప్రదేశ్ - ది సన్-రైజ్ స్టేట్ ... ఇది ఎదో కొటేషన్ కాదు, ఇది వాస్తవం... ఆంధ్రవాడిని అడ్డుకునే శక్తి ఎవ్వడికి లేదు... ఎన్నో అవమానాలు, సొంత రాష్ట్రంలో, ఒక వర్గం నిట్టూర్పులు... పరాయి రాష్ట్రంలో ఉంటూ, సొంత రాష్ట్రం మీద కుట్ర చేసే సంత..... అసలు ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వగలమా అనే పరిస్థితి... భవిషత్తు శూన్యం... ఏమి జరుగుతుందో తెలీదు, ఎప్పటికి కోలుకుంటామో తెలీదు, మన పిల్లల భవిష్యత్తు ఏమి అవుతుందో అనే ఆందోళన... అలాంటి పరిస్థితిల్లో నుంచి, కారు మబ్బులుని చీల్చుకుంటూ, ఉదయిస్తుంది, మన ఆంధ్రప్రదేశ్...
ఇది వాస్తవం, అని ఎన్నో ప్రపంచ స్థాయి సంస్థలు చెప్పాయి, కేంద్రం విడుదల చేస్తున్న ర్యాంకింగ్స్ చెప్తున్నాయి... మన రాష్ట్ర వృద్ది రేటు చెప్తుంది. అదే క్రిందట ఏడాది జరిగిన, CII సమ్మిట్ పెట్టుబడులు కూడా చెప్తున్నాయి... అలా ఇలా కాదు, CII అధికారులే ఆశ్చర్యపోయే విధంగా, దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా గుజరాత్ ని కూడా వెనక్కి నెట్టి, ఆంధ్రప్రదేశ్ మరో రికార్డును సాధించింది... క్రిందట ఏడాది CII సమ్మిట్ లో కుదుర్చుకున్న ఒప్పందాల్లో, 42 శాతం గ్రౌండ్ చేసి, దేశంలో మొదటి స్థానానికి చేరింది. దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో సాధించలేనన్ని పరిశ్రమలను గత ఏడాది ఆంధ్రప్రదేశ్ సాధించింది. సాధారణంగా భాగస్వామ్య సదస్సుల్లో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు వాస్తూ ఉంటాయి... కాని ఆచరణలోకి వచ్చేసరికి అందులో 20-30 శాతం కూడా కన్వరట్ కావు... కాని మొదటి సారిగా మనకి, 42 శాతం అమల్లోకి రావడం మన రాష్ట్రానికి గర్వ కారణం..
గతేడాది జనవరిలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా, సుమారు 328 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రూ. 4,62,234కోట్లు పెట్టుబడులుగా పెడతామని పారిశ్రామికవేత్తలు ఒప్పందానికి వచ్చారు. 48 శాతం ఒప్పందాలు అమలుకు శ్రీకారం చుట్టాయి. ఇందులో 42 శాతం అంటే 89 ప్రాజెక్టులు సివిల్ పనులను ప్రారంభించాయి. వీటి విలువ రూ. 82,595 కోట్లు. వీటి ద్వారా 59,679మందికి ఉపాధి కల్పించనున్నారు. వీటిలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు 39 కాగా వీటి ద్వారా 27,315 మందికి ఉపాధి లభిస్తుంది. రూ. 52,987కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా ఫాలో అప్స్ చేస్తున్నారు కాబట్టి, ఇది 50% దాటే అవకాశాలు ఉన్నాయి.
మౌలిక సదుపాయాలు, కరెంటు, నీళ్ళు, భూమికి కొరత లేకపోవటం, మంచి రవాణా కనెక్టివిటీ, ముడి సరకు లభ్యతతో పాటు, ఆంద్రప్రదేశ్ పై సానుకూలత, అద్భుతమైన చంద్రబాబు నాయకత్వం, వీటికి దోహదపడ్డాయి... అయినా సరే, ఉన్మాదంతో కొంత మంది, పరిపక్వత లేక కొంత మంది విషం చిమ్ముతూనే ఉన్నారు...
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి, పెట్టుబడులు, పరిశ్రమల గురించి, అన్నింటికీ మించి 2016 CII సమ్మిట్ గురించి, ప్రశ్నించే వారందరికీ ఇందులో చాలా సమాధానాలు లభిస్తాయి. ఇందులో ఎన్ని ఒప్పందాలు జరిగాయి, ఎంత విలువ, వాటిలో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి, ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభించాయి అనే వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ మన విపక్ష నాయకుడు ప్రశ్నించినట్లు కేవలం ముఖ్యమంత్రి అందం ( ఫేస్ వేల్యూ ), నిబద్ధత, ముందు చూపు, పరిపాలనా దక్షత, కష్టంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు చూసి వచ్చినవే... ఇవన్నీ ఎటువంటి " స్పెషల్ హోదా " లేకుండా వచ్చినవే...
స్వయంప్రకటిత మేధావులు, రాజకీయ అవకాశవాదులు, కుల గజ్జి మేధావులు, వ్యక్తిగత, స్వార్ధ ప్రయోజనాల కోసం వెంపర్లాడే మీడియా జనాలు, పరాయి రాష్ట్రంలో ఉంటూ, సొంత రాష్ట్రం మీద కుట్ర చేసే సంత ఇలా ఎవరైనా సరే, ఇంత స్పష్టంగా వాస్తవాలు కనిపిస్తున్నా, చూడలేని , అంగీకరించలేని వాళ్లు ఉంటే, వెళ్లి కోడి గుడ్డు మీద ఈగలు పీక్కోవచ్చు... ఇవిగోండి 2016 CII సమ్మిట్ లో పనులు ప్రారంభించిన, కంపెనీల వివరాలు....




