ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, రాష్ట్రం రంగుల మయం అయిపోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ ఆఫీస్ కి, ప్రభుత్వ భవనాలకు, స్కూల్స్ కు, వాటర్ టాంక్లకు, గేదల కొమ్ములకు, స్మశానాలకి, ఆకులకు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏది కనిపిస్తే దానికి, రంగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగోలేదు అని చెప్తూనే, రంగులకు మాత్రం, బడ్జట్ కు వెనుకాడతం లేదు. అయితే ఆకులకు, గేదల కొమ్ములకు, ప్రైవేటు బిల్డింగ్స్ కు వేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు కాని, ప్రభుత్వ భవనాలకు వెయ్యటం మాత్రం తీవ్ర అభ్యంతరం. బ్రిటిష్ కాలంలో కట్టిన ఆఫీస్ లకు కూడా, తామే కట్టాం అనే విధంగా రంగులు వేసుకుంటున్నారు. ఏదో ఒకటీ అర అంటే, కింద స్థాయిలో అత్యుత్సాహం అనుకోవచ్చు. కాని ఇక్కడ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి మరీ, ఇలా ప్రభుత్వ భవనాలకు రంగులు వేయించటం చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.

highcourt 13122019 2

గ్రామాల్లో ఉండే పంచాయతీ భవనాలకు రంగులు వెయ్యటం ఏంటి, ఇదేమన్నా పార్టీ ఆఫీసా, ప్రజలు అందరూ వచ్చే కార్యాలయానికి మీ పార్టీ జెండా రంగులు ఎలా వేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ రంగుల పిచ్చ పై, జగన్ ప్రభుత్వానికి హైకోర్ట్ లో షాక్ తగిలింది. ప్రభుత్వ భవనాలకు, మీ పార్టీ జెండా రంగులు ఎలా వేస్తారు అంటూ, హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్ట్ విచారణ జరిపింది. ప్రజలందరూ వచ్చే ప్రభుత్వ కార్యాలయాలకు, పార్టీ రంగులు ఎలా వేస్తారు అంటూ హై కోర్ట్ ప్రశ్నించింది. పది రోజుల్లో, పూర్తీ నివేదిక ఇవ్వాలని, గుంటూ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

highcourt 13122019 3

అయితే ఇది ఇలా ఉంటే, ఈ రంగుల పై మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని, అందరూ తప్పు బడుతున్నారు. చాలా ఖర్చు పెట్టి, రాష్ట్రంలో వేల భవనాలకు వైసీపీ జెండా రంగులు వేస్తున్నారని, రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో, ఎన్నికల కోడ్ వస్తుందని, అప్పుడు ఈ భవనాలు అన్నిటికీ మళ్ళీ సున్నం పుయ్యాలని ఒక వాదన ఉంది. ఎందుకంటే, ఎన్నికలు సహజంగా ప్రభుత్వ స్కూల్స్ లో, పంచాయతీ ఆఫీస్ ల్లో జరుగుతాయి. అక్కడ వైసీపీ రంగులు ఉంటే, ఎన్నికల కోడ్ కిందకు వస్తుంది. అందుకే వాటికి మళ్ళీ తెల్ల రంగు పుయ్యాలి. ఇవన్నీ తెలిసినా, ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది అనేది తెలియాలి. ఇప్పుడు హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చెయ్యటంతో, కార్యాలయాల రంగులు అన్నీ మార్చే అవకాసం ఉంది. అంటే ప్రజా ధనం మొత్తం వృధానేనా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read