‘మొరిగే కుక్కలకు బెదిరేదిలేదు. ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మాకు అండగా నిలిచిన ప్రజలకు మాత్రమే భయపడతాం..’ అని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత వైసీపీ నేతలను హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెట్టింపు పింఛన్లు, పసుపు-కుంకుమ సొమ్ము అందజేత కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగపూరితంగా మాట్లాడారు. టీడీపీకి, తమ కుటుంబానికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు గ్రామాల్లో చిచ్చు రేపుతున్నారని మండిపడ్డారు. తోపుదుర్తిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రూ.60 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. స్త్రీనిధి ద్వారా పొదుపు మహిళలకు రూ.5 కోట్ల రుణాలు అందించామన్నారు. హంద్రీనీవా ద్వారా గ్రామంలోని రెండు చెరువులు నీటితో నింపామన్నారు. ఈ రోజు ఆ గ్రామం చుట్టూ పచ్చదనం కనిపిస్తోందంటే అది హంద్రీనీవా నీరు వల్ల కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు తప్పుడు ఆరోపణలు చేస్తున్న తోపుదుర్తి కుటుంబం అదే నీటితోనే పంటలు పండించుకోవడం లేదా అని ప్రశ్నించారు.

పార్టీలకతీతంగా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తోపుదుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేశామన్నారు. మహిళలకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇచ్చి పసుపు-కుంకుమ కార్యక్రమం చేపడితే అది చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు దుర్బుద్ధితో అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేపడితే తాము భయపడమని, కేవలం అభివృద్ధికే తాము ప్రాధాన్యమిస్తామన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా నీళ్లొచ్చిన తరువాత ఇతరులకు కూలికి వెళ్లకుండా గ్రామస్థులు తమ పొలాల్లోనే పంటలు పండించుకుని ప్రశాంతంగా జీవనం సాగిన్నారన్నారు. దీన్ని చూసి ఓర్వలేక గ్రామంలో తోపుదుర్తి కుటుంబీకులు చిచ్చు పెడుతున్నారన్నారు. అభివృద్ధికి సహకరించాలని, ప్రశాంతంగా జీవనం సాగించే అమాయకపు ప్రజలకు ఇబ్బంది కల్పించవద్దని కోరారు. మహిళా మంత్రిగా గ్రామంలోకి తాను వస్తే వైసీపీ నాయకులు అడ్డుకోవాలని ప్రయత్నించడం బాధాకరమన్నారు. గ్రామాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేయడం తప్పా అని ఉద్వేగపూరితంగా ప్రశ్నించారు. మహిళలకు ఇచ్చే పసుపు-కుంకుమ విలువ తెలియని వైసీపీ నాయకులకు మాట్లాడే హక్కు లేదన్నారు. ఎంతోమంది మహిళల పసుపు-కుంకుమ తుడిపేసిన వారికి దాని విలువ ఏమి తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రతి మహిళా తమ తోబుట్టువులా భావించి పసుపు-కుంకుమ ద్వారా చెక్కులు అందిస్తామని, పార్టీలకతీతంగా అందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకునేలా చూస్తామన్నారు.

తోపుదుర్తిలో ఉద్రిక్తత.. తోపుదుర్తి గ్రామంలో ఆదివారం పసుపు-కుంకుమ కార్యక్రమం ఉద్రిక్తత మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సిన మంత్రి పరిటాల సునీతను గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని గ్రామానికి చెందిన వైసీపీ మహిళా కార్యకర్తలు రోడ్డుపై భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని వైసీపీ నాయకులు ముందస్తుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే మంత్రి కాన్వాయ్‌ని పోలీసులు ఆపారు. అలాగే పరిటాల శ్రీరామ్‌ కాన్వాయ్‌ని కనగానపల్లి మండలం బోగినేపల్లి వద్ద ఆపారు. గ్రామంలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం మంత్రి దృష్టికి ఎస్పీ తీసుకెళ్లారు. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్‌ మేరకు తోపుదుర్తిలో సభ నిర్వహించాల్సిందేనని మంత్రి పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి వారి ఇళ్లలోనే గృహ నిర్బంధం చేశారు. అనంతరం తోపుదుర్తి గ్రామంలో యథావిధిగా మంత్రి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.

 

అసెంబ్లీలో ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కవ్వింపులు చేసినా, తన పేపర్ లో, టీవీలో, ఆయన పై ఎన్ని వ్యాఖ్యలు చేసినా, సహనం నశించని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఈ రోజు మాత్రం, తీవ్ర ఆగ్రహంతో, సహనం నశించి, జగన్ పై ఆరోపణలు చేసారు. గత వారం పది రోజులుగా, స్పీకర్ పై, వైసీపీ నేతలు అనరాని మాటలు అంటున్నారు. రాజకీయంగా కామెంట్ చెయ్యవచ్చు కాని, అది శ్రుతిమించి, ఆయన్ను రెచ్చగొట్టే విధంగా, పరుష పదజాలంతో, రెచ్చిపోతున్నారు. సాక్షి పేపర్, టీవీలో మరీ ఘోరంగా ఆయన గురించి రాస్తున్నారు. ఈ రోజు రోజా మాట్లాడుతూ,పచ్చ స్పీకర్ గారూ.. మరీ ఇంత ‘పచ్చదనమా’ అంటూ ఎంతో జుబుక్షాకరంగా మాట్లాడింది.

kodela 04022019

స్పీకర్ స్థానంలో ఉంటాడు, ఇన్నాళ్ళు మనం ఎన్ని ఆటలు ఆడినా, ఆయన ఏమి మాట్లాడడులే అనుకుని, రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. అయితే, ఈ రోజు మాత్రం స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు, సహనం నశించింది. వైసీపీ నేతలు పదే పదే తనను కించపరుస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడం పై, ఆయన తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలో పర్యటించిన కోడెల జగన్ ఒక దుర్మార్గుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దుర్మార్గుడు పార్టీ పెట్టి నీతి గురించి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. తాను అవినీతి చేశానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.

kodela 04022019

ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు. అవినీతిపై ఎదురుగా వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. లేదా అవినీతిపై మాట్లాడేందుకు నువ్వు రమ్మన్న చోటకు నేనొస్తా అంటూ కోడెల సవాల్ విసిరారు. నువ్వేం చేశావో నేనేం చేశానో ప్రజలకు చెబుదామంటూ వ్యాఖ్యానించారు. నేను ఎవరికీ తలవంచకుండా నిప్పులా బతికానని చెప్పుకొచ్చారు. విశ్వాసంతో పదవులు వచ్చాయని అంతే కానీ ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదన్నారు. రూ. 43 వేల కోట్ల ప్రజల సోమ్మును దోచుకుతిన్నాడని, 16 నెలలు జైలులో ఉన్న వాడా తనపై మాట్లాడేదని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో నిప్పులా బతికానని నీలా కాదు అంటూ జగన్ పై ధ్వజమెత్తారు. తప్పు చెయ్యాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు.

పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఘోర అవమానం జరిగింది. జనం లేక అమిత్‌షా సభ వెలవెలబోయింది. భాజపా చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి అమిత్‌షా పలాస వచ్చారు. అమిత్‌షా రాక సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసింది భాజపా రాష్ట్ర కార్యవర్గం. వేలాది మంది కూర్చునేందుకు అనువుగా కుర్చీలు కూడా ఏర్పాటు చేసారు. అయితే ప్రజలు మాత్రం అమిత్ షా ను తిరస్కరించారు. జనం లేక కుర్చీలను ముందే సర్దేసారు బీజేపీ కార్యకర్తలు. డబ్బులు ఇస్తాం అన్నా ప్రజలు రాని పరిస్థితి. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహంతో, పలాసలో బహిరంగ సభను రద్దు చేసుకున్నారు అమిత్‌షా. అయితే అక్కడి నేతలు మా పరువు పోతుంది, ఇలా చెయ్యకండి అని బ్రతిమిలాడటంతో అమిత్ షా కురించారు.

amit 04022019

ఉన్న కొద్దిమందిని ఉద్దేశించి ప్రజాచైతన్య యాత్ర రథం పై నుంచే ప్రసంగించారు అమిత్‌షా. ప్రజాస్పందన లేకపోవటంతో వెలవెలబోయిన బహిరంగ సభా వేదికను చూసి కన్నాకు చురకలు అంటించారు. ప్రజలు రాకపోవటంతో ప్రజాచైతన్య యాత్ర రథం వరకే పరిమితం చేసారు భాజపా నాయకులు. మరో పక్క, అమిత్‌షా రాకపై తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, జిల్లా తెదేపా అధ్యక్షురాలు గౌతు శిరీష ఆధ్వర్యంలో కార్యకర్తలు కాశీబుగ్గ పాతబస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అమిత్‌షా గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు నేతలను అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పీఎస్‌కు తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే శివాజీ, గౌతు శిరీష, కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌లోనే బైఠాయించారు.

amit 04022019

అయితే ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, రాష్ట్రానికి 5 లక్షల కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. అవి చంద్రబాబు జేబులోకి వెళ్ళాయంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీల్లో సింహభాగం మొదటి ఐదేళ్లలోనే పూర్తిచేశామని.. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌.. విశాఖలో ఐఐఎం, తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ సంస్థలేవీ ఇంతకుముందు ఏపీలో లేవని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌, విశాఖలో ఎన్‌ఐపీఈఆర్‌ నెలకొల్పామని.. పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని కూడా ఏపీకి కేటాయించామని అమిత్‌షా చెప్పారు.

టాలీవుడ్ యాక్టర్ నందమూరి తారకరత్నకు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఉన్న తారక్‌కు చెందిన 'ఫ్రెండ్స్ డ్రైవ్ ఇన్' రెస్టారెంట్‌ను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన రెస్టారెంట్ వద్దకు వచ్చి అధికారులను నిలదీశారు. ఐతే నిబంధనలను విరుద్ధంగా నడుపుతున్నారని ఫిర్యాదులు రావడం వల్లే కూల్చివేశామని వివరణ ఇచ్చారు. కూల్చివేత సందర్భంగా హోటల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని అనుమతులు తీసుకున్నాకే రెస్టారెంట్ నిర్వహిస్తున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అన్నీ కరెక్ట్ గా ఉన్నా కూడా, ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రకటించినా, పట్టించుకోకుండా ముందుకు సాగారు.

taraka 04022019 2

రాత్రివేళ రెస్టారెంట్‌లో సౌండ్ సిస్టమ్‌తో ఇబ్బందులు సృష్టిస్తున్నారని, తాగుబోతుల ఆగడాలు సైతం పెరిగాయని కాలనీవాసులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు రెస్టారెంట్‌ను కూల్చివేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తమకు కొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరారు. తారకరత్న విన్నపం మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మూడు గంటల గడువు ఇచ్చారు. గడువులోగా రెస్టారెంట్‌లోని సామగ్రిని అక్కడి నుంచి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే తారక రత్న దీని మీద న్యాయ పోరాటం చెయ్యడానికి సిద్ధం అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

taraka 04022019 3

అయితే అధికారులు తమకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా, ఉన్నట్టు ఉండి ఇలా వచ్చి, కూల్చివేతకు దిగడం దారుణమని అంటున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు, ఏంటి అనే సమాచారం ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా, ఎదో యుద్ధానికి వచ్చినట్టు వచ్చారని, ఎందుకు చేస్తున్నారో కూడా కొంత సేపు చెప్పలేదని అంటున్నారు. అయితే దీని వెనుక రాజకీయ కక్ష కూడా ఉంది అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. గత ఎన్నికలలో కూకట్ పల్లిలో నందమూరి సుహాసినికి మద్దతుగా ప్రచారం చేసినందుకు, కేసీఆర్ పై విమర్శలు చేసినందుకు, తమ హీరోను అధికారులు వేధిస్తున్నారని నందమూరి అభిమానులు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే, ముందు చెప్తారని, హెచ్చరిస్తారాని, తరువాత నోటీస్ ఇస్తారని, ఏమి లేకుండా ఇలా చెయ్యటం దారుణమని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read