సంక్రాంతి పండుగ జర్నీ చేసే వారికి స్వీట్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. మూడు రోజులు టోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం, గంటలకొద్దీ సమయం పడుతుంటంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ తోపాటు చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల నుంచి కూడా కోట్ల మంది తెలుగోళ్లు ఏపీలోని సొంతూళ్లకు ప్రయాణం అయ్యారు. లక్షల కార్లు, బస్సుల్లో తరలివస్తున్నారు. లక్షల సంఖ్యలో వాహనాలు ఏపీకి వస్తుండటంతో టోల్ గేట్ల దగ్గర అవస్థలు పడుతున్నారు. ఒక్కో వాహనానికి కనీసం 2 నిమిషాల సమయం పడుతుంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా రద్దీ తగ్గటం లేదు. గంటలకొద్దీ సమయం వృధా అవుతుంది.

tollgate 12012019 2

దీంతో సమయం ఆదా చెయ్యటానికి, టోల్ ట్యాక్స్ ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటి నుంచి,13,14,15,16 తేదీల్లో టోల్ ట్యాక్స్ ను ఎత్తివేయాలని ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. కాగా, హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు ప్రజలు బయలుదేరి వెళుతున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను పలు మార్గాల్లో నడుపుతోంది. రిజర్వేషన్ ద్వారా సీట్లు లభించని ప్రయాణికులు తమ గమ్య స్థానాలను చేరేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

tollgate 12012019 3

ఇది ఇలా ఉంటే ఉదయం నుంచి, జీఏంఆర్ సరి కొత్త పద్దతిలో టాక్స్ వసూలు చేస్తుంది. టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. టోల్‌ చెల్లింపులకు ఎక్కువ సమయం పట్టడమే ఈ పరిస్థితికి మూలమని గుర్తించిన గుత్తేదారు సంస్థ ‘జీఎమ్మార్‌’ కొత్త పద్ధతి అమలు చేస్తోంది. టోల్‌ బూత్‌ వద్దకు వాహన చోదకుడు వెళ్లినప్పుడు కాకుండా... సిబ్బందే నేరుగా వచ్చి వసూలు చేస్తున్నారు. రశీదు పొందిన చోదకులు వెంటనే వెళ్లిపోతుండటంతో, బూత్‌ వద్ద రశీదు, చిల్లర కోసం వేచిచూడాల్సిన పని తప్పింది. వాహనాల రద్దీ దృష్ట్యా, సంస్థ ఇప్పటికే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద 16, కొర్లపహాడ్‌లో 12 యంత్రాలను ఏర్పాటుబ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట ప్రాంతం చిల్లకల్లు వద్ద 12 యంత్రాలు అమర్చి చోదకుల దరికే వచ్చి టోల్‌ వసూలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం, టోల్ ఎత్తివేయటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read