తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, శుక్రవారం సాయంత్రం, గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఆయన చెప్పినట్టుగానే, 5 రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై, రెండు రోజులు తెలంగాణా రాజకీయాల పై ఫోకస్ చేస్తున్నారు. గత నెల రోజులుగా, ప్రతి వారం రెండు రోజుల పాటు, తెలంగాణాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గుంటున్నారు. తెలంగాణాలో పార్టీని బల పరిచి, నాయకత్వాన్ని తాయారు చెయ్యటనికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. బలమైన నేతలు ఎవరూ లేకపోయినా, తెలంగాణాలో తెలుగుదేశం క్యాడర్ మాత్రం అలాగే ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో అతి తక్కువ సీట్లలో పోటీ చేసి కూడా, రెండు సీట్లు సాధించారు. ఇక నుంచి ఏ పార్టీతో పొత్తు లేకుండా, సొంతగా ఎదిగే ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసమని, చంద్రబాబు ప్రతి వారం, తెలంగాణాలో పర్యటన చేస్తున్నారు.

ఈ క్రమంలో, నిన్న కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి, చంద్రబాబుతో భేటీ అవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి వచ్చిన నాగంతో, తెలంగాణాలోని రాజకీయ పరిస్థితితుల పై చర్చించినట్టు తెలుస్తుంది. డిసెంబర్ లో జరిగిన తెలంగాణా ఎన్నికల తరువాత, నాగం జనార్ధన్ రెడ్డి, ఆక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నాగం, చంద్రబాబుతో భేటీ ఎందుకు అయ్యారా అనే ఆసక్తి నెలకొంది. నాగం జనార్ధన్ రెడ్డి, చాలా ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మంత్రిగా కూడా పని చేసారు. మరో పక్క తెలంగాణా తెలుగుదేశం పార్టీ నాయకులు, కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌గౌడ్‌, కోడెల శివప్రసాదరావు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా చంద్రబాబుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు.

ఒక కట్టడటం కట్టాలి అంటే, ఎంతో కష్టపడాలి. అదే కూల్చాలి అంటే, రాత్రికి రాత్రి తోసి అవతల పడేయవచ్చు. చంద్రబాబు ఎంతో కష్టపడి, ప్రజల నుంచి వినతలు తీసుకోవటానికి, సమీక్షలు జరపటానికి, కట్టిన ప్రజా వేదికను, జగన్ ప్రభుత్వం రాగానే, రాత్రికి రాత్రి కూల్చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అవినీతి చేసారు, అక్రమ కట్టడం అంటూ కూల్చే పడేసారు. అయితే, ఈ నిర్ణయం పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. చక్కని బిల్డింగ్, వాడుకోవటం ఇష్టం లేకపోతే, ఏ హాస్పిటల్ గానో, ఇంకా దేనికో దానికి ఉపయోగించు కోవచ్చు కదా, ఇలా కూల్చేటం ఏంటి అని ప్రశ్నించారు. మీకు దమ్ము ఉంటే, కరకట్ట మీద ఉన్న ప్రైవేటు భవనాలు కూడా కూల్చాలి, అంటూ వాదనలు వినిపించాయి. దీంతో ప్రజల్లో మరింత వ్యతిరేకత రాకుండా, కరకట్ట మీద ఉన్న వారికి నోటీసులు ఇచ్చారు. వారంలో సమాధానం చెప్పాలని, లేకపోతే చర్యలు తీసుకుంటాం అని. అయితే అన్ని అనుమతులు, వైఎస్ఆర్ హయంలో ఇచ్చిన విషయం ప్రస్తుత ప్రభుత్వానికి తెలిసినా, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చెయ్యటం కోసం, నోటీసులు ఇచ్చారు.

అయితే ఈ నోటీసుల పై, కరకట్ట మీద ఉన్న బిల్డింగ్ యజమానాలు అందరు కోర్ట్ కు వెళ్లారు. సీఆర్‌డీఏ మూడు వారల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకో కూడదు అని, సీఆర్‌డీఏ ని కూడా ప్రమాణ పత్రం దాఖలు చెయ్యాలని కోర్ట్ కోరింది. తాము అన్నీ పక్కాగా చేసామని, అయినా నోటీసులు ఇచ్చారని, చందన కేదారిష్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీని పై వాదనలు వినిపిస్తూ, ఈ భవనం 2006లో నిర్మించామని, నోటీసు ఇచ్చే అధికారం సీఆర్‌డీఏ క్యాపిటల్‌ సిటీ జోన్‌ కమిషనర్‌కు లేదని చెప్పారు. సీఆర్‌డీఏ చట్టం-2014 రాకముందే, ఇక్కడ నిర్మాణాలు చేసామని చెప్పారు. నోటీసును నిలుపుదల చెయ్యాలని కోరారు. ప్రభుత్వం కూడా దీని పై వాదిస్తూ, ఏదైనా ఉంటె అప్పీలేట్‌ అథార్టీ దగ్గరకు రావాలని, హైకోర్ట్ కు రాకూడదని వాదించారు. వాదనలు విన్న కోర్ట్, అఫిదివిట్ దాఖలు చెయ్యమని కోరుతూ, నోటీసుల పై మూడు వారల స్టే విధించింది.

రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 45 రోజులు అవుతుంది, అప్పుడే మంత్రుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకునే దాక వెళ్లారు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వం తప్పులు చేసిందని, మేము అన్ని విధాలుగా చూసుకుంటాం అని ప్రజలను నమ్మించి, ఓట్లు వేసుకుని, ఇప్పుడు వారి చావులకు కారణం అవ్వటం, నిజంగా ఆందోళనకరం. మచిలీపట్నంలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నంలో నివసిస్తున్న జయలక్ష్మి అనే మహిళ, మంత్రి పేర్ని నాని తన చావుకు కారణం అంటూ సూసైడ్ లెటర్ రాసి, ఆత్మహత్యాయత్నం చేసారు. అయితే ఆమెను వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. జయలక్ష్మీ సూసైడ్ నోట్ ప్రకారం, మంత్రి పేర్ని నాని, మట్టా తులసి తనను వేధిస్తున్నారంటూ, ఇలాంటి బ్రతుకు తనకు వద్దు అని లేఖ రాసి నిద్ర మాత్రలు మింగారు.

nani 13072019 2

ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆంధ్రా హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. చికిత్స మొదలు పెట్టిన డాక్టర్లు, 24 గంటలు గడిస్తే కాని ఏమి చెప్పలేమని చెప్పారు. ఆమె సూసైడ్ నోట్ లో, ఈ ప్రభుత్వం ఒక ఆడదాని మీద కక్ష కట్టింది. మంత్రి పేర్ని నాని, ఒక ఆడ పిల్ల మీద కక్ష సాధింపు చేసే నాయుకుడు. నా చావుకి, పేర్ని నాని, మట్టా తులసి, అంగన్ వాడీ టీచర్ యేసు కుమారి, ఆశ వర్కర్ వెంకటేశ్వరమ్మ కారణం. వీరు నన్ను బ్రతకనివ్వటం లేదు. అందుకే చచ్చిపోవాలి అనుకుంటున్నా. నా భర్తను బాగా చూసుకోండి అంటూ లేఖ రాసారు. అయితే, ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మంత్రి దీని పై ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.

జగన్ ఆప్తుడు, వైసిపీ నెంబర్ 2 లీడర్, రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయి రెడ్డి పై తెలుగుదేశం పార్టీ, రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యెక ప్రతినిధిగా నియమిస్తూ, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై, ఆయన ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ పదవిని, 13 రోజులు అనుభవిస్తూనే, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, అందుకే ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు, తెలుగుదేశం పార్టీ పిటీషన్ సమర్పించింది. రాజ్యాంగం లోని 102వ షడ్యుల్ ప్రకారం, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వారు, ఎవరూ, కేంద్ర ప్రభుత్వం, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో, లాభం వచ్చే పదవుల్లో ఉండ కూడదు అని, ఆ రూల్ ని అధిగమించి, 13 రోజుల పాటు ఆ పదవిలో ఉన్నారు కాబట్టి, విజయసాయి రెడ్డి పై అనర్హత పిటీషన్ వెయ్యాలని, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు, గళ్ళ జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌, కేశినేని నాని, సంతకం చేసి, రాష్ట్రపతికి పిటీషన్ సమర్పించారు.

ఈ పిటీషన్ సమర్పణ తరువాత, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ మీడియా ముందుకు వచ్చారు. జూన్‌ 22 న విజయసాయి రెడ్డిని, ఢిల్లీలో ఏపి ప్రత్యెక ప్రతినిధిగా నియమించారని, అప్పటి నుండి విజయసాయిరెడ్డి కేబినెట్‌ మంత్రి హోదా అనుభవిస్తూ, ఆయనకు ఏపీ భవన్‌లో కారు, డ్రైవర్‌, కార్యాలయం కేటాయించారని చెప్పారు. భారత రాజ్యాంగంలోని 103వ షడ్యుల్ ప్రకారం, పార్లమెంట్ సభ్యుడుని అనర్హుడిగా ప్రకటింటే అధికారం ప్రెసిడెంట్ అఫ్ ఇండియాకు ఉందని చెప్పారు. రూల్స్ ప్రకారం రాష్ట్రపతి తన నిర్ణయం ప్రకటించే ముందు, భారత ఎన్నికల కమిషన్‌ సూచనలు తీసుకుంటారని అన్నారు. 13 రోజులు పదవిలో ఉన్న తరువాత, అనర్హత వేటు పడుతుందని గ్రహించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినన్స్ తెచ్చి, ఈ పదవి లాభాపేక్ష పదవి కాదని చెప్పారని అన్నారు. అయినా సరే 102వ షడ్యుల్ ప్రకారం అనర్హత వేటుపడుతుందని రాష్ట్రపతికి వివరించినట్లు తెలుగుదేశం సభ్యులు చెప్పారు. మరి రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read