రాష్ట్ర డీజీపీ పై, తెలుగుదేశం పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. జగన్ చెప్పినట్టు ఆడుతూ, చట్టాలను తుంగలోకి తోక్కుతున్నారని, టిడిపి కార్యకర్తలను టార్గెట్ చేస్తూ, టిడిపి ఇచ్చిన కంప్లైంట్ లు కూడా తీసుకోవటం లేదని, డీజీపీ, జగన్ చెప్పినట్టు ఆడుతున్నారని, టిడిపి ఆరోపిస్తుంది. చంద్రబాబు కూడా, డీజీపీ పై ఘాటుగా స్పందించారు. అయితే ఈ రజు, విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ , ఆ వ్యాఖ్యల పై స్పందించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనను కలవటానికి, వచ్చిన సమయంలో తాను ఇతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల వారిని కలవలేకపోయానన్నారు. అయినా వారిచ్చిన ఫిర్యాదు, మీడియాతో పాటు సోషల్ మీడియా ద్వారా తాను చూశానని వెల్లడించారు. తాను వినయపూర్వకమైన ఓ ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమేనని, తనకు తెలిసిందల్లా ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయడమేనని డీజీపీ వ్యాఖ్యానించారు.

dgp 19102019 2

రాజకీయ ఆరోపణలతో తనకు సంబంధం లేదని, అందులో తనకు పాత్ర కూడా లేదని గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టంచేశారు. నిన్న చంద్రబాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, "ఫిర్యాదు చేసేందుకు టిడిపి నాయకులు వెళ్తే డిజిపి ఉండరా..? అదే వైసిపి వాళ్లు ముగ్గురు వెళ్తే ఉంటారు,అక్కడే ప్రెస్ మీట్ పెడతారా..? డిజి ఆఫీసులోనే మీసాలు మెలేసి టిడిపి నేతలను హెచ్చరిస్తారా..?అది డిజిపి ఆఫీసా, వైసిపి ఆఫీసా..? 14ఏళ్లు సీఎంగా, 11ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్ననాకు నోటిసు పంపిస్తానని డిజిపి అంటారా..? వైసిపి నేతల బారినుంచి తమను తాము కాపాడుకోలేని దుస్థితిలో పోలీసులు ఉంటే ఇక ప్రజలను ఏం కాపాడతారనే చర్చ జరుగుతోంది. కరడుగట్టిన నేరస్తుల ట్రైనింగ్ లో పోలీసులు పనిచేస్తున్నారనే అపవాదు వస్తోంది." అని చంద్రబాబు అన్నారు.

dgp 19102019 3

"మీడియా ఆంక్షలపై మంత్రి పేర్నినాని నంగినంగిగా మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు కేబుల్ ఆపరేటర్లతో మీటింగ్ లు పెట్టి బెదిరించారు. ట్రాయ్, టిడి శాట్ ఉన్నాయని చెప్పినా, రాష్ట్రంలో అమలు చేయాల్సింది మేమే అంటారా..? ఆ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛలేదా, ప్రజాస్వామ్యం లేదా..? తోలు మందమా..? ఇలాంటి రాక్షసులు వస్తారనే రెగ్యులేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఛానళ్లు కావాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లెక్కి ఆందోళను చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం చెప్పాయి. అడిగితే సమాధానం చెప్పరు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఇష్టానుసారం తప్పుడు పనులు చేయడానికా మీ సబ్ కమిటిలు..? సాంకేతిక సమస్యలు ఉన్నాయని ట్రిబ్యునల్ కు చెబుతారా..? పోదాం రండి ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూపించండి. ఛానళ్ల నిలిపివేతపై ఎక్కడికక్కడ వినియోగదారులు డిమాండ్ చేయాలని పిలుపిస్తున్నాం." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read