ప్ర‌స్తుతం సోష‌ల్మీడియాలో వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌కేసులో అవినాశ్ రెడ్డి విచార‌ణ అంశాలే హైలైట్ అవుతున్నాయి. ఆంధ్ర‌జ్యోతి రాసిన క‌థ‌నంపై వైసీపీ పెద్ద‌లు మాట్లాడుతూ బాత్రూం తొంగి విన్నాడా అంటూ వేళాకోళం చేసినా, రాసిన ప్ర‌తీ అక్ష‌ర‌మూ స‌త్య‌మైంది. అవినాష్ కాల్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. దీనిపై వైవీ సుబ్బారెడ్డి వివ‌ర‌ణ ఇస్తూ ``వ‌దిన భోజ‌నం చేసిందా? ఏం కూర వండిందో `` అని అడ‌గ‌డం త‌ప్పా? అంటూ స‌మ‌ర్థించుకున్నారు. వేకువ‌న 3 గంట‌ల‌కి ఏ మ‌రిదీ త‌న వ‌దిన‌కి ఇలా ఫోన్ చేసి భోజ‌నాల గురించి, బాగోగుల గురించి అడ‌గ‌డు, అలాగే ఒక సారి భోజ‌నం గురించి అడ‌గాలి కానీ వంద‌సార్లు ఫోన్ చేసి భోజ‌నం గురించి అడ‌గ‌రు క‌దా అనే అనుమానాల‌ను నెటిజ‌న్లు రైజ్ చేశారు. వివేకా చ‌నిపోయార‌ని అప్పుడే తెలిస్తే వ‌దిన‌, అన్న‌తో చాలా క‌ష్ట‌ప‌డి మాట్లాడిన అవినాశ్ వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత‌కి ఎందుకు కాల్ చేసి స‌మాచారం ఇవ్వ‌లేద‌నేది మ‌రో అంతుబ‌ట్ట‌ని మిస్ట‌రీ. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బాబాయ్ చ‌నిపోయాడ‌ని స‌మాచారం ఇస్తే, ఆయ‌న త‌న భార్య‌కి చెబుతాడు క‌దా! న‌వీన్ కి వంద‌సార్ల‌కి పైగా కాల్ చేసి చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంది అనేది ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న అంశం...

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌తో వైసీపీలో టెన్ష‌న్ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. రోజుకో ప్రెస్మీట్ తో వైసీపీకి చెందిన కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి స్వ‌ప‌క్షాన్ని ఇర‌కాటంలోకి నెడుతున్నాడు. నెల్లూరు వైసీపీ నేత‌ల్ని కోటంరెడ్డిపైకి ఉసిగొల్పితే..ఒక‌రి బాగోతాలు ఒక‌రికి తెలియ‌డంతో ఎదురుదా-డికి భ‌య‌ప‌డుతున్నారు. వారు త‌ప్పించుకున్నా త‌న‌కు త‌ప్ప‌దు క‌దా అనే ధోర‌ణిలో స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న‌దైన శైలిలో కోటంరెడ్డిపై బుర‌ద చ‌ల్లేసి మీడియాకి వ‌దిలేశాడు. కందిరీగ ప‌ట్టుని క‌దిపి వ‌దిలిన‌ట్ట‌య్యింది స‌జ్జ‌ల ప్రెస్మీట్‌. స‌జ్జ‌ల తాను వేసిన బౌన్స‌ర్ల‌కి కోటంరెడ్డి హ‌డలిపోతాడ‌నుకుంటే..కోటంరెడ్డి ఎగిరెగిరి సిక్సులు కొట్టాడు. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి భారీగా ప్యాకేజీలు తీసుకుని మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టాడ‌ని ధ్వ‌జం ఎత్తాడు. తాము రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్పుడు, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడూ వెంటే ఉన్నామ‌ని...అప్పుడు స‌జ్జ‌ల త‌న‌యుడు భార్గ‌వ‌రెడ్డి ఎక్క‌డున్నాడంటూ నిల‌దీశాడు. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆదేశాల‌తోనే బోరుగ‌డ్డ అనిల్ త‌న‌కి ఫోన్ చేసి బెదిరించాడ‌ని, భ‌య‌ప‌డేదే లేద‌న్నారు. నువ్వు మామూలు ఫోన్ కాల్స్ చేయిస్తావు స‌జ్జ‌లా, నేను త‌లుచుకుంటే నీకు నెల్లూరు నుంచి వీడియో కాల్స్ వ‌స్తాయంటూ గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సోష‌ల్మీడియాని త‌న క‌నుస‌న్న‌ల్లోకి తెచ్చుకున్న స‌జ్జ‌ల త‌న‌యుడు స‌జ్జ‌ల భార్గ‌వ‌రెడ్డి త‌న‌ని ల‌క్ష్యంగా  దుష్ప్ర‌చారం చేస్తుండ‌డాన్ని స‌వాల్ విసిరారు. వ‌ర‌స ప్రెస్మీట్ల‌తో కోటంరెడ్డి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై విరుచుకుప‌డ‌టంతో తోక‌ముడిచి, ఇత‌ర నేత‌ల్ని ఉసిగొల్పుతున్నారు.

తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం చ‌విచూశాక టిడిపి టికెట్ పై గెలిచి వైసీపీలోకి న‌లుగురు ఎమ్మెల్యేలు జంప్ కొట్టారు. మ‌రొక‌రు మౌనం దాల్చారు. అప్ప‌టికి వైసీపీకి తిరుగులేద‌ని, టిడిపి వ‌చ్చే ఎన్నిక‌ల‌కూ పుంజుకోద‌ని వీరు భావించారు. వ్యాపారాలు, ఆస్తులు కాపాడుకోవ‌డానికి, కేసుల నుంచి ర‌క్ష‌ణ‌గా ఉంటుంద‌ని..అధికార పార్టీ అండ‌గా అక్ర‌మాలు చేయొచ్చ‌నే ల‌క్ష్యంతో వైసీపీలో చేర‌కుండానే వైసీపీ ఎమ్మెల్యేలుగా కొన‌సాగుతున్నారు. టిడిపి నుంచి ఎవ‌రైనా త‌న పార్టీలో చేరాలంటే రాజీనామా చేయాలంటూ పులిలా గ‌ర్జించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డివి పులిహోర క‌బుర్లేన‌ని టిడిపి ఎమ్మెల్యేల‌ను రాజీనామా చేయ‌కుండానే త‌న పార్టీలోకి తీసుకున్నారు. తెలుగుదేశంలో ఉంటూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తూ వ‌చ్చిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీలో చేర‌తాడ‌ని అంద‌రూ ఊహించారు. అయితే అన్నం తినేవాడెవ‌డూ వైసీపీలో చేర‌డంటూ స్టేట్మెంట్ ఇచ్చిన వంశీ, అన్నం తిన‌డం మానేశాడేమో వైసీపీలో చేరాడు. అప్ప‌టి నుంచీ టిడిపిపైనా, చంద్ర‌బాబుపైనా, ఆయ‌న భార్య‌పైనా, లోకేష్ పైనా, ఆయ‌న భార్య‌పైనా చాలా అస‌భ్య‌మైన కూత‌లు కూస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో ఇక్క‌డ టిడిపి బ‌ల‌మైన అభ్య‌ర్థిని రంగంలోకి దింప‌డంలో విఫ‌ల‌మైంది. అయితే అనూహ్యంగా వైసీపీలో వంశీకి యార్ల‌గ‌డ్డ‌, దుట్టాల నుంచి తిరుగుబాటు ఎదురైంది. వ‌ల్ల‌భ‌నేని వంశీ అనే న‌టోరియ‌స్ ని ఎదుర్కోవాలంటే తాము క‌ల‌వ‌క త‌ప్ప‌ద‌ని యార్ల‌గ‌డ్డ‌, దుట్టా డిసైడ‌య్యారు. త‌న‌కు పోటీనిచ్చే స‌రైన అభ్య‌ర్థి టిడిపి దొర‌క‌డ‌నే ధీమాలో ఉన్న వంశీకి వైసీపీలోనే ఉక్క‌పోత సృష్టించారు. వైసీపీలో మూడువ‌ర్గాల పోరుని వాడుకుంటే ఇక్క‌డ టిడిపికి బాగా క‌లిసి వ‌స్తుంద‌ని టిడిపి కేడ‌ర్ ఆశాభావంతో ఉన్నారు. కేసులు, కేసినోలు, హైద‌రాబాద్ ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం వైసీపీలో చేరితే..వైసీపీ వాళ్లే త‌న‌తో ఆడుకుంటుండ‌డంతో తీవ్ర ఒత్తిడిలో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఉన్నారు.

leaders 0202022023 2

విశాఖ ద‌క్షిణం నుంచి గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్ వైసీపీలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, బ‌య‌ట‌ప‌డ‌లేని దుస్థితి. త‌న‌పై ఓడిపోయిన వైసీపీ అభ్య‌ర్థిదే పెద్ద‌రికం. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ సీతంరాజు సుధాక‌ర్‌ని మొహ‌రించింది వైసీపీ. సొంత‌గూటికి వ‌ద్దామ‌నుకున్నా టిడిపి గండి బాబ్జీ వంటి గ‌ట్టి కేండిడేట్ని నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జిగా వేసేసింది. చీరాల నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం, వైసీపీలో చేరాక బ‌ల‌హీన‌రాం అయ్యారు. టిడిపిలో ఉన్న‌ప్పుడు నిత్య అసంతృప్తి వాదిగా ఉండే క‌ర‌ణం..వైసీపీలో త‌న ఆట‌లు సాగ‌వ‌ని మౌనంగానే బ‌తిమాలుకుని త‌న ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. కొడుకుకి సీటు కోసం చేరితే అది ద‌క్కే అవ‌కాశం లేద‌ని, ఇటు చీరాల సీటూ పోతుల సునీత బీసీ కోటాలో త‌న్నుకుపోయే చాన్స్ ఉంద‌ని క‌ర‌ణం క్యాంపులో ఆందోళ‌న నెల‌కొంది. ఇక గుంటూరు ప‌శ్చిమ టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన మ‌ద్దాలి గిరి వైసీపీలో చేరాక కూర‌లో క‌రివేపాకు అయ్యార‌ని ప్ర‌చారం సాగుతోంది. వైసీపీ అభ్య‌ర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఏసుర‌త్న‌మే అన్నీ చూసుకుంటున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గిరికి సీటు కూడా క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. టిడిపికి దూరంగా ఉంటూ వైసీపీలో చేరాలని విశ్వ‌ప్ర‌య‌త్నం చేసి విఫ‌ల‌మైన విశాఖ ఉత్త‌ర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు..మ‌ళ్లీ టిడిపి త‌లుపు త‌ట్టారు. కానీ గ‌తంలాగ టిడిపిలో గంటా ప‌వ‌ర్ పాలిటిక్స్ చేసే సీను ఉండ‌క‌పోవ‌చ్చని ప్ర‌చారం సాగుతోంది. మొత్తానికి టిడిపి వీడి వైసీపీలో చేరిన ఈ ఎమ్మెల్యేల‌కు కొన్ని ప్యాకేజీలు ద‌క్క‌డం, కేసుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డం మిన‌హాయించి వ‌చ్చే ఎన్నిక‌ల‌కి భ‌విష్య‌త్తు మాత్రం లేద‌ని స‌మీక‌ర‌ణాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

ల‌క్ష్మీపార్వ‌తి అంటే తెలియ‌ని వారు తెలుగురాష్ట్రాల్లో లేరు. ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌వేశించిన నుంచీ నేటివ‌ర‌కూ నిత్య‌మూ వివాదాల‌కు కేంద్ర‌బిందువు. ఇటీవ‌ల కాలంలో ఆమె నోటి మాట ద్వారా కూడా బాగా పాపుల‌ర్ అయ్యారు. తెలుగుని సంస్కృతంని క‌లిపి అకాడ‌మీ ఏర్పాటు చేయ‌డాన్ని స‌మ‌ర్థిస్తూ, ఆ రెండుభాష‌లు పేక‌ముక్క‌ల్లా క‌లిసిపోతాయంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాలు ప‌డ‌గొడుతుంటే అడ‌గ‌డంలేదేమ‌ని ఒక అభిమాని ఫోన్ చేస్తే ``ఫోన్ పెట్ట‌రా, లం...కొడ‌కా`` అంటూ త‌న భాషా ప‌టిమ‌ని చూపించారు. ఇటీవ‌ల మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య‌తో క‌ల‌క‌లం రేపారు. 26 ఏళ్లుగా ఒంట‌రిగా ఉంటున్న త‌న‌కు జ‌గ‌న్ కొత్త జీవితం ప్రసాదించాడ‌ని వైసీపీ ఫ్యాన్స్‌యే కాదు తెలుగు ప్ర‌జ‌లంతా అవాక్క‌య్యే స్టేట్మెంట్ ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ల‌క్ష్మీపార్వ‌తి వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌పై మాట్లాడారు. ఎవ‌రైనా సొంత కుటుంబ‌స‌భ్యుల్ని చంపుకుంటారా? అని మీడియాని ఎదురు ప్ర‌శ్నించింది. బాబాయ్ అంటే జ‌గ‌న్ కి ప్రాణం అంటూ చెప్పుకొచ్చింది. త‌మ కుటుంబ‌స‌భ్యుల్ని తామే హ‌-త్య‌చేస్తారా అని అమాయ‌కంగా ప్ర‌శ్నించింది. ఎన్టీఆర్ మ‌ర‌ణానికి కుటుంబ‌స‌భ్యులే కార‌ణ‌మ‌ని, చంద్ర‌బాబే చంపించేశాడ‌ని ప్ర‌తీ రోజూ ఆరోపించే ల‌క్ష్మీపార్వ‌తి వ‌ద్దే ఎన్టీఆర్ ప్రాణం విడిచారు. వివేకాని ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు ఎలా చంపుకుంటార‌న్న ఆమె, ఎన్టీఆర్ విష‌యంలో చేస్తున్న‌వి త‌ప్పుడు ఆరోప‌ణ‌లేన‌ని తానే ఒప్పుకున్న‌ట్ట‌య్యింది. అవినాశ్ రెడ్డి ఏమో కానీ, జ‌గ‌న్ రెడ్డి వివేకాని హ‌-త్య చేసి వుండ‌డ‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా లక్ష్మీపార్వ‌తి వైసీపీని బుక్ చేసిన‌ట్ట‌య్యింది.

Advertisements

Latest Articles

Most Read