ఎవరు చెప్పినా వినని ఆంధ్రప్రదేశం ప్రభుత్వం, మూడు రాజధానుల దిశగా ముందడుగులు వేస్తుంది. మూడు రాజధానులు అమలు చేయాలని నిర్ణయానికి కట్టుబడి తదనుగుణంగా కార్యచరణ చేపట్టింది. ఇటీవలే మూడు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని విస్తరించింది. ఈ క్రమంలో న్యాయ రాజధానిగా కర్నూలును సంసిద్ధం చేస్తుంది. శాసన రాజధాని అమరావతిలో,పరిపాలనా రాజధాని విశాఖపట్టణంలో, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా, అభివృద్ధి వికేంద్రీకరణ కాకుండా, పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ చేయడం ద్వారా రాష్ట్రమంతటా సమతుల్యంగా అభివృద్ధి జరుగుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. అదే విషయాన్ని బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా జగన్ స్పష్టం చేసారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఓటింగ్ లో ఆమోదించ బడిన ఈ బిల్లును శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి పంపించారు. రాజకీయంగా సంచలనం సృ ష్టించిన ఈ పరిణామాన్ని జగన్ తీవ్రం గానే తీసుకుంది.

kurnool 0202020 2

తన నిర్ణయానికే ఎదురు తిరగరాని, దాంతో ఈ క్రమంలో శాసనసభ ఏకంగా మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ బిల్లు కేంద్రం పరిశీలనలో ఉంది. మరో పక్క ఈ మూడు రాజధానుల పై రైతులు హైకోర్టులో ఫిర్యాదు చేసారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాజధానిలో కార్యాలయాలను వేటిని తరలించవద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే ఆ ఖర్చుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుం దని భావించారు. అయితే ఈ క్రమంలో రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను వెలగపూడి సచివాలయం నుంచి కర్నూలుకు తరలించాలని, రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చెయ్యటం సంచలనంగా మారింది. ఇకపై ఆ రెండు కార్యాలయాలు కర్నూలు నుంచి పనిచేస్తాయి. ఈ రెండు కార్యాలయాలు మరో వారం రోజులలోపు తమ కార్యాలయాల కార్యనిర్వహణను కర్నూ లు నుంచి మొదలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు.

kurnool 0202020 3

శుక్రవారం అర్ధరాత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ ఉత్తర్వులను ఇచ్చారు. ఈ రెండు విభాగాల అధికా రులు ఇప్పటికే కార్యాలయాల ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారంటున్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు దిశలో భాగంగా ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుందంటున్నారు. ఇందుకు న్యాయవరంగా ఎటువంటి కోర్టు దిక్కారణ వంటి అంశాలు తలెత్తకుండా న్యా యనిపుణుల సలహాలను తీసుకుని ఈ చర్యను చేపట్టినట్లు చెబుతున్నారు. అయితే ఒక పక్క కోర్ట్ స్పష్టంగా, ఏ ఒక్క కార్యాలయం తరలించవద్దు అని ప్రభుత్వానికి చెప్పి, ఖర్చులు మీ నుంచే వసూలు చేస్తాం అని చెప్పినా, ప్రభుత్వం మాత్రం కోర్ట్ ని కూడా పట్టించుకోవటం లేదు అనే వాదన వినిపిస్తుంది. మరి కోర్ట్, ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

రాష్ట్ర రాజకీయ పరిణామాలపై బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. నిన్న మొన్నటి దాకా తెలుగుదేశంతో సమానంగా ప్రభుత్వంపై కాలుదువ్విన రాష్ట్ర సాయి నేతలు ఇప్పుడు మౌనరాగం ఆలపి స్తున్నారు. ఏదైనా మాట్లాడాల్సివచ్చినా అరకొరగా మాట్లాడి సరిపెడుతున్నారు. పార్టీ అధిష్టానం పంపించిన సంకేతాలకు అనుగుణంగానే మౌనం పాటిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ అభీష్టం, నిర్ణయానుసారంగా అనివార్యంగా చోటుచేసుకునే పరిణామాల పట్ల వ్యూహాత్మకంగా వ్యవహరించటమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. బిజెపి జాతీయ స్థాయి విధానం శాసనమండలి వ్యవసకు అనుకూలంగా లేదు. మూడు రాజధా నులపై చంద్రబాబుతో సమానంగా వ్యతిరేకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిలు కూడా స్వరం తగ్గించారు. ఫిబ్రవరి 2న 'అమరావతి'కి మద్దతుగా జనసేనతో కలిసి విజయవాడలో తలపెట్టిన 'కవాతు' రద్దు కావటం కూడా పార్టీలో చర్చనీ యాంశంగా మారింది.

కవాతును వాయిదా వేస్తున్నట్టు బిజెపి అధికారికంగా ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అనుగుణంగా అక్కడి నేతలు స్పందించినా 'మూడు రాజధానుల' విషయంలో తటస్త వైఖరి అవలంబించాలన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టు పార్టీ వర్గాలు భావిస్తున న్నాయి. దీనికి ప్రధాన కారణం..రాయలసీమ, ఉత్తరాంధ్ర బిజెపి నేతల నుంచి అధిష్టానానికి అందిన ఫిర్యాదులు, వినతులే కారణమని సమాచారం. అందు వల్లనే విశాఖపట్టణం కేంద్రంగా బిజెపి వ్యవహారాలు చూస్తున్న నేతలెవరూ 'అమరావతి' గురించి ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. బిజెపి గతంలో ప్రకటించిన 'రాయలసీమ డిక్లరేషన్'కు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతా మని కొందరు ప్రశ్నించినట్టు సమాచారం.

అమరావతిలోనే ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంచాలని బిజెపి ఉద్యమం చేస్తే రాయలసీమ డిక్లరేషన్ గురించి భవిష్యత్ లో కూడా మాట్లాడే అవకాశం బీజేపీకి ఉండదని కొందరు అభిప్రాయపడినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఒక వైపు టీడీపీకీ, మరో వైపు వైసీపీకీ సమాన దూరం పాటించటం ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బలోపే తమయ్యేందుకు కార్యా చరణ రూపొందిం చాలనుకుంటున్న బిజెపి ఢిల్లీ ఎన్నికల తరువాత రాష్ట్రం లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమతో కలిసి రావటం బిజెపికి అందివచ్చిన మంచి అవకాశమని అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు ఉమ్మడి కార్యాచరణ అత్యంత పకడ్బందీగా ఉండేలా వ్యూహ రచన చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం గత 45 రోజులుగా జరుగుతున్న ఆందోళన శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. అధికార వైసీపీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వచ్చి రైతులతో సంప్రదింపులు జరుపుతుందని ఆయన వెల్లడించారు. రైతులందరూ ప్రభుత్వ కమిటీ ఎదుట తమ అభిప్రాయాలు చెప్పాలని ఆయన సూచించారు. మండంలో దీక్షా శిబిరం వద్దకు శుక్రవారం మధ్యాహ్నం ఎంపీ వెళ్లారు. మందడంలో పలువురు రైతులు శుక్రవారం నుంచి 24 గంటల పాటు నిరాహార దీక్షకు ఉపక్రమించారు. ఆ దీక్షా శిబిరానికి వెళ్లిన శ్రీకృష్ణదేవరాయలు అక్కడే కొద్దిసేపు కూర్చుని, రైతులతో మాట్లాడారు. పలువురు మహిళా రైతులు సైతం తమ వాదన వినిపించారు. అనంతరం మైకు తీసుకొని రైతులనుద్దేశించి ప్రసంగం ప్రారంభించగానే, రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. రైతుల నినాదాల హోరులోనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తన ప్రసంగాన్ని ముక్తసరిగా ముగించారు.

amaravati 010202020 2

రైతుల కష్టాలు తమకు తెలుసనీ, భూములు ఇచ్చిన రైతులేవరికీ అన్యాయం జరగదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వ కమిటీ వచ్చినప్పుడు రైతులందరూ తమ అభిప్రాయాలు చెప్పాలని, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అయితే రైతులు ముందుగా అమరావతికి అనుకూలమా? కాదా ? చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిని కొనసాగిస్తూనే తమతో చర్చకు రావాలని రైతులు శ్రీకృష్ణదేవరాయలుతో స్పష్టం చేశారు. అయితే ఇది ఇలా ఉంటే, వైసీపీ ఎంపీ నిన్న వెళ్ళటం పై, పలు సందేహాలకు తావు ఇస్తుంది. మొన్నటి దాక అమరావతి రైతులను, పైడ్ ఆర్టిస్ట్ లు, అమరావతి ప్రాంతం ఒక ఎడారి, అమరావతి ప్రాంతం ఒక స్మశానం అంటూ హేళన చేసిన వైసీపీ, ఇప్పుడు అదే రైతుల దగ్గరకు, తమ ఎంపీని పంపించటం పై, పలు సందేహాలు వస్తున్నాయి.

amaravati 010202020 3

దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఎంపీని రాయబారానికి పంపారా ? లేక రైతుల్లో చీలక తేవటానికి పంపారా అనే సందేహాలు వస్తున్నాయి. ప్రభుత్వం తరుపున, రైతులతో సయోధ్య కోసం, ఎంపీ వచ్చినట్టుగా, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గురువారం, జగన్ మోహన్ రెడ్డిని, జాస్తి చలమేశ్వర్‌ తో కలిసి, ఆ మరుసటి రోజే అమరావతి రైతుల దగ్గరకు వచ్చారంటేనే, జరుగుతున్న విషయం ఏమిటో అర్ధమవుతుందని రైతులు అంటున్నారు. తాము ఏ చర్చలు అయినా, ఏ కమిటీ అయినా, అమరావతి పూర్తీ స్థాయి రాజధానిగా కొనసాగుతుంది అని చెప్తేనే, వారితో చర్చిస్తామని తేల్చి చెప్పారు. వైసీపీ ఎంపీ ఇక్కడకు రావటం వెనుక మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వం తరుపున చర్చలకు రైతులని సిద్ధం చెయ్యటం, రెండు రైతుల్లో చీలక తేవటం, మూడు పార్లమెంట్ లో ఈ అంశం పై టిడిపి లేవనెత్తితే, మేము వెళ్లి వారి సమస్యలు విన్నాం అని చెప్పటం కోసం. మరి ఈ మూడిట్లో దేని కోసం, వైసీపీ ఎంపీ వచ్చారో, కాలమే చెప్తుంది.

టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన ట్రావెల్ బస్సులను సీజ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఆయనకు సంబంధించిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. యాడికి మండలం కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాయి గనుల లీజులను ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి గతంలో 5 ఏళ్ల గడువు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం ఉపసంహరించుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఇప్పటి వరకు ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి పనులు ప్రారంభం కానందున ఈ గడువును రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు 38,212 సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తవ్వకాలు జరిపి రవాణా సాగించారని దీనిపై విచారణకు ఆదేశిస్తు న్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన బస్సులను ప్రభుత్వం సీజ్ చేసింది. ఇంటర్‌ పేజ్ క్యారియర్ పర్మిట్లలో అవకతవకలు ఉన్నాయని గుర్తించి 36 బస్సులతో పాటు మరో 18 బస్సుల కాంట్రాక్టును సైతం రద్దు చేసి సీజ్ చేసింది. బస్సుల సీజ్ అంశంలో ప్రభుత్వంపై ఆనాడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాజాగా సిమెంట్ కంపెనీ, మైనింగ్ లీజుల రద్దుపై జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందిం చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం కన్నా తన మైనింగ్ లీజుల రద్దు పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించారు. లీజుల రద్దు అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పగ పగ అంటూ రగిలిపోతుందని మాట వినని వారి మీద కక్ష తీర్చుకుంటుందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే ప్రభుత్వ లక్ష్యమని దీనినే ఫ్యాక్షనిజం అంటారని వ్యాఖ్యానించారు.

ఇది ఇలా ఉంటే, జేసీ దివాకర్ రెడ్డి, ఈ రోజు అమరావతి ప్రాంతంలో పర్యటించి, అక్కడ రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. జగన్ తాత అయిన రాజారెడ్డికి తనకు ఎవరైనా అడ్డు వస్తే, వాళ్లని పైకి పంపడం బాగా తెలుసని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అందరినీ ఒకేసారి పైకే పంపే ప్లాన్ వేసారని అన్నారు. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాట పడి, ఇప్పుడు దాన్ని కక్ష తీర్చుకోవటానికి ఉపయోగించుకుంటున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన పై కక్ష కట్టి, తన ఆర్ధిక మూలల పై దెబ్బ కొట్టాడని, రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ అమరావతి ప్రాంత రైతులకు చేసిన దాని కంటే, తనకు పెద్ద నష్టం ఏమి లేదని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read