ఆరు నెలల్లోనే భ్రమాస్త్రం వదిలాం, ఇక చంద్రబాబు పరిస్థితి అయిపొయింది, తెలంగాణాలో లాగా, ఎటూ కాకుండా పోతాడు, టిడిపి పార్టీ ఇక నామమాత్రమే అంటూ, మూడు రాజధానుల ప్రకటన రాగానే, వైసీపీ పార్టీలోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా ఉన్న అభిప్రాయం ఇది. చంద్రబాబు ఇప్పుడు కనుక మూడు రాజధానుల ప్రకటన స్వాగితిస్తే, అమరావతి రైతులని ముంచేస్తున్నాడు అంటూ, ప్రచారం చెయ్యొచ్చు, అప్పుడు కోస్తాలో దెబ్బ పడుతుంది. ఒక వేళ అమరావతికి సపోర్ట్ గా మాట్లాడితే, చంద్రబాబు రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి అని ప్రచారం చెయ్యొచ్చు. చంద్రబాబు ఏ స్టాండ్ తీసుకున్నా, చంద్రబాబుని, ఒక రెండు మూడు జిల్లాలకు పరిమితం చెయ్యొచ్చు అని ప్లాన్ వేసారు జగన్ అండ్ టీం. అయితే, ఆ ప్రకటన చేసి ఇప్పటికీ, 13 రోజులు అయ్యింది, అయినా జగన్ తలుచుకున్న దాంట్లో, కొంచెం కూడా టిడిపికి డ్యామేజ్ కాక పోగా, ఇటు వైసీపీకే ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీని అంతటికీ కారణం, సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు అని జగన్ భావిస్తున్నారు.

jagan 30122019 1

చంద్రబాబుని ఫిక్స్ చేసే విధంగా, ఆయా ప్రాంతాల వైసీపీ నేతలు, ప్రజల్లోకి తీసుకు వెళ్ళలేక పోయారని, జగన్ భావిస్తున్నారు. చివరకు విశాఖపట్నమే ఏపి రాజధాని అనే భావన కల్పించినా, ఎందుకో కాని విశాఖ ప్రజల్లో ఆ ఊపు కనిపించటం లేదు. విశాఖపట్నం ప్రజల్లో ఎందుకో కాని, సంతోషం కంటే, భయమే ఎక్కువ కనిపించింది. విశాఖలో పర్యటించిన జగన్ కూడా, ఎందుకో నిరాశగా కనిపించారు. చివరకు ఏమి ప్రసంగించకుండానే పర్యటన ముగించుకుని వెళ్ళిపోయారు. విశాఖ ప్రజల్లో ఈ నిర్లిప్తత ఎందుకు వచ్చిందో, ఇప్పటికీ వైసీపీకి అర్ధం కవటం లేదు. వన్ సైడ్ గా విశాఖలో ప్రజలు తమకు మద్దతు ఉంటారు అనుకుంటే, ఇలా అయ్యింది ఏమిటి అంటూ, వైసీపీలో అంతర్మదనం కొనసాగుతుంది.

jagan 30122019 1

ఇక రాయలసీమ ప్రజలు కూడా, హైకోర్ట్ తో పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు అనే భావనలో ఉన్నారు. అదీ కాక, సెక్రటేరియట్ కు వెళ్ళాలి అంటే, విశాఖకు వెళ్ళాలి అంటే 19 గంటలు పడుతుంది, ఇవన్నీ ఎలా సాధ్యం, అసలు వెనుకబడింది, రాయలసీమ కాబట్టి, రాజధాని మొత్తాన్ని రాయలసీలో పెట్టాలని, అప్పుడే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది అంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు వైజాగ్ లో కాని, ఇటు కర్నూల్ లో కాని, ఎక్కడా ప్రజలు స్వచ్చందంగా వైసీపీకి మద్దతు తెలపక పోగా, ప్రతి రోజు అమరావతి రైతుల ఆందోళన మాత్రం రాష్ట్రం అంతా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీలో అంతర్మదనం సాగుతుంది. ఈ పరిస్థితిని తమకు ఎలా అనుకూలంగా మలుచుకోవాలి అనే ఆలోచనతోనే, మొన్న క్యాబినెట్ లో అధికారిక ప్రకటన చెయ్యకుండా వాయిదా వేసారని తెలుస్తుంది.

విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని వస్తుంది అంటూ, గత 20 రోజులుగా వైసీపీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఈ ప్రతిపాదన చేసారు. అయితే, క్యాబినెట్ మీటింగ్ లో అధికారికంగా నిర్ణయమే ఫైనల్ అనుకున్న టైంలో, ఈ నిర్ణయం ప్రకటించటానికి, మరి కొంత సమయం పడుతుందని, బోస్టన్ కమిటీ నివేదిక వచ్చిన తరువాత, హై పవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. అయితే ఇది అనూహ్య పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే, అంతా ఫైనల్ అని అందరూ అనుకున్న టైంలో జగన్ వెనక్కు తగ్గారు. మరో పక్క విశాఖ ఉత్సవ్ లో పాల్గునటానికి వచ్చిన జగన్, కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడకుండ వెళ్ళిపోయారు. ఇవన్నీ చూస్తుంటే, ఏదో జరుగుతుంది అనే సందేహం అందరిలో వ్యక్తం అవుతుంది. ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకే జగన్ వెనక్కు తగ్గారని, త్వరలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని, అక్కడ అంతా వివరించి, దీనికి ఢిల్లీ స్థాయిలో కూడా మద్దతు సంపాదిస్తున్నారని తెలుస్తుంది.

visakha 30122019 2

అయితే ఇప్పుడు విశాఖకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న మరో షాకింగ్ నిర్ణయం, అందరినీ ఆశ్చర్య పరిచింది జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో విశాఖపట్నం గురించి ప్రస్తావిస్తూ, విశాఖకు పెద్దగా ఏమి చెయ్యనవసరం లేదని, విశాఖకు రోడ్లు వెడల్పు చేసి, ఒక మెట్రో ట్రైన్ వేస్తే సరిపోతుందని, మెట్రో ట్రైన్ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అదే మెట్రో ట్రైన్ పై దాఖులు అయిన బిడ్ ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్య పరిచింది. బిడ్ రద్దు చెయ్యటం కంటే, మరో డీపీఆర్ తయారు చెయ్యమని కోరటం, ఆశ్చర్యం. ఎందుకంటే, ఇప్పుడు విశాఖ మెట్రో రైల్ పై మరో డీపీఆర్ ని ఒక కన్సల్టన్సీ తయారు చెయ్యాలి అంటే, చాలా సమయం తీసుకునే అవకాసం ఉంటుంది.

visakha 30122019 3

వీళ్ళు డీపీఆర్ తయారు చేసి, బిడ్డింగ్ కు పిలిచి, పనులు అప్పగించాలి అంటే, అసలు ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, విశాఖను పరిపాలనా రాజధాని చెయ్యాలి అంటే, మెట్రో రైల్ లాంటివి వేస్తె సరిపోతుంది అని చెప్పటం, అయితే ఇప్పుడు ఆ మెట్రో కు వచ్చిన బీడ్ ను రద్దు చెయ్యటం చూస్తుంటే, ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడే కార్యరూపం దాల్చే అవకాసం లేదనే చెప్పాలి. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎస్సెల్ ఇన్ ఫ్రా సంస్ధ, ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. అయితే, ఒకే బీడ్ దాఖలు కావటం, ధర పైన చేసిన ప్రతిపాదనలకు, ఆ కంపెనీ ముందుకు రాక పోవటంతో, ఆ ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ, తాజాగా మరో డీపీఆర్ తయారీ కోసం కొత్త కన్సెల్టెంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురు అమరావతి రైతులను, గుంటూరు జిల్లా జైలులో చంద్రబాబు పరామర్శించారు. పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు, జైలులో ఆ రైతులను కలిసి, ధైర్యం చెప్పారు. అనంతరం, గుంటూరు జైలు బయట చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జడ్జి చీవాట్లు పెట్టిన తరువాత, రైతుల పై దొంగతం కేసు కింద ఇప్పుడు సెక్షన్లు బుక్ చేసారని, రాష్ట్ర రాజధాని కోసం, భూములు ఇచ్చిన రైతులు దొంగాలా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఒక టీవీ ఛానల్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసుకునే ఆ మీడియా, అమరావతి పై విషం చిమ్ముతుందని, అమరావతిలో కడుపు మండి ఆందోళన చేస్తున్న రైతులను, పైడ్ ఆర్టిస్ట్ లు అని, బిర్యానీ పొట్లాల కోసం చేస్తున్నారు అంటూ, ఆ ఛానెల్ వాళ్ళు మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్దతి కాదని అన్నారు. మీకు హైదరాబాద్ మీద ప్రేమ ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోండి కాని, ఇక్కడ అమరావతిని కించ పరిస్తే ఊరుకోమని అన్నారు.

cbn 30122019 2

ఇదే సందర్భంలో డీజీపీ పై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. డీజీపీ ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తున్నారని, నా పై రాళ్ళు వేసి కొడితే, భావ ప్రకటనా స్వేఛ్చ అంటూ చెప్పిన డీజీపీ, ఇప్పుడు ఎందుకు రైతుల పై దొంగతనం కేసు పెట్టారని, చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఏది చెప్తే అది, డీజీపీ చేస్తున్నారని, మండిపడ్డారు. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేస్తే, చూస్తూ కూర్చమని, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని, తరువాత మీరు రిటైర్డ్ అయినా, ఈ పాపం మొయ్యాల్సి ఉంటుందని, ఏదైనా చట్ట ప్రకారం చెయ్యండి కాని, ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం, తగిన మూల్యం వడ్డీతొ సహా చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఇలా అక్రమ కేసులు పెడితే ప్రజలు తగ్గి పోతారని మీరు అనుకుంటున్నారని, వాళ్ళు ఆవేదనతో ఉన్నారని, ఇంకా రెచ్చి పోతారని హెచ్చరించారు.

cbn 30122019 3

ఎప్పుడు రోడ్డు మీదకు రాని వాళ్ళు కూడా, ఈ రోజు రోడ్డు మీదకు వచ్చారని, రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా, ఇంతలా ఉద్యమం చెయ్యలేదని, ఇప్పుడు ఆవేదనతో రోడ్డున పడ్డారని అన్నారు. మీరు నిజంగా, రాజధాని మార్పు పై ప్రజలు సానుకూలంగా ఉన్నారని నమ్మితే, ఎన్నికలకు రండి, ఇక్కడ రాజధాని ఉండదు అని చెప్పండి, అంటూ చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పరువు పోయిందని, అందరూ పిచ్చి తుగ్లక్ అని తిడుతున్నారని, మన రాష్ట్రాన్ని కూడా తక్కువగా చూస్తున్నారని అన్నారు. దాడులుని నేను ఎప్పుడు సమర్ధించను అని, కనీ అదే సమయంలో, టీవీలు వారు కూడా, ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తే, చూస్తూ ఊరుకోమని, మీ మ్యానేజిమెంట్ కోసం, మీరు బలి పశువు కాకండి అంటూ, మీడియాను కూడా కోరారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రానికి చెందిన, వైసీపీ ఎమ్మెల్యే తమ భూమిలో, ఇది తన భూమి అంటూ బోర్డులు పెట్టారని, వంద కోట్లు విలువ చేసే ఈ స్థలం మాది అంటూ, ఏకంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలోనే కొంత మంది ఫిర్యాదు చెయ్యటం సంచలనంగా మారింది. వంద కోట్లు విలువ చేసే ఈ స్థలం విషయం పై, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భూమి నాది అని వైసీపీ ఎమ్మేల్యే చెప్పటం, కాదు ఇది మేము ఎప్పుడో కొనుక్కున్నాం అంటూ అవతలి వారు చెప్తూ, స్థలం కాగితాలు చూపిస్తూ ఉండటంతో, ఇప్పుడు ఈ వివాదం పై తెలంగాణా పోలీసులు నిజం ఏమిటి అనే దాని పై విచారణ చేసే పనిలో ఉన్నారు. తాము 20 ఏళ్ళ క్రితమే ఈ భూమి కొన్నాం అని వారు చెప్తుంటే, వైసీపీ ఎమ్మేల్యే తాను 2008లో కొన్నాని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం పై ఆసక్తి కర చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ లోని హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తుఫ్రాన్‌పేట వద్ద 40 ఎకరాలు భూమి ఉంది.

ycp 30122019 2

ప్రస్తుతం, ఇక్కడ ఎకరం రెండు కోట్లు పైనే ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం, ఈ భూమి కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి చెందిన భూమి అంటూ, బోర్డులు వెలిసాయి. అక్కడ ఇది వరకు 40 ఎకరాల భూమిలో వెంచర్‌ వేసి ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు. అయితే కొన్ని రోజుల క్రితం అక్కడ ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. అలాగే, లోపాలకి వెళ్ళే వీలు లేకుండా, కందకాలు తవ్వారు. దీంతో అక్కడ ఫ్లాట్లు కొన్న 828 మంది అవాక్కయ్యారు. ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి దగ్గర, జీపీఏ చేసుకొని 2000-2001 సంవత్సరంలో ప్లాట్లను విక్రయించారని, ఆ ప్లాట్ ఓనర్లు చెప్తున్నారు. ఇవి కొన్న వాటిలో, ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్తున్నారు.

ycp 30122019 3

అయితే తాము 20 ఏళ్ళ క్రితమే కొన్న ఫ్లాట్లలో, ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే వచ్చి, బోర్డును ఏర్పాటు చేసి, హద్దు రాళ్ళు తీసి వేసి, కందకాలు తవ్వారని, ఈ భూమిని ఆక్రమించే ఆలోచనలో వారు ఉన్నారని, తాము ఏమైపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్‌, యాదాద్రి డీసీపీ దృష్టికి తీసుకువెళ్ళి, కేసీఆర్ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసారు. అయితే దీని పై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే, ఈ భూమిలో తనకు కూడా వాటా ఉందని, 2008లో తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు. నెల రోజులు నుంచి తనకు ఫోన్లు చేస్తున్నారని, ఇది తన భూమి అని చెప్పారు. తన కంటే ముందే కనుక ఈ భూమిని అమ్మినట్టు ఆధారాలు చూపిస్తే, వారికే ఈ భూమి ఇచ్చేస్తాను అంటూ, వైసీపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మరి నిజంగానే ఇచ్చేస్తారా ? మీడియా ఒత్తిడితో ఇలా చెప్పారా ? అనేది చూడాలి.

Advertisements

Latest Articles

Most Read