బ్రిటిష్ కాలం నాటి (1861) చట్టంని ఉపయోగించి ఏపీ సర్కారు తెచ్చిన జీవో 1పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఈ జీవోని హైకోర్టు సస్పెండ్ చేయడంతో సుప్రీం కోర్టులో జగన్ సర్కారు వేసిన పిటిషన్‌పై విచారణని ముగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోము అని స్పష్టం చేసిన ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. కేసు తదుపరి విచారణను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపడుతుందని పేర్కొంది. ఈనెల 23న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టాలని సిజెఐ ఆదేశించారు. వాద ప్రతివాదులు ఇరువురు అన్ని అంశాలను డివిజన్ బెంచ్ ముందు ప్రస్తావించుకోవచ్చని పేర్కొన్నారు. అన్ని అంశాలు ఓపెన్‌గా ఉంచుతున్నామన్న సిజెఐ, కేసు మెరిట్స్‌పై ఇప్పుడు ఎలాంటి విచారణ చేపట్టడం లేదని తేల్చి చెప్పారు. శీతాకాల సెలవుల్లో ఉన్న ధర్మాసనం ఈ కేసుని టేకప్ చేయడం, దాని విచారణ పరిధిపై రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం లేవనెత్తారు. దీనికి ప్రతివాదుల తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు.
news
రామోజీరావుని బుక్ చేయాలనుకున్నారు..రాంబాబు బుక్ అయ్యాడు
ఈనాడులో ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటి మాదిరిగానే అన్ని ఆధారాలతో కథనాలు వస్తున్నాయి. వైసీపీ సర్కారు చేస్తున్న అరాచకాలు, అవినీతినే ఈనాడు రాయడంతో ఏం చేయలేని జగన్ రెడ్డి కక్ష సాధింపులకు మార్గదర్శిని మార్గం చేసుకున్నాడు. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా ఈనాడు రామోజీరావుని ఇబ్బంది పెట్టి, ఈనాడు కథనాలకు అడ్డుకట్ట వేయాలనుకుని మార్గదర్శి చిట్స్ పై దాడులకు అధికార యంత్రాంగాన్ని ఉసిగొల్పారు సీఎం జగన్ రెడ్డి. రోజులకొద్దీ మార్గదర్శిలో సోదాలు జరిపినా ఏం పట్టుకోలేక సాక్షిలో తప్పుడు రాతలు రాసి సైకో ఆనందం పొందారు. ఇదే సమయంలో రామూ అంటూ విజయసాయిరెడ్డి ఈనాడుపై సోషల్మీడియా వేదికగా వికృత రాతలు పోస్టు చేసి పైశాచిక ఆనందం పొందారు. అయితే ఎక్కడా రామోజీరావు తగ్గలేదు. ఈనాడు అంతకంటే తగ్గలేదు. చిట్స్ చట్టం కింద రామోజీని బుక్ చేయాలని విశ్వప్రయత్నం చేసినా ఒక్క కేసు పెట్టడానికి ఆధారం దొరకలేదు. మార్గదర్శిపైనా, రామోజీరావుపైనా ఆరోపణలు చేసిన వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అదే చిట్స్ నేరంపై పోలీసు కేసు బుక్ అయ్యింది. అంబటి రాంబాబు ఆదేశాలతో సత్తెనపల్లిలో కొన్నేళ్లుగా సంక్రాంతి డ్రా పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సైతం ఈ డ్రా టికెట్లు అమ్మారనే ఆరోపణలున్నాయి. దీనిపై జనసేన నేతలు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఈ డ్రా వ్యవహారంపై సీరియస్ గా స్పందించింది. అయితే కోర్టులు ఏం చేసినా డ్రా జరిగి తీరుతుందని అంటి స్పష్టం చేశారు. అలాగే డ్రా కూడా తీశారు. హైకోర్టు ఈ డ్రా వ్యవహారంపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో, ఆ డ్రా ముగిసిన తరువాత సత్తెనపల్లి పోలీసులు చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. రామోజీరావుని ఇదే చట్టం కింద బుక్ చేయాలనుకుని రాంబాబు బుక్ కావడం దేవుడి స్క్రిప్ట్ అంటున్నారు సత్తెనపల్లి నేతలు.
జగన్ ని బుక్ చేసిన మంత్రి రోజా... ఆటాడుకుంటున్న టిడిపి...
టూరిజం శాఖా మంత్రిగా కంటే, డ్యాన్సులు శాఖా మంత్రిగానే రోజా రెడ్డి గారికి ఈ మధ్య పేరు వచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇప్పటికీ జబర్దస్త్ షో జడ్జిగానే రోజా రెడ్డి సుపరిచితురాలు. ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తరచూ ప్రభుత్వాన్ని, వైసీపీని ఇరకాటంలో పడేస్తుంది. తాజాగా బతికి వున్న తనయుడు జగన్, దివంగతుడైన తండ్రి రాజశేఖర్ రెడ్డిని ఒకే ఒక మాటతో ఇరకాటంలో పడేసింది. కావాలని అంటుందో, నోరు జారుతుందో కానీ..విపక్షానికి విసిరే పంచులు బూమరాంగ్ అయి వైసీపీకే తగలడం రోజా స్పెషల్. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ ``వళ్లు ఎక్కువైంది..తగ్గించుకోవడానికి పాదయాత్ర పనికొస్తుంది`` అంటూ నోటి తీట ప్రదర్శించారు. పాదయాత్ర కాకపోతే పొర్లుదండాలు పెట్టమనండి అంటూ సెటైర్లు వేసింది. దీనిపై టిడిపి నుంచి గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వళ్లు తగ్గడానికే ప్రజాప్రస్థానం పేరుతో యాత్ర చేశాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజాసంకల్పం పేరుతో జగన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర వళ్లు లావై, తగ్గించుకోవడానికే చేశారా రోజా రెడ్డి గారు అంటూ టిడిపి సోషల్మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. దీనిపై ట్రోల్స్, మీమ్స్ కూడా లెక్కలేనన్ని వదిలారు. దీంతో వైసీపీ నేతలు తమ అధినేతని రోజా కావాలనే బుక్ చేస్తున్నట్టు ఉందని వాపోతున్నారు.
పదే పదే జూ.ఎన్టీఆర్ డ్యామేజ్ చేస్తూ, గుడివాడ నడివీధిలో జూనియర్ ఎన్టీఆర్ పరువు తీసిన కొడాలి నాని..
జూనియర్ ఎన్టీఆర్ కి తెలిసి జరుగుతోందో, తెలియక జరుగుతోందో జనానికి తెలియదు కానీ..గుడివాడ కేంద్రంగా జూనియర్ ఎన్టీఆర్ పరువు పదేపదే తీస్తున్నాడు కొడాలి నాని అని ఫ్యాన్స్ వాపోతున్నారు. కొడాలి నాని టిడిపిపై ఎన్ని విమర్శలు చేసినా, జూనియర్ ఎన్టీఆర్ తనను మందలించకపోవడంతో కొడాలి నాని రెచ్చిపోతున్నారు. అయితే రాజకీయాల్లో ఇప్పుడు ఎన్టీఆర్ వేలు పెట్టే స్థాయిలో లేరని, ఆయన ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని ఆయన సన్నిహితులు చెప్తూ వస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 27వ వర్థంతి సందర్భంగా కొడాలి నాని రౌడీ మూకలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరు పెట్టుకుని గుడివాడలో గందరగోళం సృష్టించాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మహానాయకుడు నందమూరి తారకరామారావు వర్థంతికి ఆయన అభిమానులు, తెలుగుదేశం వారు నివాళులర్పించకుండా కొడాలినాని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో దా-డు-ల-కు పాల్పడ్డాడు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అధ్యక్షతన టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ కి నివాళులర్పిస్తుండగా కొడాలి నాని అనుచరులు వారిపై దా-డు-ల-కు పాల్పడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతిని జరుపుకోనివ్వకపోవడం ఘోరం కాగా, తనకి అత్యంత ఇష్టమైన తాత ఎన్టీఆర్ వర్థంతిని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో అడ్డగించడం మరీ దారుణం. ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేసి, యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసిన వైసీపీ వాళ్లు వర్థంతి జరిపితే లేని అభ్యంతరం టిడిపి తమ వ్యవస్థాపక అధ్యక్షుడికి నివాళులు అర్పిస్తే ఎందుకొచ్చిందని టిడిపి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కొడాలి నాని పాల్పడుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే తారక్ పేరు చాలా డ్యామేజ్ జరుగుతోందని అసలైన అభిమానులు వాపోతున్నారు.