ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎంత మంది మీడియా, ప్రెస్ వాళ్ళు నిరసనలు చేసినా, పార్టీలు నిరసన తెలిపినా, అసెంబ్లీలో చర్చ జరిగినా, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులు, ఇబ్బందిగా మారాయి. మీడియా పై ఆంక్షలు పెడుతూ, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, ప్రభుత్వాన్ని కించ పరిచే నిరాధార వార్తలు రాస్తే, కేసులు పెట్టండి అంటూ, అన్ని శాఖలకు అధికారం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 2430 ని రిలీజ్ చేసింది. అయితే ప్రభుత్వం చేత ఈ జీవో ఉపసంహరించుకునేలా చెయ్యాలి అంటూ, వేసిన పిటీషన్ పై ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా వాదనలు జరిపి, మీడియాపై ఆంక్షలు విధించేలా ఉన్న ఆ జీవో ఉప సంహరించుకోవాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఇచ్చిన ఈ ఆదేశాల పై వివిధ జర్నలిస్ట్ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియాకి ధన్యవాదాలు చెప్పాయి.

pci 19122019 2

ఈ విషయం పై ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఛైర్మన్‌ జస్టిస్‌ సీకే ప్రసాద్‌ అధ్యక్షతన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో, ఈ అంశం పై విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి, వివిధ జర్నలిస్టు సంఘ నేతలు, ఈ విచారణలో పాల్గొని, తమ వాదనలు వినిపించారు. ఈ జీవో, తమ విధులకు ఇబ్బంది కరంగా మారిందని, వాదనలు విపించారు. ఇప్పటికే తప్పుడు వార్తల పై వివిధ చట్టాలు ఉన్నాయని, ఇప్పుడు ఇలాంటి జీవో ఇచ్చి, తమకు ఇష్టం లేని వాళ్ళ పై, ప్రభుత్వం కక్ష సాధించే కుట్ర ఉందని, ఇలాంటి జీవో ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. వార్తా నిజమా కదా, అని, లేకపోతే, ప్రభుత్వం తప్పు చేసిందా లేదా అని ఎవరు నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. పాత్రికేయుల్ని భయభ్రాంతులకు గురిచేసేలా జీవో ఉందని అన్నారు.

pci 19122019 3

గతంలో జయలలిత ప్రభుత్వంలో, ఇలాగే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన విషయాన్ని గుర్తు చేసారు. అయితే ఈ విచారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున, సమాచార, పౌరసంబంధాల శాఖ తరఫున అదనపు డైరెక్టర్‌ కిరణ్‌ వచ్చి, ప్రభుత్వం తరుపున వాదనలను వినిపించారు. ఈ జీవో తేవటం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, ఈ జీవోని దుర్వినియోగం చేయబోమని చెప్పారు. కేవలం కావాలని, తమ పై బురద జల్లే వార్తల నియంత్రణ కోసమే ఈ జీవో తెచ్చామని, ఏ ఒక్కరినీ టార్గెట్ చేసి కాదని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే విషయం పై క్లారిటీ ఇచ్చామని చెప్పారు. అయితే ఇరువురి వాదనలు ఉన్న కౌన్సిల్, ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 ను ఉప సంహరించుకోవాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ సీకే ప్రసాద్‌ ఆదేశించారు. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో ఇప్పుడు హైకోర్ట్ ఎంటర్ అయ్యింది. రాజధాని అంశం ఇప్పుడు హైకోర్ట్ కు చేరింది. ప్రభుత్వం రాజధాని కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఏర్పాటు పై రైతులు హైకోర్ట్ కు వెళ్లారు. జీఎన్ రావు కమిటీకి వ్యతిరేకంగా హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. జీఎన్ రావు కమిటీకి చట్టబద్దత లేదని వాపోయారు. తాము ఇప్పటికే రాజధాని కోసం భూములు ఇచ్చామని గుర్తు చేసారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చామని, ఇప్పటికే రోడ్లు వేసారని, బిల్డింగ్లు కడుతున్నారని, మా భూముల్లోనే ఇప్పుడు సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ ఉన్నాయని గుర్తు చేసారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో, జీఎన్ రావు కమిటీ అంటూ హడావిడి చేస్తున్నారని, ఇప్పుడు రాజధాని పై వీళ్ళు ఏమి సమీక్ష చేస్తారు అంటూ కోర్ట్ లో పిటీషన్ వేసారు. అంతే కాకుండా, తాజగా రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో, మూడు రాజధానులు ఉంటే తప్పు ఏంటి, బహుసా రిపోర్ట్ అలాగే వస్తుంది ఏమో అంటూ, చేసిన వ్యాఖ్యల తో అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు.

court 19122019 2

అసలు కమిటీనే ఉండ కూడదు అని మేము అంటుంటే, ఇది కోర్ట్ లో ఉంటే, ఇప్పుడు ఆ కమిటీ ఏమి రిపోర్ట్ ఇవ్వకుండానే, జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ, ముందే చెప్పి, కమిటీ రిపోర్ట్ ను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే రైరుట్లు వేసిన పిటీషన్ పై, ఈ రోజు విచారణ సాగింది. హైకోర్ట్ ఈ విషయం పై, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. మరో పక్క రైతులు, జగన్ చేసిన ప్రకటన పై ఆందోళన చేస్తూనే, తమ నిరసనలు కొనసాగిస్తూనే, న్యాయ పోరాటం కూడా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అంతా చట్ట ప్రకారం జరిగిందని, ఆ చట్టానికి, అనుగుణంగానే చెయ్యాలని కోరుతున్నారు.

court 19122019 3

తాము అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే, తమ రాష్ట్రం కోసం, మా భవిష్యత్తు కోసం రాజధానికి భూములను స్వచ్చందంగా ఇచ్చామని, అప్పుడు ప్రభుత్వం తమ భూములు తీసుకొని పనులు మొదలు పెట్టిందని, ఇప్పుడు వచ్చిన మరో ప్రభుత్వం, రాజధాని మార్పు అంటూ కమిటీ ఏర్పాటు చేయటం ఏంటని, రైతులు కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో ప్రశ్నించారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారుస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో, ఇప్పుడు రాజధాని మారిస్తే తాముఎటూ కాకుండా అయిపోతామని, ఇప్పటికే తాము ఇచ్చిన భూములు , వ్యవసాయానికి కూడా పనికి రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేస్తుందో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన, మూడు రాజధాని ప్రకటన పై, అమరావతి రైతులు ఆవేదనతో రగిలిపోతున్నారు. నిన్న పురుగుమందు డబ్బాలు పట్టుకుని, రోడ్డెక్కిన రైతులు, ఈ రోజు అమరావతి బంద్ కు పిలుపిచ్చారు. అమరావతి గ్రామాల్లో ఈ రోజు స్వచ్చందంగా బంద్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలు రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్నారు. ఎక్కడికక్కడ స్వచ్చందంగా బంద్ చేస్తూ ఉండటంతో, రాజధాని గ్రామాల్లో, జనజీవనం స్తంభించింది. రోడ్డు పై బైటాయించి, ఆందోళన చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల రోడ్డుకి అడ్డంగా వాహనాలు పెట్టి, ఆందోళన చేస్తున్నారు. మందడం, వెంకటపాలెం, తుళ్లూరు, రాయపూడి, తుళ్ళురు, వెలగపూడి, కృష్టాయపాలెం, మందడం తదితర ప్రాంతాల్లో రైతుల ఆందోళనకు, ట్రాఫిక్ ఆగిపోయింది. అలాగే, వెంకటపాలెంకు గ్రామానికి చెందిన రైతులు నిరాహారదీక్షకు దిగారు. ప్రతి రోజు ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తామని ప్రకటించారు.

amaravati144 19122019 2

అయితే, ఈ ఆందోళనలు ఇలా ఉండగా, ప్రభుత్వం అమరావతిలో 144 సెక్టన్ అమలు చేస్తుంది. రాజధాని రైతుల బంద్, ఆందోళనలు నేపధ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, రాజధానిలోని 29 గ్రామాల్లో పోలీసులు ఎక్కువ ఫోర్సు పెంచారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ తో పాటుగా, 30 పోలీస్ యాక్ట్‌ను కూడా రాజధాని గ్రామాల్లో అమలు చేశారు. ప్రజలు నిరసన తెలిపితే, శాంతియుతంగానే తెలపాలని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. బంద్‌లో పాల్గొనాలని ఎవరినీ ఒత్తిడి చేయొద్దని, అలా చేసిన వారి పై, తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజధాని పరిధిలోని ముగ్గురు అదనపు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 30 మంది ఎస్సైలతో బందోబస్తు ఏర్పాటు చేసారు.

amaravati144 19122019 3

అమరావతి రాజధానిగానే ఉంచాలని, తమ పొట్ట కొట్టొద్దు అంటూ, రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని ఇక్కడే ఉంచాలని, 33 వేల ఎకరాలు ఇచ్చిన మాకు, అన్యాయం చెయ్యొద్దని అంటున్నారు. మరి కొంత మంది అయితే, మీరు రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి, ఇంకా ఇక్కడ అసెంబ్లీ కూడా ఎందుకు, ఇది కూడా తీసి ఎక్కడో ఒక చోట పెట్టుకోండి, 2015లో మీకు భూములు ఎలా ఇచ్చామో, అలాగే ఇప్పుడు మా భూములు మాకు తిరిగి ఇచ్చేసి, మీరు ఎక్కడో ఒక చోట పెట్టుకోండి, ఇక్కడ అసలు లెజిస్లేటివ్ కాపిటల్ కూడా వద్దు అంటూ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, అసెంబ్లీలో జగన్ చేసిన ప్రకటన వెనక్కు తీసుకునే వరకు, ప్రతి రోజు ఆందోళను చేస్తూనే ఉంటామని, పిలుపిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. శాసనమండలిలో వైసీపీ పార్టీకి మెజారిటీ లేకపోవటంతో, వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క శాసనసభలో, 151 మందితో, ప్రతిపక్షం పై పడుతుంటే, శాసనమండలిలో మాత్రం, బాగా వెనుకబడి ఉన్నారు. దీనికి కారణం వైసీపీకి శాసనమండలిలో సంఖ్యా బలం లేకపోవటం. 2021 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాసం ఉంది. పూర్తిగా తెలుగుదేశం ఆధిపత్యంతో శాసనమండలి జరుగుతూ ఉండటంతో, వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. శాసనసభలో ఎక్కవ మంది ఉండటంతో, బుల్ డోజ్ చేసి వెళ్లిపోతుంటే, శాసనమండలిలో మాత్రం, సామధానం చెప్పల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు బిల్లులు కూడా పాస్ చేసుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. మంగళవారం శాసనమండలిలో రెండు బిల్స్ పాస్ కాలేదు. తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం, ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు బిల్స్ విషయంలో ఇబ్బంది పడ్డారు.

council 19122019 2

ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని, తెలుగు మీడియం కూడా ఆప్షన్ పెట్టాలని, అప్పుడే బిల్ కు అనుకూలంగా వోట్ వేస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పింది. అలాగే, ఎస్సీ వర్గీకరణకు వైసీపీ వ్యతిరేకిస్తోందని, బిల్ పై సవరణలు ఒప్పుకోవాలని కోరారు. అయితే, ప్రభుత్వం ఒప్పుకోక పోవటంతో, 34మంది సభ్యులు వ్యతిరేకించగా, అధికారపార్టీకి మద్దతుగా కేవలం 9ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రెండు బిల్లులు వీగిపోయాయి. దీంతో మళ్ళీ ఈ బిల్ అసెంబ్లీకు పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లులపై చర్చను చేపట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత కూడా శాసనమండలి వ్యతిరేకిస్తే, అసెంబ్లీ తీర్మానం ఫైనల్ అవుతుంది. అయితే ఈ పరిణామాలతో వైసీపీ అవాక్కయింది.

council 19122019 3

2021 వరకు తెలుగుదేశం పార్టీ, ఇలాగే చేస్తుందని, తమ ఆటలు సాగవని, అందుకే ఇప్పుడు అసలు శాసనమండలి రద్దు చేస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఈ దిశగా చర్యలు జరుగుతున్నాయని, ప్రభుత్వం మండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. సమయం చూసుకుని మండలి రద్దు ఉత్తర్వులు ఇస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీగా నారా లోకేష్, డొక్కా, వైవీబీ లాంటి ఎంతో మంది నేతలు శాసనమండలిలో ఉండటంతో, వారిని కూడా రాజకీయంగా ఇబ్బంది పెట్టొచ్చని జగన్ వ్యూహంగా తెలుస్తుంది. అయితే, ఇప్పుడు మంత్రులుగా పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్సీలుగా మంత్రులు అయ్యారు. మరి వారి సంగతి ఏమిటి అనే చర్చ జరుగుతుంది.

Advertisements

Latest Articles

Most Read