గ‌త ఏడాది దావోస్ ప‌ర్య‌ట‌న పేరుతో లండ‌న్ దాకా వెళ్లిపోయారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. అప్పట్లో ఈ పర్యటన హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఏడాది క‌నీసం దావోస్ నుంచి పిలుపు కూడా రాలేదేమో, తాడేప‌ల్లిలోనే ఉండిపోయారు. ప్రపంచ ఆర్ధిక సదస్సుని ప్ర‌తీ ఏటా దావోస్లో నిర్వ‌హిస్తారు. ఈ వేదికపై త‌మ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు గ‌ల అవ‌కాశాలు, క‌ల్పిస్తున్న ప్ర‌యోజ‌నాల‌ను ఆయా ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేసుకుని పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నాలు చేస్తాయి. టిడిపి హ‌యాంలో దావోస్ కి చంద్ర‌బాబు, లోకేష్ వెళితే విమ‌ర్శ‌లు గుప్పించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ అండ్ బ్యాచ్, ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన త‌రువాత దావోస్ వెళ్లారు. వ‌చ్చిన పెట్టుబ‌డులు లేవు. ప్ర‌భుత్వం సొమ్ముతో జ‌గ‌న్ ప్ర‌త్యేక విమానంలో వెళ్లి త‌న కుమార్తెల‌ను క‌ల‌వ‌డంతో పాటు న్యాయ‌స్థానాలను దూషించిన కేసులో సీబీఐ వెతుకుతున్న పంచ్ ప్ర‌భాక‌ర్ తో భేటీ అయ్యారు. ఏపీ బృందం గ‌త దావోస్ ప‌ర్య‌ట‌న ఖ‌ర్చు కొండంత‌, రాష్ట్రానికి ఒన‌గూడిన ప్ర‌యోజ‌నం గోరంత కావ‌డంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ ఏడాది 16వ తేదీనే ప్రారంభ‌మైన దావోస్ స‌ద‌స్సుకి తెలంగాణ ఐటీ మంత్రి, అధికారుల బృందం హాజ‌రైంది. ప్ర‌తీ ఏటా దావోస్ వెళ్లే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ 30,000 కోట్లకు పైగా పెట్టుబడుల‌ను ఆక‌ర్షిస్తున్నారు.

davos 17012023 2

అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఇలా అనేక రాష్ట్రాల ప్రతినిధి బృందం దావోస్ వెళ్ళింది. ఇదే స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ ఐటిశాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ న్యూడిల్స్ బండి ప్రారంభోత్స‌వంలో బిజీగా వున్నారు. ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోయి దేశ‌వ్యాప్తంగా ప‌రువు పోగొట్టుకున్న వైసీపీ స‌ర్కారు, పారిశ్రామిక‌వేత్త‌ల బెదిరించ‌డం, ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాత సంస్థ‌లైన జాకీ, లులూ వంటివి పాల‌కులే త‌రిమేయ‌డంతో అంత‌ర్జాతీయంగా కూడా ఏపీ ప‌రువు పోయింది. దావోస్ నుంచి పిలుపు రాలేదు. ఒక వేళ పిలుపు వ‌చ్చినా సీబీఐ, ఈడీ కేసుల విచార‌ణ‌కి తోడు ఎన్ఐఏ కేసు విచార‌ణ‌కీ సాక్షిగా జ‌గ‌న్ హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించింది. ఈ జాతీయ సంస్థ‌లు విచార‌ణ‌లో ఉన్న జ‌గ‌న్ దావోస్ వెళ్లాలంటే కోర్టు అనుమ‌తి కావాలి. ఇది మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మై త‌న‌కు డ్యామేజీ అవుతుంద‌ని ఆగిపోయార‌ని జ‌ర్న‌లిస్టులు విశ్లేషిస్తున్నారు. అయితే అసలు దావోస్ నుంచి ఈ సారి పిలుపు కూడా రాలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. గత ఏడాది దావోస్ లో జగన్ బ్యాచ్ నిర్వాకం మొత్తం, అక్కడ నిర్వాహకులు చూసి, ఈ సారి పిలవలేదేమో అని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దావోస్ పర్యటన పై వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి వివరణ అయితే రాలేదు.

టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌తో గంటా శ్రీనివాస‌రావు దాదాపు గంట పాటు మంత‌నాలు జ‌రిపారు. వీరి భేటీపై అధికారికంగా ఏ ప్ర‌క‌ట‌నా ఇంకా విడుద‌ల కాలేదు. అయితే పార్టీలు మార‌డం, ప‌ద‌వులు పొంద‌డం ఒక నిరంత‌ర ప్ర‌క్రియలా చేప‌ట్టే గంటా కొన్నాళ్లుగా టిడిపికి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అధికార వైసీపీలో చేర‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశార‌ని  క‌థ‌నాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. లేటెస్ట్‌గా డిసెంబ‌ర్ మొద‌టివారంలో కూడా వైసీపీలోకి జంప్ కొడ‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఏమైందో ఏమో కానీ కాపు హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ అవ‌తారం ఎత్తారు గంటా. మామూలు రాజ‌కీయ నాయ‌కుల్లా కాకుండా నిరంత‌రం పార్టీలు, ప్ర‌జ‌ల‌నాడిపై స‌ర్వేలు చేయించే గంటా శ్రీనివాస‌రావుకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని తేలింద‌ని, దీంతో ఊగిస‌లాట ధోర‌ణికి క‌ట్టిపెట్టి పార్టీలో కొన‌సాగేందుకు మొగ్గు చూపార‌ని టాక్ వినిపిస్తోంది. జ‌న‌సేన‌-టిడిపి జ‌త క‌ట్టడం గ్యారంటీ అని తేలిపోవ‌డంతో మౌనం వీడిన గంట మోగింద‌ని తెలుస్తోంది. గంటా శ్రీనివాస‌రావు ప్యాకేజీ పాలిటిక్స్ ని టిడిపి ఎంట‌ర్ టైయిన్ చేస్తుందా? క‌ష్ట‌కాలంలో తెర‌మ‌రుగై క‌లిసొచ్చే కాలంలో తిరిగొచ్చిన గంటాకి పూర్వ ప్రాధాన్యం ఇస్తుందా త్వ‌ర‌లో తేల‌నుంది. టీడీపీ అధిష్టానం గంటా ఎటువెళ్లినా ప‌ట్టించుకోద‌నే వార్తలు వస్తున్న నేపథ్యంలో  లోకేష్ తో భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. గంట‌కి పైగా గంటా ఏం చ‌ర్చించార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశాఖ‌లో బాబు, లోకేష్ ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ప‌త్తా లేని గంటా క‌లుగులోంచి బ‌య‌ట‌కొచ్చింది ఎందుకో అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలో పొలిటిక‌ల్ ట్రెండ్ ఒక్క‌సారిగా మారిపోయింది. చంద్ర‌బాబు రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు స‌క్సెస్ కావ‌డం  రాజ‌కీయ వాతావ‌ర‌ణంపై అన్ని వ‌ర్గాల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తోంది. మ‌రోవైపు బాబు-ప‌వ‌న్ భేటీతో మ‌రింత క్లారిటీ అంద‌రికీ వ‌చ్చేసింది. టిడిపి ప్ర‌భుత్వం రావ‌డం ఖాయ‌మ‌ని నిర్ధారించుకున్న గోడ‌మీద పిల్లుల్లాంటి నేత‌లు పెద‌బాబుని, చిన‌బాబుని క‌లిసి తాము ఎందుకు దూరంగా ఉంటున్నామో వివ‌ర‌ణ ఇస్తున్నారు. తాము ఇక‌పై యాక్టివ్ గా ఉంటామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు. ప‌ద‌వుల కోస‌మో, కేసుల భ‌యంతోనో, తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోస‌మో పార్టీ మారిన వారు సైతం తెలుగుదేశంలోకి మ‌ళ్లీ వ‌స్తామంటూ సంకేతాలు పంపుతున్నారు. సామాన్య‌ప్ర‌జ‌లు, నేత‌ల‌కే వైసీపీ పోవ‌డం, టిడిపి రావ‌డం ఖాయ‌మ‌ని తేలిపోతే..ప్ర‌భుత్వంలో ఉన్న అధికారులు ఈ విష‌యాన్ని ఎప్పుడో ప‌ట్టేశారు. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్‌లు హైద‌రాబాద్లో చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా క‌లుస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్ర‌భుత్వంలో కీల‌క పెద్ద‌ల ఆదేశాల‌తో తాము అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డంలేద‌ని వాపోతున్నారు. వారికి చంద్ర‌బాబుతో గ‌త ప్ర‌భుత్వంలో అనుబంధం, బంధుత్వాలు, స్నేహాల‌ను గుర్తుచేస్తూ...ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక త‌మ త‌ప్పుల్ని మ‌న్నించేయాల‌ని ముందుగానే వేడుకుంటున్నారు. పోలీసుశాఖ‌లో చాలా ఘోరంగా వ్య‌వ‌హ‌రించిన ఓ ఐపీఎస్ బెట్టింగ్ మాఫియా కేసుల్లో అడ్డంగా దొరికిపోయినా..చంద్ర‌బాబు కాపాడార‌ని టాక్ ఉంది. వైసీపీ స‌ర్కారు రాగానే టిడిపిపై జులుం చెలాయిస్తూ ఆ అధికారి చెల‌రేగిపోయాడు. క‌ట్ చేస్తే చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా విడ‌త‌ల వారీగా క‌లుస్తున్న అధికారుల్లో ఈ ఐపీఎస్ ఉన్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు సీఐడీలో ప‌నిచేస్తున్న వారంతా చంద్ర‌బాబుని ఎలాగైనా క‌లిసి త‌మ త‌ప్పేమీ లేద‌ని, అంతా ఆ ఉన్న‌తాధికారి ఆడించే ఆట‌లో పావులం అంటూ చెప్పుకుంటామ‌ని రిఫ‌రెన్సులు వెతుక్కుంటున్నార‌ట‌. మొత్తానికి ఏపీలో పొలిటిక‌ల్ ట్రెండ్ ని ప‌సిగ‌ట్టిన అధికారులు చంద్ర‌బాబునాయుడిని ప‌ట్టుకుంటే క్ష‌మించి వ‌దిలేస్తార‌నే ధీమాతో హైద‌రాబాద్ అపాయింట్మెంట్ల కోసం నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు.

వైసీపీకి సోష‌ల్మీడియా అతి పెద్ద బ‌లం. అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేయ‌డంలో వీరిని మించిన వారు లేరు. గ్రామ వ‌లంటీర్లుగా ప‌నిచేస్తున్న వారి ద‌గ్గ‌ర నుంచి ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ వ‌ర‌కూ అతి పెద్ద పేటీఎం సైన్యం వైసీపీకి ఉంది. వీరంతా స‌మ‌యం చూసుకుని వ‌స్తుంటారు. అవాస్త‌వాలను వాస్త‌వాల‌ని న‌మ్మించేలా చేయ‌డం, కులాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డం పై స్థాయి పెయిడ్ పేటీఎం పెద్ద‌లు చేస్తుంటారు. మ‌ధ్య‌లో గుర్రం గ్యాంగ్ దండుపాళ్యం ప‌నులు చ‌క్క‌బెడుతుంది. ఫేక్, మార్ఫింగ్ వీడియో ఆడియో పోస్ట‌ర్లు చేసి వ‌ద‌ల‌డం ఈ పేటీఎం వింగ్ చూస్తుంది. ఐప్యాక్ విభాగాల పేటీఎం కార్మికులు చౌద‌రీస్ పేరుతో సోష‌ల్మీడియా ఖాతాలు ఓపెన్ చేసి జూనియ‌ర్ ఎన్టీఆర్ కి టిడిపి ప‌గ్గాలివ్వాలంటూ పోస్టులు ఆరంభించాయి. కాపు ఇంటి పేర్ల‌తో మ‌రికొన్ని ఖాతాలు ర‌న్ చేస్తూ ప‌వ‌న్ కి ప్రాణం ఇస్తాం..జ‌గ‌న్ కి  ఓటేస్తామంటూ పాత చింత‌కాయ పోస్టులు ర‌న్ చేస్తుంటాయి. మ‌ధ్య‌లో అప్పుడ‌ప్పుడు ఐట‌మ్ సాంగ్ లాగ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉత్తుత్తి ఉత్త‌రాలు, రాంగోపాల్ వ‌ర్మ రంగీలా మార్కు పోర్న్ ట్వీట్లు ద‌ర్శ‌నం ఇస్తాయి. వీరంతా టిడిపి, జ‌న‌సేన క‌మ్మ కాపుల‌ మ‌ధ్య వివాదం సృష్టించ‌డమే త‌మ జీవిత ల‌క్ష్యంగా ప‌నిచేస్తుంటారు. వాస్త‌వంగా రాంగోపాల్ వ‌ర్మ నుంచి వ‌లంటీర్ వాసు వ‌ర‌కూ పోస్టుకి వారి స్థాయిని బ‌ట్టి పేమెంట్ జ‌రిగిపోతుంది. ఈ పేటీఎం గ్యాంగులో భారీ ప్యాకేజీ తీసుకుని హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేసే తిమింగ‌లాలూ ఉన్నాయి. వీరంతా ఇప్పుడు చాలా  యాక్టివ్ అయిపోయారు. టిడిపి-జ‌న‌సేన అధినేత‌ల భేటీ వీరికి కంటిమీద కునుకు ఉంచ‌డంలేదు. పేమెంట్ కి త‌గిన‌ట్టు అరిచేవారు, మొరిగేవారు, రాసేవారు, ట్వీటేవారు చెల‌రేగిపోతున్నారు. ఈ బ్యాచులో శ్రీరెడ్డి ఇంకా యాక్టివ్ కాలేదు. క‌త్తి మ‌హేష్, ఇల‌పావులూరి చ‌నిపోవ‌డంతో కొత్త పేటీఎం ముత్త‌యిద‌వుల‌ను రంగంలోకి దింపనున్నార‌ని స‌మాచారం.

Advertisements

Latest Articles

Most Read