ఎదురులేని పెద్ద‌రికం చెలాయిస్తున్న పెద్దిరెడ్డికి అమిత్ షా టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఏ పార్టీ అయినా కానీ, అవినీతిని ప్ర‌శ్నిస్తే చిత‌క్కొట్టించే పెద్దాయ‌నకే అనుకోకుండా పెద్ద క‌ష్టం వ‌చ్చింది. 16 వేల ఓట్లొచ్చిన బీసీయే క‌దా అని దాడి చేయిస్తే..ఈ బీసీ పోయి అమిత్ షా ద‌గ్గ‌ర పంచాయ‌తీ పెట్టాడు. ఏం చేయాలో తెలియ‌క పెద్దిరెడ్డి స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఏపీలో ప్ర‌శ్నిస్తే ప్ర‌జ‌లైనా ప్ర‌తిప‌క్ష నేత‌లైనా ప్ర‌భుత్వ‌ దా-డు-లు ఎదుర్కోక త‌ప్ప‌దు. ఈ అరాచ‌కం మోతాదు పెద్దాయ‌న‌గా పిల‌వ‌బ‌డే పెద్దిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరు, త‌మ్ముడు నియోజ‌క‌వ‌ర్గం తంబ‌ళ్ల‌ప‌ల్లెలో మ‌రీ ఘోరంగా ఉంటుంది. మ‌ద్యం రేట్లు దారుణ‌మ‌ని సోష‌ల్మీడియాలో పోస్టు పెట్టిన ఓంప్ర‌తాప్ తెల్లారేస‌రికి శ-వం అయ్యాడు. దౌర్జ‌న్యాల‌ను ప్ర‌శ్నించిన జ‌డ్జి రామ‌కృష్ణ‌పై హ‌-త్యా-య‌త్నం చేశారు. ఈ దా-డు-ల‌పై వార్త‌లు రాసిన విలేక‌రిపై దా-డు-ల‌-కు పాల్ప‌డింది గ్యాంగ్. ఇంత‌టి అరాచ‌కుడు విప‌క్ష నేత‌లని వ‌దల‌డంలేదు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసిన జ‌న‌సేన అభ్య‌ర్థి రామచంద్రయాదవ్ చాలా రోజులుగా నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్నారు. ఇటీవ‌ల కొత్త ఇల్లు క‌ట్టుకుని గృహ‌ప్ర‌వేశం చేస్తే పెద్దిరెడ్డి మ‌నుషులు ఇంటిని, వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు స‌మావేశం పెట్టిన రామ‌చంద్ర‌యాద‌వ్ పై దా-డు-ల-కు పాల్ప‌డ్డారు. స్థానికంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే ప‌ట్టించుకోలేదు. పైగా పెద్దిరెడ్డి ప్రోద్బ‌లంతో రివ‌ర్స్ కేసులు బ‌నాయించారు. కొన్నివారాల పాటు మౌనంగా ఉన్న రామచంద్రయాదవ్ హ‌ఠాత్తుగా అమిత్ షాతో భేటీ అయ్యాడు. 

త‌న‌పై, త‌న‌ కుటుంబ సభ్యులపై అనుచరులతో మంత్రి పెద్దిరెడ్డి దా-డి చేయించారని షాకి ఫిర్యాదు చేసిన‌ట్టు మీడియాకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తన‌పై దాడి గురించి ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు పోలీసులు ఎవరిపై చర్యలు తీసుకోలేద‌ని, మంత్రి పెద్దిరెడ్డిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేద‌ని ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయ‌ని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా సభ పెట్టుకోనివ్వలేద‌ని, గత నెల రైతుభేరి స‌భ జరగకుండా అడ్డుకున్నార‌ని అమిత్ షాకి ఫిర్యాదు చేశారు. ఇంటిపై దా-డి, నా కుటుంబాన్ని హతమార్చేందుకు ప్రయత్నించార‌ని రామ‌చంద్ర‌యాద‌వ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని, త‌న‌కు భద్రత కల్పిస్తామని అమిత్ షా హామీ ఇచ్చార‌ని రామచంద్రయాదవ్ తెలిపారు. ఈ విష‌యాలు మీడియాలో ప్ర‌ముఖంగా రావ‌డంతో పెద్దిరెడ్డిలో టెన్ష‌న్ మొద‌లైంది. త‌న‌కో,సీఎంకో అమిత్ షా అపాయింట్మెంట్ అసాధ్యం అయితే, రామ‌చంద్ర‌యాద‌వ్ కి ఎలా దొరికింద‌నేది పెద్దిరెడ్డికి అంతుబ‌ట్ట‌టంలేదు.

స్వామి కార్యం స్వ‌కారం ఒకేసారి పూర్తి చేశారు తెలుగుదేశం పార్టీ నేత‌లు. భోగి పండ‌గ రోజు కూడా జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌ని ఎత్తి చూపే అవ‌కాశంగా వాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ త‌ల‌పెట్టిన ``ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి`` కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టిన నుంచి ఎలా అడ్డుకోవాలో తెలియ‌ని వైసీపీ ఏకంగా జీవో నెంబ‌ర్ 1 తీసుకొచ్చింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చ‌ట్టాన్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టిడిపితోపాటు విప‌క్షాల‌న్నీ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశాయి. సీపీఐ రామ‌క్రిష్ణ వేసిన పిల్ ని విచారించిన హైకోర్టు ఈ జీవోని స‌స్పెండ్ చేసింది. జీవోని స‌స్పెండ్ చేసినా, నిరంకుశ పాల‌కుడి తెచ్చిన జీవో గురించి మ‌రింత అవ‌గాహ‌న పెంచేందుకు టిడిపి నిర్ణ‌యించుకుంది. పాత వ‌స్తువులు, ఉప‌యోగించ‌నివి భోగీ మంట‌ల్లో వేయ‌డం ఆన‌వాయితీ. జ‌గ‌న్ రెడ్డి ఆదేశాల‌తో తెచ్చిన జీవో1ని భోగీ మంట‌ల్లో వేసి నిర‌స‌న తెల‌పాల‌ని టిడిపి అధినేత పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ టిడిపి నేత‌లు భోగి మంట‌లు వేదిక‌గా వైసీపీ స‌ర్కారు నియంత నిర్ణ‌యాల‌ను ధిక్క‌రిస్తున్నామ‌ని చాటిచెబుతూ, జీవో 1 ప్ర‌తుల‌ను మంట‌ల్లో వేశారు. నారావారి ప‌ల్లెలో టిడిపి జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కూడా చీక‌టి జీవోని భోగి మంట‌ల్లో వేశారు.

ప్రతిపక్షనేత పర్యటనను అడ్డుకోవడం అధికార దుర్వినియోగం చేస్తున్నారని, మంత్రి పెద్దిరెడ్డి విపరీత పోకడల్ని డీజీపీ నివారించాలి అంటూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వాపోయారు.  ఆయన మాట్లాడుతూ, "అక్రమ కేసులతో పండుగ పూట పుంగనూరు టీడీపీ నేతల్ని మంత్రి పెద్దిరెడ్డి జైలులో పెట్టించి పెద్ద తప్పు చేశారు. పండగపూట జైలులో ఉన్నవారి కుటుంబాల ఉసురు పెద్దిరెడ్డికి తగలకమానదు. బాధితుల పరామార్శకు వెళ్తున ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి బ్యానర్లు కట్టిండం టీడీపీ బ్యానర్లు చించడం మరో తప్పు.  ప్రతిపక్ష నేత పర్యటనకు వ్యతిరేకంగా పోలీసులపై ఒత్తిడి తెచ్చి సర్కిల్ ఇన్స్ పెక్టర్ చేత 30 యాక్టు నోటీసు ఇప్పించడం అధికార దుర్వినియోగమే. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పోలీస్ యాక్టు 30 ఉన్నా.. యదేచ్ఛగా కోడి పందేలు, జూదాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ పోలీస్ యాక్టు 30 ఏమైంది? కేవలం ప్రతిపక్షాల్ని ప్రజల వద్దకు, బాధితుల వద్దకు వెళ్లకుండా నిరోధించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పెద్దిరెడ్డి తప్పు చేయకపోతే ప్రతిపక్ష నేతను ఎందుకు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు? ప్రజల్ని బయపెట్టి లాండ్, శాండ్, వైన్, మైన్, రెడ్ శాండిల్ కుంభకోణాలు యదేచ్ఛగా చేస్తున్నారు. ఇవి బయటపడతాయనే భయంతోనే ప్రజలపై, ప్రతిపక్షాలపై దా-డు-లు చేయిస్తున్నారు. ఇళ్లను ధ్వంసం చేయిస్తున్నారు. బాధితులపై అక్రమ కేసులు పెడుతున్నారు. పరాకాష్టగా ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకొనే కుట్ర చేస్తున్నారు. డిజిపి జోక్యం చేసుకొని ప్రతిపక్ష నేత పర్యటన సజావుగా జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలి" అంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు

ఏపీలో ఎమర్జెన్సీ పాలన సాగుతోంద‌ని నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పరిస్థితులు ఏమీ బాగాలేవ‌న్నారు. ఈ విష‌యాలు నేను హిందూపురం ఎమ్మెల్యేగా, టిడిపి నేత‌గా చెప్ప‌డం లేద‌ని సామాన్య పౌరుడిగా చెప్తున్నాన‌న్నారు. ప్ర‌భుత్వం ఎన్ని అవాస్త‌వాలు ప్ర‌చారంచేసినా వాస్తవాలు ప్రజలకు బాగా తెలుసు అని పేర్కొన్నారు.  కరోనా వల్ల మూడేళ్లుగా నారావారిపల్లెకు రాలేకపోయాయ‌ని, సంక్రాంతి సంద‌ర్భంగా రావ‌డం నారావారిపల్లెకు రావడం సంతోషంగా ఉంద‌న్నారు. ఆకలిగా ఉన్న ప్రేక్షకులకు మంచి సినిమాను అందించామ‌ని, వీరసింహారెడ్డి భారీ విజయం సాధించింద‌ని బాలకృష్ణ తెలిపారు. సినిమాకు ఘనవిజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువు చేశార‌ని బాలకృష్ణ సంతోషం వ్య‌క్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read