ప్రభుత్వాలకు నిజాలు నచ్చవు, విమర్శ స్వీకరించరు అనే భావం అందరిలో ఉంటుంది. విమర్శ చేస్తే, దాంట్లో ఎంత తప్పు ఉంది అని చూసి ఇది వరకు కరెక్ట్ చేసుకునేవారు. అంతెందుకు మొన్నటికి మొన్న చంద్రబాబు కూడా, సాక్షి ఎంత బురద చల్లినా, ప్రజలకే వదిలేద్దాం అని, సాక్షి చెప్పినవి కూడా ప్రజల్లోకి వెళ్ళేలా చేసారు. అయితే ఇదే సందర్భంలో మీడియాలో, పేపర్ లో వచ్చే వ్యతిరేక వార్తల పట్ల తట్టుకోలేని వారు కూడా ఉండేవారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, ఆ రెండు పత్రికులు అంటూ విరుచుకుపదేవారు. తరువాత, కేసీఆర్ కూడా, ఇలాగే ఆంధ్రజ్యోతిని, టీవీ9ని బ్యాన్ చేసారు కూడా. తరువాత టీవీ9 ఆయన దగ్గరి వ్యక్తుల సొంతం అయిపొయింది అనుకోండి. ఇప్పుడు తండ్రి రాజశేఖర్ రెడ్డి, కొత్త మిత్రుడు కేసిఆర్ బాటలోనే జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారు. ఒక వివాదాస్పద జీవోతో, పత్రికా స్వేఛ్చ ఒక్కటే కాదు, సోషల్ మీడియాలో రాసుకే స్వేఛ్చ, విమర్శించే స్వేఛ్చ కూడా లేకుండా చేసారు.

ఈ రోజు జారీ చేసిన జీవో నెంబర్ 2430, అత్యంత ప్రమాదకరమైనది. నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా,సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా జీవో జారీ చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇందులో ఫేక్ న్యూస్ అయితే, ఎవరికీ అభ్యంతరం లేదు. ఇప్పుడు కూడా, ఎవరైనా సదరు పత్రికలు, ఛానెల్స్ పై చర్యలు తీసుకుంటూ ఉంటారు. కాని, "false , baseless , defamatory or are they written with Malafide intent." అని ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుంది ? తమకు వచ్చిన సమాచారం ప్రకారం, చేసిన రీసర్చ్ ప్రకారం పత్రికల్లో కధనాలు వస్తాయి. అవి తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన, కేసులు పెట్టి వేదిస్తాం అని, బెదిరిస్తే ఎలా ?

ఈ జీవో వచ్చిన వెంటనే చంద్రబాబు కూడా ట్వీట్ చేసారు. గతంలో ఇదే రకమైన జీవో వైఎస్ఆర్ ఇచ్చినప్పుడు, పోరాడి, అది వెనక్కు వెళ్ళేలా చేసారు. ఇప్పుడు, మళ్ళీ అతని కొడుకు పై, ఇలాంటి పోరాటమే చేస్తున్నారు. ఇది చంద్రబాబు ట్వీట్ "The right to question, criticize and showcase the failures of a govt is fundamental to democracy. YS Jagan Mohan Reddy’s govt has today issued the draconian GO 2430 that aims to curb freedom of expression in AP. This is meant to stifle people's voice on social media. Prodded by the YSRC Party, the Police will now be able to foist false cases to harass media institutions & people who are showcasing the many failures of the Govt. If necessary, we will take the fight to the streets until this oppressive GO is cancelled!"







